Bangarraju 19 Days Collections: మళ్లీ పడిపోయిన బంగార్రాజు వసూళ్లు.. ఇండియాలోనే టాప్ మూవీగా రికార్డు

తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్న హీరోల్లో కింగ్ అక్కినేని నాగార్జున ఒకడు. బ్యాగ్రౌండ్ ఉన్నా తన టాలెంట్లతో స్టార్‌గా ఎదిగిపోయిన అతడు.. వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ దూసుకుపోతూనే ఉన్నాడు. అయితే, కొంత కాలంగా హిట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేసినా ఫలితం మాత్రం దక్కడం లేదు.

ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవలే తన కొడుకు నాగ చైతన్యతో కలిసి 'బంగార్రాజు' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. క్రేజీ కాంబినేషన్‌లో సంక్రాంతి బరిలో నిలిచిన ఈ మూవీకి ఆరంభంలో మంచి కలెక్షన్లే వచ్చినా క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో 19 రోజుల్లో ఈ చిత్రం ఎంత వసూలు చేసిందో చూద్దాం పదండి!

పండుగకు రచ్చ చేసిన బంగార్రాజు

పండుగకు రచ్చ చేసిన బంగార్రాజు

అక్కినేని నాగార్జున, నాగ చైతన్య హీరోలుగా కల్యాణ్ కృష్ణ కురసాల రూపొందించిన చిత్రమే ‘బంగార్రాజు'. సోగ్గాడే చిన్ని నాయన చిత్రానికి ఇది సీక్వెల్‌గా తెరకెక్కింది. ఇందులో రమ్యకృష్ణ, కృతి శెట్టి హీరోయిన్లుగా చేశారు. దీన్ని అన్నపూర్ణ స్టూడియోస్, జీ స్టూడియోస్ బ్యానర్లపై నాగార్జున నిర్మించారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన ఈ మూవీ సంక్రాంతికి విడుదలైంది.

బంగార్రాజు మూవీ బిజినెస్ డీటేల్స్

బంగార్రాజు మూవీ బిజినెస్ డీటేల్స్

మల్టీస్టారర్‌గా వచ్చిన ‘బంగార్రాజు' మూవీ హక్కులకు పోటీ ఏర్పడింది. దీంతో నైజాంలో రూ. 11 కోట్లు, సీడెడ్‌లో రూ. 6 కోట్లు, ఆంధ్రా మొత్తంలో రూ. 16.80 కోట్లతో రెండు రాష్ట్రాల్లో కలిపి రూ. 33.80 కోట్లు బిజినెస్ జరిగింది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.15 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 2.20 కోట్లుతో ప్రపంచ వ్యాప్తంగా రూ. 38.15 కోట్లు బిజినెస్ జరిగిందని టాక్.

19వ రోజు వచ్చిన కలెక్షన్ల వివరాలు

19వ రోజు వచ్చిన కలెక్షన్ల వివరాలు

సంక్రాంతి సీజన్‌లో సోలో భారీ చిత్రంగా వచ్చిన ‘బంగార్రాజు' మూవీకి ఆరంభంలో కలెక్షన్లు భారీగా వచ్చాయి. అయితే, ఆ తర్వాత ప్రతికూల పరిస్థితులు ఎదురైన నేపథ్యంతో వసూళ్లు క్రమంగా తగ్గుతూ వచ్చాయి. మరీ ముఖ్యంగా ఏపీ, తెలంగాణలోనూ ఇది బాగా డ్రాప్ అయింది. ఈ క్రమంలోనే రెండు రాష్ట్రాల్లో 19వ రోజు రూ. 12 లక్షలు షేర్‌ను మాత్రమే వసూలు చేసింది.

19 రోజులకు కలిపి వచ్చింది ఎంత

19 రోజులకు కలిపి వచ్చింది ఎంత

19 రోజులకు కలిపి ‘బంగార్రాజు'కు ఏపీ తెలంగాణలో కలెక్షన్లు బాగానే వచ్చాయి. దీంతో నైజాంలో రూ. 8.29 కోట్లు, సీడెడ్‌లో రూ. 6.82 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 5.19 కోట్లు, ఈస్ట్‌లో రూ. 4.12 కోట్లు, వెస్ట్‌లో రూ. 2.89 కోట్లు, గుంటూరులో రూ. 3.43 కోట్లు, కృష్ణాలో రూ. 2.25 కోట్లు, నెల్లూరులో రూ. 1.75 కోట్లతో.. రూ. 34.74 కోట్లు షేర్, రూ. 56.45 కోట్లు గ్రాస్‌ను రాబట్టింది.

ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంత?

ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంత?

ఆంధ్రా, తెలంగాణలో కలిపి 19 రోజులకు రూ. 34.74 కోట్లు వసూలు చేసిన బంగార్రాజు.. మిగిలిన ప్రాంతాల్లో పెద్దగా రాణించలేదు. ఫలితంగా రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.78 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 1.48 కోట్లను రాబట్టింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో కలిపి ఈ సినిమా 19 రోజుల్లో రూ. 38 కోట్లు షేర్‌తో పాటు రూ. 63.87 కోట్ల గ్రాస్‌ను మాత్రమే సొంతం చేసుకుంది.

టార్గెట్ ఎంత? ఇంకెంత రావాలి?

టార్గెట్ ఎంత? ఇంకెంత రావాలి?

సంక్రాంతి బరిలో నిలిచిన ‘బంగార్రాజు' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 38.15 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 39 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా 19 రోజుల్లో రూ. 38 కోట్లు వసూలు చేసింది. అంటే మరో రూ. కోటి వస్తేనే బంగార్రాజు మూవీ హిట్‌ స్టేటస్‌‌ను సొంతం చేసుకుంటుంది.

Recommended Video

Bangarraju Movie : Akkineni Nagarjuna Teases Krithi Shetty | Naga Chaitanya | Filmibeat Telugu
ఇండియాలోనే నెంబర్ వన్ మూవీ

ఇండియాలోనే నెంబర్ వన్ మూవీ

కరోనా వైరస్ విజృంభణతో భారతదేశంలోని చాలా రాష్ట్రాల్లో థియేటర్లు మూతపడిపోయాయి. దీంతో ఏ భాషలోనూ పెద్దగా సినిమాలు విడుదల కాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ‘బంగార్రాజు' మూవీ మాత్రమే భారీ చిత్రంగా వచ్చింది. ఇక, ఇది ఇప్పటి వరకూ.. రూ. 38 కోట్లు షేర్‌తో పాటు రూ. 63.87 కోట్ల గ్రాస్‌ను వసూలు చేసి.. ఇండియాలోనే నెంబర్ వన్ మూవీగా నిలిచింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X