twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Bangarraju 20 Days Collections: బంగార్రాజు సందడి ముగిసినట్టే.. ఇంకా ఎంత రావాలంటే?

    |

    సంక్రాంతి సెంటిమెంట్ తో వచ్చిన బంగార్రాజు సినిమా గతంలో వచ్చిన సోగ్గాడే చిన్ని నాయనా సినిమా తరహాలోనే సక్సెస్ అందుకోవాలని అనుకుంది. నాగార్జున, నాగచైతన్య కలిసి నటించిన ఈ సినిమా మొదటివారంలో వసూళ్లను బాగానే అందుకుంది. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. ఇక సినిమాకు 20వ రోజు వచ్చిన కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి.

    ప్రీ రిలీక్ బిజినెస్ ..

    ప్రీ రిలీక్ బిజినెస్ ..

    బంగార్రాజు సినిమాకు సంక్రాంతిలో మిగతా సినిమాల నుంచి పెద్దగా పోటి లేకపోవడంతో ఈ సినిమాకు ఒక్కసారిగా డిమాండ్ ఏర్పడింది. ఇక హక్కుల కోసం బయ్యర్లు బాగానే పోటీ పడ్డారు. ఇక సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు ఈ విధంగా ఉన్నాయి.

    నైజాంలో రూ. 11 కోట్లు, సీడెడ్‌లో రూ. 6 కోట్లు, ఆంధ్రా మొత్తంలో రూ. 17.80 కోట్లతో రెండు రాష్ట్రాల్లో కలిపి రూ. 33.80 కోట్లు బిజినెస్ జరిగింది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.17 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 2.20 కోట్లుతో ప్రపంచ వ్యాప్తంగా రూ. 38.17 కోట్లు బిజినెస్ జరిగింది.

    20వ రోజు వచ్చిన వసూళ్లు

    20వ రోజు వచ్చిన వసూళ్లు

    బంగార్రాజు మూవీకి మొదటి వారం తప్పితే మిగతా రోజుల్లో పెద్దగా వసూళ్లు అయితే రాలేదు. 20రోజు కూడా ఆంధ్ర నైజాంలో చాలా తక్కువ కలెక్షన్స్ వచ్చాయి. 19వ రోజు 12 లక్షల షేర్ రాగా 20 రోజు ఒక్కసారిగా తెలుగు రాష్ట్రాల్లో తగ్గిపోయాయి. దీంతో ఈ సినిమాకు బుధవారం 10 లక్షల షేర్ మాత్రమే లభించింది. చిత్ర యూనిట్ సభ్యులు ప్రమోషన్ చేయడం కూడా మానేశారు.

    రెండు రాష్ట్రాల్లో కలిపి..

    రెండు రాష్ట్రాల్లో కలిపి..

    20 రోజులకు కలిపి బంగార్రాజుకు ఆంద్రప్రదేశ్ తెలంగాణలో కలెక్షన్స్ బాగానే వచ్చాయి. ఏరియాల వారిగా పరిశీలిస్తే.. నైజాంలో టోటల్ రూ. 8.30 కోట్లు, సీడెడ్‌లో రూ. 6.85 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 5.21 కోట్లు, ఈస్ట్‌లో రూ. 4.14 కోట్లు, వెస్ట్‌లో రూ. 2.90 కోట్లు, గుంటూరులో రూ. 3.44 కోట్లు, కృష్ణాలో రూ. 2.25 కోట్లు, నెల్లూరులో రూ. 1.75 కోట్లతో.. రూ. 34.84 కోట్లు షేర్, రూ. 56.63 కోట్లు గ్రాస్‌ను రాబట్టింది.

    ప్రపంచవ్యాప్తంగా..

    ప్రపంచవ్యాప్తంగా..

    20 రోజులకు ఆంధ్రా, తెలంగాణలో కలిపి రూ. 34.84 కోట్లు వసూలు చేసిన బంగార్రాజు.. మిగిలిన రాష్ట్రాల్లో పెద్దగా కలెక్ట్ చేయలేకపోయింది. కర్ణాటక + రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.77 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 1.79 కోట్లను రాబట్టింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో కలిపి ఈ సినిమా 20 రోజుల్లో రూ. 38.12 కోట్లు షేర్‌తో పాటు రూ. 64.07 కోట్ల గ్రాస్‌ను సొంతం చేసుకుంది.

    Recommended Video

    Akkineni Nagarjuna,Nagachaitanya,Krithi Shetty Speeches| Bangarraju Musical Night | Filmibeat Telugu
    ఇంకా ఎంత రావాలి అంటే..

    ఇంకా ఎంత రావాలి అంటే..

    'బంగార్రాజు' మొత్తానికి అంచనాలకు తగ్గట్టుగా ఓపెనింగ్స్ అయితే బాగానే అందుకుంది. కానీ ఫెస్టివల్ అనంతరం సినిమా కలెక్షన్స్ ఒక్కసారిగా తగ్గిపోయాయి. వరల్డ్ వైడ్ గా వ్యాప్తంగా రూ. 38.12 కోట్లు మేర బిజినెస్ చేసిన ఈ బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 39 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా 20 రోజుల్లో వరల్డ్ వైడ్ గా రూ. 38.12 కోట్ల షేర్ వసూలు చేసింది. ఇంకా లాభల్లోకి రావాలి అంటే సినిమా రూ. 88 లక్షల షేర్ ను అందుకోవాలి. మరి బంగార్రాజు ఆ టార్గెట్ ను ఈ వారంలో అయినా అందుకుంటుందో లేదో చూడాలి.

    English summary
    Bangarraju movie 20 days world wide collections..
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X