twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Bangarraju 24 Days Collections: మళ్ళీ పెరిగిన బంగార్రాజు కలెక్షన్స్.. అయినా లాభం లేదు

    |

    ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన అతి పెద్ద సినిమా బంగార్రాజు. అక్కినేని నాగార్జున నాగ చైతన్య కలిసి నటించిన ఈ రెండవ సినిమా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. మొదట్లో ఈ సినిమాకు ఓపెనింగ్స్ అయితే బాగానే వచ్చాయి. కానీ పండగ సీజన్ తర్వాత సినిమా కలెక్షన్స్ ఒక్కసారిగా తగ్గిపోయాయి. అయినప్పటికీ చిత్ర యూనిట్ సభ్యులు ప్రమోషన్స్ బాగానే చేశారు.

    కానీ ఆ ప్రమోషన్స్ కూడా సినిమాకు అనుకున్నంత స్థాయిలో లాభాలు అందించలేకపోతున్నాయి. ఇంకా థియేట్రికల్ గా సినిమా బాక్సాఫీస్ వద్ద టార్గెట్ ను పూర్తి చేయలేదు. ఇక 24వ సినిమాకు వసూళ్లు లో ఏ స్థాయిలో అందాయనే వివరాల్లోకి వెళ్దాం..

    బంగార్రాజు బిజినెస్..

    బంగార్రాజు బిజినెస్..

    నాగార్జున తన సొంత ప్రొడక్షన్ అన్నపూర్ణ స్టూడియోస్ లోనే బంగార్రాజు సినిమాను నిర్మించారు. ఇక గతంలో సోగ్గాడే చిన్ని నాయనా సినిమాకు సీక్వెల్ గా రావడంతో సినిమాపై మొదటి నుంచి కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ అయ్యాయి. ఇక సంక్రాంతిలో మిగతా సినిమాల నుంచి పెద్దగా పోటి లేకపోవడంతో ఈ సినిమాకు ఒక్కసారిగా డిమాండ్ ఏర్పడింది.

    ఇక వరల్డ్ వైడ్ గా సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు ఈ విధంగా ఉన్నాయి. నైజాంలో రూ. 11 కోట్లు, సీడెడ్‌లో రూ. 6 కోట్లు, ఆంధ్రా మొత్తంలో రూ. 17.80 కోట్లతో రెండు రాష్ట్రాల్లో కలిపి రూ. 33.80 కోట్లు బిజినెస్ జరిగింది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.17 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 2.20 కోట్లుతో ప్రపంచ వ్యాప్తంగా రూ. 38.17 కోట్లు బిజినెస్ జరిగింది.

    24వ రోజు వచ్చిన కలెక్షన్స్

    24వ రోజు వచ్చిన కలెక్షన్స్

    బంగార్రాజు కు సంక్రాంతి ఫెస్టివల్ బాగానే హెల్ప్ అయ్యింది. మొదటి వారంలోనే కలెక్షన్స్ వచ్చాయి. ఇక మిగతా రోజుల్లో ఒక్కసారిగా డౌన్ అయ్యాయి. 20రోజు కూడా ఆంధ్ర నైజాంలో చాలా తక్కువ వసూళ్లు వచ్చాయి. 23వ రోజు 10 లక్షల షేర్ రాగా 24వ రోజు కొంచెం కలెక్షన్స్ పెరగడంతో 15 లక్షల షేర్ లభించింది. సినిమాకు వసూళ్లు తగ్గినప్పటి నుంచి చిత్ర యూనిట్ సభ్యులు ప్రమోషన్ కూడా పెద్దగా చేయడం లేదు.

    ఏపీ తెలంగాణ కలెక్షన్స్..

    ఏపీ తెలంగాణ కలెక్షన్స్..

    24 రోజుల్లో బంగార్రాజుకు ఆంద్రప్రదేశ్ తెలంగాణలో మంచి కలెక్షన్స్ వచ్చాయి. ఏరియాల వారిగా పరిశీలిస్తే.. నైజాంలో టోటల్ రూ. 8.37 కోట్లు, సీడెడ్‌లో రూ. 6.97 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 5.29 కోట్లు, ఈస్ట్‌లో రూ. 4.19 కోట్లు, వెస్ట్‌లో రూ. 2.91 కోట్లు, గుంటూరులో రూ. 3.47 కోట్లు, కృష్ణాలో రూ. 2.28 కోట్లు, నెల్లూరులో రూ. 1.76 కోట్లతో.. రూ. 35.24 కోట్లు షేర్, రూ. 57.50 కోట్లు గ్రాస్‌ను రాబట్టింది.

    వరల్డ్ వైడ్ గా వచ్చిన వసూళ్లు..

    వరల్డ్ వైడ్ గా వచ్చిన వసూళ్లు..

    24 రోజులకు ఆంధ్రా, తెలంగాణలో కలిపి రూ. 35.24 కోట్లు షేర్ సాధించిన బంగార్రాజు.. మిగిలిన రాష్ట్రాల్లో పెద్దగా కలెక్ట్ చేయలేకపోయింది. కర్ణాటక + రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.82 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 1.51 కోట్లను రాబట్టింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో కలిపి ఈ సినిమా 20 రోజుల్లో రూ. 38.57 కోట్లు షేర్‌తో పాటు రూ. 64.90 కోట్ల గ్రాస్‌ను సొంతం చేసుకుంది.

    Recommended Video

    Akkineni Nagarjuna And Amala Visits Tirumala | Bangarraju | Filmibeat Telugu
    హిట్టవ్వాలి అంటే..

    హిట్టవ్వాలి అంటే..

    'బంగార్రాజు' సినిమా పండగ సీజన్ లో మొత్తానికి వసూళ్లను బాగానే అందుకుంది. ఏపీలో టికెట్ల రేట్లు ఎప్పటిలాగానే ఉంటే మరిన్ని వసూళ్లు అందేవి. అనుకున్నదాని ప్రకారం ఓపెనింగ్స్ అయితే బాగానే అందుకుంది. కానీ ఫెస్టివల్ అనంతరం సినిమా కలెక్షన్స్ ఒక్కసారిగా తగ్గిపోయాయి. వరల్డ్ వైడ్ గా వ్యాప్తంగా రూ. 38.15 కోట్లు మేర బిజినెస్ చేసిన ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 39 కోట్లుగా నమోదైంది.

    ఇక, ఈ సినిమా 20 రోజుల్లో వరల్డ్ వైడ్ గా రూ. 38.57 కోట్ల షేర్ వసూలు చేసింది. ఇంకా లాభల్లోకి రావాలి అంటే సినిమా రూ.44 లక్షల షేర్ ను అందుకోవాలి. మరి బంగార్రాజు ఆ టార్గెట్ ను ఇంకా ఎన్ని రోజుల్లో ఫినిష్ చేస్తాడో చూడాలి.

    English summary
    Bangarraju movie 24 days world wide collections.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X