twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Bangarraju 18 Days Collections: తగ్గుతున్న బంగార్రాజు హవా.. టార్గెట్ ఇంకా ఫినిష్ అవ్వలేదు!

    |

    సంక్రాంతి హడావుడిలో భారీగా విడుదలైన చిత్రాల్లో బంగార్రాజు ఒకటి. ఈ సినిమా గతంలో వచ్చిన సోగ్గాడే చిన్ని నాయనా సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కిన విషయం తెలిసిందే. నాగార్జున, నాగచైతన్య కలిసి నటించిన ఈ సినిమాను కళ్యాణ్ కృష్ణ డైరెక్ట్ చేశాడు. ఇక జనవరి 14న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఓపెనింగ్స్ అయితే బాగానే అందుకుంది. ఇక సినిమాకు 18వ రోజు వచ్చిన కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి.

    Recommended Video

    Bangarraju పట్టిందల్లా బంగారమే.. Break Even దిశగా Sankranthi Winner| Filmibeat Telugu
    బిజినెస్ ఎంతంటే..

    బిజినెస్ ఎంతంటే..

    బంగార్రాజు సినిమా సంక్రాంతికి పర్ఫెక్ట్ మూవీ కావడంతో ఈ సినిమా హక్కుల కోసం బయ్యర్లు బాగానే పోటీ పడ్డారు. దీంతో నైజాంలో రూ. 11 కోట్లు, సీడెడ్‌లో రూ. 6 కోట్లు, ఆంధ్రా మొత్తంలో రూ. 17.80 కోట్లతో రెండు రాష్ట్రాల్లో కలిపి రూ. 33.80 కోట్లు బిజినెస్ జరిగింది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.17 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 2.20 కోట్లుతో ప్రపంచ వ్యాప్తంగా రూ. 38.17 కోట్లు బిజినెస్ జరిగింది.

     18వ రోజు వచ్చిన వసూళ్లు

    18వ రోజు వచ్చిన వసూళ్లు

    బంగార్రాజు మూవీకి 18వ రోజు ఆంధ్ర నైజాంలో వచ్చిన కలెక్షన్లు ఈ విధంగా ఉన్నాయి. నైజాంలో రూ. 2 లక్షలు, సీడెడ్‌లో రూ. 4 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 3 లక్షలు, ఈస్ట్‌లో రూ. 2 లక్షలు, వెస్ట్‌లో రూ. 1 లక్షలు, గుంటూరులో రూ. 1 లక్షలు, కృష్ణాలో రూ. 1 లక్షలు, నెల్లూరులో రూ. 1 లక్షలతో రెండు రాష్ట్రాల్లో 18వ రోజు రూ. 15 లక్షలు షేర్, రూ. 25 లక్షలు గ్రాస్ వచ్చింది.

    తెలుగు రాష్ట్రాల్లో..

    తెలుగు రాష్ట్రాల్లో..

    18 రోజులకు కలిపి ఆంద్రప్రదేశ్ తెలంగాణలో వసూళ్లు బాగానే వచ్చాయి. ఇక నైజాంలో టోటల్ రూ. 8.27 కోట్లు, సీడెడ్‌లో రూ. 6.79 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 5.16 కోట్లు, ఈస్ట్‌లో రూ. 4.11 కోట్లు, వెస్ట్‌లో రూ. 2.88 కోట్లు, గుంటూరులో రూ. 3.42 కోట్లు, కృష్ణాలో రూ. 2.24 కోట్లు, నెల్లూరులో రూ. 1.75 కోట్లతో.. రూ. 34.62 కోట్లు షేర్, రూ. 56.25 కోట్లు గ్రాస్‌ను రాబట్టింది.

    వరల్డ్ వైడ్ గా..

    వరల్డ్ వైడ్ గా..

    18 రోజులకు గాను ఆంధ్రా, తెలంగాణలో కలిపి రూ. 34.62 కోట్లు వసూలు చేసిన బంగార్రాజు.. మిగిలిన రాష్ట్రాల్లో పెద్దగా కలెక్ట్ చేయలేకపోయింది. కర్ణాటక + రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.77 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 1.48 కోట్లను రాబట్టింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో కలిపి ఈ సినిమా 17 రోజుల్లో రూ. 37.87 కోట్లు షేర్‌తో పాటు రూ. 63.65 కోట్ల గ్రాస్‌ను సొంతం చేసుకుంది.

    ప్రాఫిట్స్ లోకి రావాలి అంటే..

    ప్రాఫిట్స్ లోకి రావాలి అంటే..

    'బంగార్రాజు' అంచనాలకు తగ్గట్టుగా ఓపెనింగ్స్ బాగానే అందుకుంది. కానీ ఫెస్టివల్ అనంతరం కలెక్షన్స్ అనుకున్నంతగా పెరగలేదు. ఇక వరల్డ్ వైడ్ గా వ్యాప్తంగా రూ. 38.15 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అంటే బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 39 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా 18 రోజుల్లో రూ. 37.87 కోట్ల షేర్ వసూలు చేసింది. అంటే ఇంకా లాభల్లోకి రావాలి అంటే మరో రూ. 1.13 కోట్లు షేర్ వస్తేనే బంగార్రాజు మూవీ హిట్‌ అయినట్లు లెక్క.

    English summary
    Bangarraju movie 18 days world wide collections..
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X