Don't Miss!
- Finance
క్రిప్టో మార్కెట్ లాభాల్లోనే ఉంది, కానీ బిట్ కాయిన్ 30,000 డాలర్లకు దిగువనే
- News
ఆధార్ కార్డ్ జిరాక్స్‌లను అందరితో పంచుకోవద్దు: ‘మాస్క్డ్ ఆధార్’పై కేంద్రం తాజా ఉత్తర్వలు
- Sports
ఆయన వల్లే ఫైనల్‌కు చేరాం.. నా సత్తా మొత్తం బయటికి తీసాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle
విరేచనాలు ఎక్కువ అయ్యిందా? ఈ టీలో ఏదైనా తాగితే వెంటనే ఆగిపోతాయి ...
- Automobiles
Eeco ప్రియులకు గుడ్ న్యూస్.. ఎందుకో ఇక్కడ చూడండి
- Technology
ఆపిల్ వాచ్‌లో ఎయిర్టెల్ Wynk మ్యూజిక్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌కి యాక్సెస్!!
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
Bangarraju 1st Week Collections: 39 కోట్ల టార్గెట్.. వారంలోనే షాకింగ్‌గా.. ఇంకెంత వస్తే హిట్ అంటే!
తెలుగు సినీ ఇండస్ట్రీకి సంక్రాంతి సీజన్ ఎంత ముఖ్యమైనదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే ఈ పండుగ సందర్భంగా చాలా సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తుంటాయి. అయితే, ఈ ఏడాది మాత్రం కరోనా మహమ్మారి పుణ్యమా అని సంక్రాంతికి రావాల్సిన చాలా బడా చిత్రాలు వాయిదా పడిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సీజన్లో భారీ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిందే 'బంగార్రాజు'. అక్కినేని నాగార్జున, నాగ చైతన్య కలిసి నటించిన ఈ సినిమాకు మంచి టాక్ వచ్చింది.
దీంతో కలెక్షన్లు కూడా భారీగానే వచ్చాయి. అయితే, ఇప్పుడు మాత్రం క్రమంగా తగ్గుతున్నాయి. ఈ నేపథ్యంలో 'బంగార్రాజు' మూవీ వారం రోజుల కలెక్షన్ల రిపోర్టుపై ఓ లుక్కేద్దాం పదండి!

‘బంగార్రాజు'తో అక్కినేని హీరోలు
అక్కినేని నాగార్జున, నాగ చైతన్య కాంబినేషన్లో కల్యాణ్ కృష్ణ కురసాల తెరకెక్కించిన చిత్రమే 'బంగార్రాజు'. నాలుగేళ్ల క్రితం వచ్చిన 'సోగ్గాడే చిన్ని నాయన'కు ఇది సీక్వెల్‌గా రూపొందింది. ఇందులో రమ్యకృష్ణ, కృతి శెట్టి హీరోయిన్లుగా నటించారు. దీన్ని అన్నపూర్ణ స్టూడియోస్, జీ స్టూడియోస్ బ్యానర్లపై నాగార్జున నిర్మించారు. అనూప్ రూబెన్స్ సంగీతం ఇచ్చాడు.
నా బాడీలో అవి అంటేనే ఇష్టం: నెటిజన్ వింత ప్రశ్నకు శృతి హాసన్ ఊహించని జవాబు

బంగార్రాజు మూవీ బిజినెస్ డీటేల్స్
అక్కినేని హీరోలు చేసిన 'బంగార్రాజు' మూవీ రైట్స్‌కు పోటీ ఏర్పడింది. దీంతో నైజాంలో రూ. 11 కోట్లు, సీడెడ్‌లో రూ. 6 కోట్లు, ఆంధ్రా మొత్తంలో రూ. 16.80 కోట్లతో రెండు రాష్ట్రాల్లో కలిపి రూ. 33.80 కోట్లు బిజినెస్ జరిగింది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.15 కోట్లు, ఓవర్సీస్లో రూ. 2.20 కోట్లుతో ప్రపంచ వ్యాప్తంగా రూ. 38.15 కోట్ల మేర బిజినెస్ అయింది.

ఏడో రోజు వచ్చిన కలెక్షన్ల వివరాలు
'బంగార్రాజు' మూవీకి ఏడో రోజూ ఏపీ, తెలంగాణలో కలెక్షన్లు తగ్గాయి. ఫలితంగా నైజాంలో రూ. 6 లక్షలు, సీడెడ్‌లో రూ. 10 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 14 లక్షలు, ఈస్ట్‌లో రూ. 9 లక్షలు, వెస్ట్‌లో రూ. 4 లక్షలు, గుంటూరులో రూ. 4 లక్షలు, కృష్ణాలో రూ. 2 లక్షలు, నెల్లూరులో రూ. 2 లక్షలతో కలిపి రెండు రాష్ట్రాల్లో 7వ రోజు రూ. 51 లక్షలు షేర్, రూ. 80 లక్షలు గ్రాస్ వచ్చింది.
దారుణమైన ఫొటోలతో షాకిచ్చిన అమలా పాల్: ఆమెను ఇంత హాట్‌గా ఎప్పుడూ చూసుండరు

వారం రోజులకూ కలిపి వచ్చిందిలా!
'బంగార్రాజు'కు మొదటి వారం తెలుగు రాష్ట్రాలో మంచి కలెక్షన్లు వచ్చాయి. దీంతో నైజాంలో రూ. 7.62 కోట్లు, సీడెడ్‌లో రూ. 5.93 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 4.37 కోట్లు, ఈస్ట్‌లో రూ. 3.53 కోట్లు, వెస్ట్‌లో రూ. 2.54 కోట్లు, గుంటూరులో రూ. 3.03 కోట్లు, కృష్ణాలో రూ. 1.94 కోట్లు, నెల్లూరులో రూ. 1.52 కోట్లతో.. 7 రోజుల్లో రూ. 30.48 కోట్లు షేర్, రూ. 49.30 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంత?
తెలుగు రాష్ట్రాల్లో వారం రోజులకు రూ. 30.48 కోట్లు వసూలు చేసిన బంగార్రాజు మూవీ.. మిగిలిన ప్రాంతాల్లోనూ సత్తా చాటింది. ఫలితంగా రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.62 కోట్లు, ఓవర్సీస్లో రూ. 1.35 కోట్లను రాబట్టింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో కలిపి ఈ సినిమా మొదటి వారం రోజుల్లోనే రూ. 33.45 కోట్లు షేర్‌తో పాటు రూ. 56 కోట్ల గ్రాస్‌ను సొంతం చేసుకుంది.
ముక్కు అవినాష్‌కు షాకిచ్చిన ఛానెల్: జబర్ధస్త్ మానేసి వస్తే.. వీళ్లు కూడా పక్కన పెట్టేశారంటూ!

టార్గెట్ ఎంత? ఇంకెంత రావాలంటే
ఎంతో ప్రతిష్టాత్మకంగా వచ్చిన 'బంగార్రాజు' అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 38.15 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 39 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా వారం రోజుల్లోనే రూ. 33.45 కోట్లు వసూలు చేసింది. అంటే మరో రూ. 5.55 కోట్లు వసూలు చేస్తేనే ఇది హిట్ స్టేటస్‌ను అందుకుంటుంది.

‘బంగార్రాజు'కు కష్టాలు మొదలు
సంక్రాంతి పండుగ మూడు రోజులూ 'బంగార్రాజు' మూవీ కలెక్షన్లు కుమ్మేసింది. అయితే, జనవరి 18 నుంచి ఆంధ్రప్రదేశ్‌లో నైట్ కర్ఫ్యూ పెట్టారు. అలాగే, ఆక్యూపెన్సీని కూడా యాభై శాతానికి తగ్గించారు. దీంతో ఈ చిత్రానికి కష్టాలు మొదలయ్యాయనే చెప్పాలి. అందుకే రెండు రోజుల నుంచి ఈ సినిమా కలెక్షన్లు క్రమంగా తగ్గుతున్నాయి. మరి టార్గెట్ చేరుతుందో లేదో చూడాలి.