For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Bangarraju 17 Days Collections: భారీగా పెరిగిన బంగార్రాజు వసూళ్లు.. హిట్ అవ్వాలంటే అది జరగాల్సిందే

    |

    'సోగ్గాడే చిన్ని నాయన' తర్వాత ఆ రేంజ్ హిట్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు టాలీవుడ్ సీనియర్ హీరో కింగ్ అక్కినేని నాగార్జున. దీని తర్వాత ఆయన వరుస పెట్టి ఎన్నో సినిమాల్లో నటించాడు. కానీ, అవేమీ హిట్‌ను అందించలేకపోయాయి. అయితే, గత ఏడాది చేసిన 'వైల్డ్ డాగ్' మంచి టాక్‌ను అందుకున్నా.. కలెక్షన్లను మాత్రం రాబట్టలేకపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో తన డ్రీమ్ ప్రాజెక్టు 'బంగార్రాజు'ను చేశాడు నాగ్.

    ఇందులో ఆయన కుమారుడు నాగ చైతన్య కూడా నటించాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆరంభంలో మంచి కలెక్షన్లను రాబట్టినా ఇప్పుడు కష్టాలను ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో బంగార్రాజు 17 రోజుల బాక్సాఫీస్ రిపోర్టును చూద్దాం పదండి!

    సంక్రాంతి బరిలోకి అక్కినేని స్టార్లు

    సంక్రాంతి బరిలోకి అక్కినేని స్టార్లు

    అక్కినేని నాగార్జున, నాగ చైతన్య కలయికలో కల్యాణ్ కృష్ణ కురసాల రూపొందించిన చిత్రమే 'బంగార్రాజు'. సోగ్గాడే చిన్ని నాయన చిత్రానికి ఇది సీక్వెల్‌గా వచ్చింది. ఇందులో రమ్యకృష్ణ, కృతి శెట్టి హీరోయిన్లుగా చేశారు. దీన్ని అన్నపూర్ణ స్టూడియోస్, జీ స్టూడియోస్ బ్యానర్లపై నాగార్జున నిర్మించారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన ఈ మూవీ సంక్రాంతికి రిలీజ్ అయింది.

    Pawan Kalyan పై వర్మ సంచలన కామెంట్స్: ఆ సినిమా ఫ్లాప్ అంటూ.. తారక్, బన్నీ, చరణ్‌లపై కూడా!

    బంగార్రాజు మూవీ బిజినెస్ డీటేల్స్

    బంగార్రాజు మూవీ బిజినెస్ డీటేల్స్

    అక్కినేని హీరోల మార్కెట్ ప్రకారం 'బంగార్రాజు' హక్కులకు పోటీ ఏర్పడింది. దీంతో నైజాంలో రూ. 11 కోట్లు, సీడెడ్‌లో రూ. 6 కోట్లు, ఆంధ్రా మొత్తంలో రూ. 17.80 కోట్లతో రెండు రాష్ట్రాల్లో కలిపి రూ. 33.80 కోట్లు బిజినెస్ జరిగింది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.17 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 2.20 కోట్లుతో ప్రపంచ వ్యాప్తంగా రూ. 38.17 కోట్లు బిజినెస్ అయింది.

    17వ రోజు వచ్చిన కలెక్షన్ల వివరాలు

    17వ రోజు వచ్చిన కలెక్షన్ల వివరాలు

    ఆంధ్రా, తెలంగాణలో 'బంగార్రాజు' మూవీకి 17వ రోజు కలెక్షన్లు బాగా పెరిగాయి. ఫలితంగా నైజాంలో రూ. 5 లక్షలు, సీడెడ్‌లో రూ. 8 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 5 లక్షలు, ఈస్ట్‌లో రూ. 4 లక్షలు, వెస్ట్‌లో రూ. 3 లక్షలు, గుంటూరులో రూ. 3 లక్షలు, కృష్ణాలో రూ. 3 లక్షలు, నెల్లూరులో రూ. 2 లక్షలతో రెండు రాష్ట్రాల్లో 17వ రోజు రూ. 33 లక్షలు షేర్, రూ. 55 లక్షలు గ్రాస్ వచ్చింది.

    Bigg Boss OTT: బిగ్ బాస్ ప్రియులకు షాకింగ్ న్యూస్.. వాయిదా పడ్డ తెలుగు సీజన్.. కొత్త డేట్ ఇదే

    17 రోజులకు కలిపి వచ్చింది ఎంత

    17 రోజులకు కలిపి వచ్చింది ఎంత

    'బంగార్రాజు'కు 17 రోజులకు కలిపి ఏపీ తెలంగాణలో కలెక్షన్లు బాగానే వచ్చాయి. దీంతో నైజాంలో రూ. 8.25 కోట్లు, సీడెడ్‌లో రూ. 6.75 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 5.13 కోట్లు, ఈస్ట్‌లో రూ. 4.09 కోట్లు, వెస్ట్‌లో రూ. 2.87 కోట్లు, గుంటూరులో రూ. 3.41 కోట్లు, కృష్ణాలో రూ. 2.23 కోట్లు, నెల్లూరులో రూ. 1.74 కోట్లతో.. రూ. 34.47 కోట్లు షేర్, రూ. 56 కోట్లు గ్రాస్‌ను రాబట్టింది.

    ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంత?

    ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంత?

    17 రోజులకు ఆంధ్రా, తెలంగాణలో కలిపి రూ. 34.47 కోట్లు వసూలు చేసిన బంగార్రాజు.. మిగిలిన ప్రాంతాల్లో పెద్దగా రాణించలేదు. ఫలితంగా రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.76 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 1.48 కోట్లను రాబట్టింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో కలిపి ఈ సినిమా 17 రోజుల్లో రూ. 37.71 కోట్లు షేర్‌తో పాటు రూ. 63.35 కోట్ల గ్రాస్‌ను సొంతం చేసుకుంది.

    సుడిగాలి సుధీర్ రికార్డు బ్రేక్ చేసిన హైపర్ ఆది: ఇద్దరి మధ్య ఏకంగా 30 లక్షలు తేడా!

    టార్గెట్ ఎంత? ఇంకెంత రావాలి?

    టార్గెట్ ఎంత? ఇంకెంత రావాలి?

    క్రేజీ కాంబినేషన్‌లో వచ్చిన 'బంగార్రాజు' అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 38.15 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 39 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా 17 రోజుల్లో రూ. 37.71 కోట్లు వసూలు చేసింది. అంటే మరో రూ. 1.29 కోట్లు వస్తేనే బంగార్రాజు మూవీ హిట్‌ స్టేటస్‌‌ను అందుకుంటుంది.

    English summary
    Akkineni Nagarjuna and Naga Chaitanya Did Bangarraju Movie Under Kalyan Krishna Direction. This Movie Collects Rs 37.71 Crores in 17 Days.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X