Bangarraju 3 Weeks Collections: 39 కోట్ల బిజినెస్.. మూడు వారాల్లో అన్ని కోట్లు.. ఇంకెంత రావాలంటే!

కొంత కాలంగా హిట్లు లేక తెగ ఇబ్బందులు పడుతున్నాడు టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున. అయినప్పటికీ ఆయన రిజల్ట్‌తో సంబంధం లేకుండా వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేస్తూనే ఉన్నారు. కానీ, విజయాలను అందుకోవడంలో మాత్రం సక్సెస్ కాలేకపోతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో తన కుమారుడు యువ సామ్రాట్ నాగ చైతన్యతో కలిసి 'బంగార్రాజు' అనే సినిమాలో నటించాడు. క్రేజీ కాంబినేషన్‌లో సంక్రాంతి బరిలో నిలిచిన ఈ మూవీకి ఆరంభంలో మంచి టాక్ వచ్చింది. దీంతో కలెక్షన్లు కూడా మంచిగానే వచ్చాయి. అయితే కొద్ది రోజులుగా క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మూడు వారాల్లో ఈ చిత్రం ఎంత వసూలు చేసిందో చూద్దాం పదండి!

సంక్రాంతికి రచ్చ చేసిన బంగార్రాజు

సంక్రాంతికి రచ్చ చేసిన బంగార్రాజు

అక్కినేని నాగార్జున, నాగ చైతన్య కాంబోలో కల్యాణ్ కృష్ణ కురసాల తెరకెక్కించిన సినిమానే ‘బంగార్రాజు'. సోగ్గాడే చిన్ని నాయన చిత్రానికి ఇది సీక్వెల్‌గా తెరకెక్కింది. ఇందులో రమ్యకృష్ణ, కృతి శెట్టి హీరోయిన్లుగా చేశారు. దీన్ని అన్నపూర్ణ స్టూడియోస్, జీ స్టూడియోస్ బ్యానర్లపై నాగార్జున నిర్మించారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన ఈ మూవీ సంక్రాంతికి రిలీజ్ అయింది.

బంగార్రాజు మూవీ బిజినెస్ డీటేల్స్

బంగార్రాజు మూవీ బిజినెస్ డీటేల్స్

సంక్రాంతి బరిలో నిలిచిన ‘బంగార్రాజు' మూవీ హక్కులకు పోటీ ఏర్పడింది. దీంతో నైజాంలో రూ. 11 కోట్లు, సీడెడ్‌లో రూ. 6 కోట్లు, ఆంధ్రా మొత్తంలో రూ. 16.80 కోట్లతో రెండు రాష్ట్రాల్లో కలిపి రూ. 33.80 కోట్లు బిజినెస్ జరిగింది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.15 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 2.20 కోట్లుతో ప్రపంచ వ్యాప్తంగా రూ. 38.15 కోట్లు బిజినెస్ జరిగింది.

21వ రోజు వచ్చిన కలెక్షన్ల వివరాలు

21వ రోజు వచ్చిన కలెక్షన్ల వివరాలు

అక్కినేని హీరోల మల్టీస్టారర్‌గా వచ్చిన ‘బంగార్రాజు' మూవీకి ఆరంభంలో కలెక్షన్లు భారీగానే వచ్చాయి. అయితే, ఆ తర్వాత ప్రతికూల పరిస్థితులు ఎదురైన నేపథ్యంతో వసూళ్లు క్రమంగా తగ్గాయి. మరీ ముఖ్యంగా ఏపీ, తెలంగాణలోనూ ఈ సినిమా బాగా డ్రాప్ అయిపోయింది. ఈ క్రమంలోనే రెండు రాష్ట్రాల్లో 21వ రోజు ఈ మూవీ రూ. 8 లక్షలు షేర్‌ను మాత్రమే వసూలు చేసింది.

21 రోజులకు కలిపి వచ్చింది ఎంత

21 రోజులకు కలిపి వచ్చింది ఎంత

‘బంగార్రాజు'కు 21 రోజులకు కలిపి ఏపీ తెలంగాణలో కలెక్షన్లు బాగానే వచ్చాయి. దీంతో నైజాంలో రూ. 8.31 కోట్లు, సీడెడ్‌లో రూ. 6.88 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 5.23 కోట్లు, ఈస్ట్‌లో రూ. 4.15 కోట్లు, వెస్ట్‌లో రూ. 2.90 కోట్లు, గుంటూరులో రూ. 3.45 కోట్లు, కృష్ణాలో రూ. 2.25 కోట్లు, నెల్లూరులో రూ. 1.75 కోట్లతో.. రూ. 34.92 కోట్లు షేర్, రూ. 56.88 కోట్లు గ్రాస్‌ను రాబట్టింది.

ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంత?

ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంత?

ఆంధ్రా, తెలంగాణలో కలిపి మూడు వారాలకు రూ. 34.92 కోట్లు వసూలు చేసిన బంగార్రాజు.. మిగిలిన ప్రాంతాల్లో పెద్దగా రాణించలేదు. ఫలితంగా రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.80 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 1.50 కోట్లను రాబట్టింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో కలిపి ఈ సినిమా 21 రోజుల్లో రూ. 38.22 కోట్లు షేర్‌తో పాటు రూ. 64.25 కోట్ల గ్రాస్‌ను కలెక్ట్ చేసింది.

Recommended Video

Akkineni Nagarjuna And Amala Visits Tirumala | Bangarraju | Filmibeat Telugu
టార్గెట్ ఎంత? ఇంకెంత రావాలి?

టార్గెట్ ఎంత? ఇంకెంత రావాలి?

క్రేజీ కాంబినేషన్‌లో వచ్చిన ‘బంగార్రాజు' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 38.15 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 39 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా 3 వారాల్లో రూ. 38.22 కోట్లు వసూలు చేసింది. అంటే మరో రూ. 78 లక్షలు వస్తేనే బంగార్రాజు మూవీ హిట్‌ అవుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X