twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Bangarraju 4 Days Collections: ఒక్కసారిగా కలెక్షన్స్ డౌన్.. నాలుగో సారి 50కోట్ల క్లబ్ లో నాగచైతన్య!

    |

    తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం మార్కెట్ ను పెంచుకుంటున్న హీరోలలో నాగచైతన్య టాప్ లిస్టు లో ఉన్నాడు అనే చెప్పాలి. ఈ కుర్రహీరో గత కొంత కాలంగా ఎలాంటి సినిమా చేసినా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ ను అందుకుంటున్నాయి. ఇక ఈ సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన బంగార్రాజు సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డుని క్రియేట్ చేసింది. ఇక నాలుగు రోజుల్లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఏ స్థాయిలో కలెక్షన్స్ అందుకుంది అనే వివరాల్లోకి వెళితే..

    Recommended Video

    Bangarraju పట్టిందల్లా బంగారమే.. Break Even దిశగా Sankranthi Winner| Filmibeat Telugu
    సంక్రాంతి టార్గెట్ తోనే..

    సంక్రాంతి టార్గెట్ తోనే..

    నాగ చైతన్య నాగార్జున ఇదివరకే మనం సినిమా తో బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఇక నాగార్జున ప్రత్యేకంగా నాగచైతన్య కోసం బంగార్రాజు కథని తయారు చేయించాడు. అందులో ఎలాగైనా నాగచైతన్యకు యువ బంగార్రాజు గా చూపించాలి అని కళ్యాణ్ కృష్ణ తో ప్రత్యేకంగా స్టోరీని సిద్ధం చేయించడంతో మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ అయ్యాయి. తప్పకుండా సంక్రాంతికి విడుదల చేయాలి అనే టార్గెట్ తోనే షూటింగ్ ను పూర్తి చేశారు.

    షాకింగ్ బిజినెస్..

    షాకింగ్ బిజినెస్..

    సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ తో అందరికి షాక్ ఇచ్చిందనే చెప్పాలి. 'బంగార్రాజు' హక్కుల కోసం డిస్ట్రిబ్యూటర్స్ ఎగబడి మరి కొనుగోలు చేశారు. ఏరియాల వారిగా లెక్కలు ఈ విధంగా ఉన్నాయి. నైజాంలో రూ. 11 కోట్లు, సీడెడ్‌లో రూ. 6 కోట్లు, ఆంధ్రా మొత్తంలో రూ. 16.80 కోట్లతో రెండు రాష్ట్రాల్లో కలిపి రూ. 33.80 కోట్లు బిజినెస్ జరిగింది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.15 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 2.20 కోట్లుతో ప్రపంచ వ్యాప్తంగా రూ. 38.15 కోట్ల బిజినెస్ జరిగింది.

    బంగార్రాజు 4వ రోజు కలెక్షన్స్..

    బంగార్రాజు 4వ రోజు కలెక్షన్స్..

    'బంగార్రాజు' సినిమా నాలుగవ రోజు రోజూ ఏపీ, తెలంగాణలో మొదటి మూడు రోజుల కంటే చాలా తక్కువ స్థాయిలో కలెక్షన్స్ అందుకుంది. నైజాంలో రూ. 62 లక్షలు సీడెడ్‌లో రూ. 63 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 72 లక్షలు, ఈస్ట్‌లో రూ. 47 లక్షలు, వెస్ట్‌లో రూ. 32 లక్షలు, గుంటూరులో రూ. 31 లక్షలు, కృష్ణాలో రూ. 27 లక్షలు, నెల్లూరులో రూ. 21 లక్షలతో కలిపి రూ. 3.55 కోట్లు షేర్ రాగా.. గ్రాస్ రూ. 11 కోట్లు వచ్చినట్లు తెలుస్తోంది.

    నాలుగు రోజుల్లో టోటల్ కలెక్షన్స్

    నాలుగు రోజుల్లో టోటల్ కలెక్షన్స్

    నాలుగు రోజులకు మొత్తంగా తెలుగు రాష్ట్రాలో ఈ సినిమా మంచి కలెక్షన్లు వచ్చాయి. మొదట మూడు రోజుల కంటే నాలుగవ రోజు వసూళ్లు కాస్త తగ్గాయి. టోటల్ గా నైజాంలో రూ. 7.14 కోట్లు, సీడెడ్‌లో రూ. 5.31 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 3.03 కోట్లు, ఈస్ట్‌లో రూ. 3.03 కోట్లు, వెస్ట్‌లో రూ. 2.17 కోట్లు, గుంటూరులో రూ. 2.67 కోట్లు, కృష్ణాలో రూ. 1.70 కోట్లు, నెల్లూరులో రూ. 1.36 కోట్లతో.. 4 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా రూ. 29.96 కోట్లు షేర్, రూ. 43.80 కోట్లు గ్రాస్ వచ్చింది.

     వరల్డ్ వైడ్ కలెక్షన్స్..

    వరల్డ్ వైడ్ కలెక్షన్స్..

    ఏపీ, తెలంగాణలో నాలుగు రోజులకు గాని బంగార్రాజు రూ. 29.96 కోట్లు షేర్ సాధించగా.. మిగిలిన ఏరియాల్లోనూ మంచి కలెక్షన్స్ వచ్చాయి. ఇక కర్ణాటక రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.56 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 1.28 కోట్లను రాబట్టింది. ఇక ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో కలిపి ఈ సినిమా 4 రోజుల్లోనే రూ. 29.96 కోట్లు షేర్‌తో పాటు రూ. 50 కోట్ల గ్రాస్‌ను రాబట్టింది.

    నాగచైతన్య నాలుగో 50

    నాగచైతన్య నాలుగో 50

    'బంగార్రాజు' మూవీతో నాగచైతన్య తన కెరీర్ లోనే ఒక సరికొత్త రికార్డును అందుకున్నాడు. ఇప్పటివరకు చైతూ నటించిన నాలుగు సినిమాలు 50కోట్ల వసూళ్లను సాధించాయి. మజిలీ, వెంకీ మామ, లవ్ స్టొరీ సినిమాలు వరుసగా 50కోట్ల గ్రాస్ తో నాగ చైతన్య మార్కెట్ ను అమాంతం పెంచేశాయి. ఇక బంగార్రాజు సినిమా 4 రోజుల్లోనే ఆఫ్ సెంచరీ కొట్టేసింది.

    ఇంకా ఎంత రావాలి అంటే..

    ఇంకా ఎంత రావాలి అంటే..

    ప్రపంచ వ్యాప్తంగా బంగార్రాజు సినిమా రూ. 38.15 కోట్లు మేర బిజినెస్ జరిగింది. ఇక బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 39 కోట్లుగా నమోదైంది. అయితే సినిమా నాలుగు రోజుల్లోనే రూ. 29.96 కోట్లు షేర్ ను సాదించింది. ఇక ఈ టార్గెట్ ను పూర్తి చేయాలి అంటే 9.04కోట్ల వరకు షేర్ ను అందుకోవాల్సి ఉంటుంది. కానీ సోమవారం ఒక్కసారిగా 3కోట్లకు వచ్చిన షేర్ బుధవారం సమయానికి మంగళవారం కూడా భారీగా తగ్గే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

    English summary
    Bangarraju movie 4 Days worldwide Collections
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X