Bangarraju 14 Days Collections: 39 కోట్ల టార్గెట్.. ఫస్ట్ వీక్ భారీగా.. రెండో వారంలో మాత్రం ఇంతే!

తెలుగు సినీ ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. దీనికి కారణం ఈ కుటుంబం నుంచి చాలా మంది హీరోలుగా పరిచయం అవడమే. అంతేకాదు, అందులో పలువురు స్టార్లుగా వెలుగొందుతున్నారు కూడా. ఈ కుటుంబం నుంచి చాలా ఏళ్ల క్రితం 'మనం' అనే ప్రత్యేకమైన మల్టీస్టారర్ మూవీ వచ్చి సూపర్ డూపర్ హిట్ అయింది.

Recommended Video

Akkineni Nagarjuna Whistle Podu Moment At Bangarraju Musical Night Part 3 | Filmibeat Telugu

ఇక, సుదీర్ఘ విరామం తర్వాత ఇప్పుడు అదే ఫ్యామిలీ హీరోలు అక్కినేని నాగార్జున.. నాగ చైతన్య కలిసి 'బంగార్రాజు' అనే సినిమాలో నటించారు. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి. అందుకు అనుగుణంగానే కలెక్షన్లను రాబడుతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా రెండు వారాల రిపోర్టును చూద్దాం పదండి!

సంక్రాంతి బరిలో దిగిన బంగార్రాజు

సంక్రాంతి బరిలో దిగిన బంగార్రాజు

అక్కినేని నాగార్జున, నాగ చైతన్య హీరోలుగా రూపొందిన చిత్రమే ‘బంగార్రాజు'. కల్యాణ్ కృష్ణ తెరకెక్కించిన ఈ మూవీ ‘సోగ్గాడే చిన్ని నాయన'కు సీక్వెల్‌గా వచ్చింది. ఇందులో రమ్యకృష్ణ, కృతి శెట్టి హీరోయిన్లుగా చేశారు. దీన్ని అన్నపూర్ణ స్టూడియోస్, జీ స్టూడియోస్ బ్యానర్లపై నాగార్జున నిర్మించారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన ఈ మూవీ సంక్రాంతికి విడుదలైంది.

బంగార్రాజు మూవీ బిజినెస్ డీటేల్స్

బంగార్రాజు మూవీ బిజినెస్ డీటేల్స్

భారీ మల్టీస్టారర్‌గా వచ్చిన ‘బంగార్రాజు' హక్కులకు పోటీ ఏర్పడింది. దీంతో నైజాంలో రూ. 11 కోట్లు, సీడెడ్‌లో రూ. 6 కోట్లు, ఆంధ్రా మొత్తంలో రూ. 16.80 కోట్లతో రెండు రాష్ట్రాల్లో కలిపి రూ. 33.80 కోట్లు బిజినెస్ జరిగింది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.15 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 2.20 కోట్లుతో ప్రపంచ వ్యాప్తంగా రూ. 38.15 కోట్ల మేర బిజినెస్ అయింది.

14వ రోజు వచ్చిన కలెక్షన్ల వివరాలు

14వ రోజు వచ్చిన కలెక్షన్ల వివరాలు

‘బంగార్రాజు' మూవీకి 14వ రోజు ఆంధ్రా, తెలంగాణలో కలెక్షన్లు భారీగా తగ్గాయి. ఫలితంగా నైజాంలో రూ. 4 లక్షలు, సీడెడ్‌లో రూ. 6 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 5 లక్షలు, ఈస్ట్‌లో రూ. 3 లక్షలు, వెస్ట్‌లో రూ. 2 లక్షలు, గుంటూరులో రూ. 3 లక్షలు, కృష్ణాలో రూ. 2 లక్షలు, నెల్లూరులో రూ. 1 లక్షలతో రెండు రాష్ట్రాల్లో 14వ రోజు రూ. 26 లక్షలు షేర్, రూ. 50 లక్షలు గ్రాస్ వచ్చింది.

2 వారాలకు కలిపి వచ్చింది ఎంత

2 వారాలకు కలిపి వచ్చింది ఎంత

రెండు వారాలకు కలిపి ‘బంగార్రాజు'కు ఏపీ తెలంగాణలో కలెక్షన్లు బాగానే వచ్చాయి. దీంతో నైజాంలో రూ. 8.14 కోట్లు, సీడెడ్‌లో రూ. 6.59 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 5.01 కోట్లు, ఈస్ట్‌లో రూ. 4 కోట్లు, వెస్ట్‌లో రూ. 2.81 కోట్లు, గుంటూరులో రూ. 3.35 కోట్లు, కృష్ణాలో రూ. 2.18 కోట్లు, నెల్లూరులో రూ. 1.70 కోట్లతో.. రూ. 33.78 కోట్లు షేర్, రూ. 54.80 కోట్లు గ్రాస్‌ను రాబట్టింది.

ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంత?

ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంత?

ఏపీ, తెలంగాణలో కలిపి 2 వారాలకు రూ. 33.78 కోట్లు వసూలు చేసిన బంగార్రాజు మూవీ.. మిగిలిన ప్రాంతాల్లోనూ స్లోగా నడిచింది. ఫలితంగా రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.74 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 1.46 కోట్లను రాబట్టింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో కలిపి ఈ సినిమా 2 వారాల్లోనే రూ. 36.98 కోట్లు షేర్‌తో పాటు రూ. 62.10 కోట్ల గ్రాస్‌ను సొంతం చేసుకుంది.

 టార్గెట్ ఎంత? ఇంకెంత రావాలి?

టార్గెట్ ఎంత? ఇంకెంత రావాలి?

సంక్రాంతికి వచ్చిన ‘బంగార్రాజు' అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 38.15 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 39 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా రెండు వారాల్లోనే రూ. 36.98 కోట్లు వసూలు చేసింది. అంటే మరో రూ. 2.02 కోట్లు వస్తేనే ఈ మూవీ హిట్‌ స్టేటస్‌‌ను సొంతం చేసుకుంటుంది.

మొదటి వారం భారీగా.. ఇప్పుడిలా

మొదటి వారం భారీగా.. ఇప్పుడిలా

ఆరంభంలోనే భారీ స్పందనను అందుకున్న బంగార్రాజు మూవీకి కొద్ది రోజులుగా వసూళ్లు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. ఫలితంగా మొదటి వారం రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 33.45 కోట్లు షేర్‌ను రాబట్టిన ఈ సినిమా.. రెండో వారంలో మాత్రం కేవలం రూ. 3.53 కోట్లు మాత్రమే వసూలు చేసింది. ఏపీలో నెలకొన్న పరిస్థితుల కారణంగా ఇంత డౌన్ అయినట్లు టాక్ వినిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X