Don't Miss!
- News మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లేలా మరింత ఉధృతంగా వైఎస్ జగన్ చివరి విడత ప్రచారం
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్‌లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్‌మి 5G స్మార్ట్‌ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
Bangarraju 18 Days Collections: తగ్గుతున్న బంగార్రాజు హవా.. టార్గెట్ ఇంకా ఫినిష్ అవ్వలేదు!
సంక్రాంతి హడావుడిలో భారీగా విడుదలైన చిత్రాల్లో బంగార్రాజు ఒకటి. ఈ సినిమా గతంలో వచ్చిన సోగ్గాడే చిన్ని నాయనా సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కిన విషయం తెలిసిందే. నాగార్జున, నాగచైతన్య కలిసి నటించిన ఈ సినిమాను కళ్యాణ్ కృష్ణ డైరెక్ట్ చేశాడు. ఇక జనవరి 14న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఓపెనింగ్స్ అయితే బాగానే అందుకుంది. ఇక సినిమాకు 18వ రోజు వచ్చిన కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి.
Recommended Video
బిజినెస్ ఎంతంటే..
బంగార్రాజు సినిమా సంక్రాంతికి పర్ఫెక్ట్ మూవీ కావడంతో ఈ సినిమా హక్కుల కోసం బయ్యర్లు బాగానే పోటీ పడ్డారు. దీంతో నైజాంలో రూ. 11 కోట్లు, సీడెడ్‌లో రూ. 6 కోట్లు, ఆంధ్రా మొత్తంలో రూ. 17.80 కోట్లతో రెండు రాష్ట్రాల్లో కలిపి రూ. 33.80 కోట్లు బిజినెస్ జరిగింది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.17 కోట్లు, ఓవర్సీస్లో రూ. 2.20 కోట్లుతో ప్రపంచ వ్యాప్తంగా రూ. 38.17 కోట్లు బిజినెస్ జరిగింది.
18వ రోజు వచ్చిన వసూళ్లు
బంగార్రాజు మూవీకి 18వ రోజు ఆంధ్ర నైజాంలో వచ్చిన కలెక్షన్లు ఈ విధంగా ఉన్నాయి. నైజాంలో రూ. 2 లక్షలు, సీడెడ్‌లో రూ. 4 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 3 లక్షలు, ఈస్ట్‌లో రూ. 2 లక్షలు, వెస్ట్‌లో రూ. 1 లక్షలు, గుంటూరులో రూ. 1 లక్షలు, కృష్ణాలో రూ. 1 లక్షలు, నెల్లూరులో రూ. 1 లక్షలతో రెండు రాష్ట్రాల్లో 18వ రోజు రూ. 15 లక్షలు షేర్, రూ. 25 లక్షలు గ్రాస్ వచ్చింది.
తెలుగు రాష్ట్రాల్లో..
18 రోజులకు కలిపి ఆంద్రప్రదేశ్ తెలంగాణలో వసూళ్లు బాగానే వచ్చాయి. ఇక నైజాంలో టోటల్ రూ. 8.27 కోట్లు, సీడెడ్‌లో రూ. 6.79 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 5.16 కోట్లు, ఈస్ట్‌లో రూ. 4.11 కోట్లు, వెస్ట్‌లో రూ. 2.88 కోట్లు, గుంటూరులో రూ. 3.42 కోట్లు, కృష్ణాలో రూ. 2.24 కోట్లు, నెల్లూరులో రూ. 1.75 కోట్లతో.. రూ. 34.62 కోట్లు షేర్, రూ. 56.25 కోట్లు గ్రాస్‌ను రాబట్టింది.
వరల్డ్ వైడ్ గా..
18 రోజులకు గాను ఆంధ్రా, తెలంగాణలో కలిపి రూ. 34.62 కోట్లు వసూలు చేసిన బంగార్రాజు.. మిగిలిన రాష్ట్రాల్లో పెద్దగా కలెక్ట్ చేయలేకపోయింది. కర్ణాటక + రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.77 కోట్లు, ఓవర్సీస్లో రూ. 1.48 కోట్లను రాబట్టింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో కలిపి ఈ సినిమా 17 రోజుల్లో రూ. 37.87 కోట్లు షేర్‌తో పాటు రూ. 63.65 కోట్ల గ్రాస్‌ను సొంతం చేసుకుంది.
ప్రాఫిట్స్ లోకి రావాలి అంటే..
'బంగార్రాజు' అంచనాలకు తగ్గట్టుగా ఓపెనింగ్స్ బాగానే అందుకుంది. కానీ ఫెస్టివల్ అనంతరం కలెక్షన్స్ అనుకున్నంతగా పెరగలేదు. ఇక వరల్డ్ వైడ్ గా వ్యాప్తంగా రూ. 38.15 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అంటే బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 39 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా 18 రోజుల్లో రూ. 37.87 కోట్ల షేర్ వసూలు చేసింది. అంటే ఇంకా లాభల్లోకి రావాలి అంటే మరో రూ. 1.13 కోట్లు షేర్ వస్తేనే బంగార్రాజు మూవీ హిట్ అయినట్లు లెక్క.