Bangarraju 8 Days Collections: బంగార్రాజుకు 8వ రోజు మరో దెబ్బ.. ఇంకా అన్ని కోట్లు వస్తేనే హిట్
చాలా కాలంగా హిట్‌ను ఖాతాలో వేసుకోడానికి ప్రయత్నాలు చేస్తున్నా విఫలం అవుతూనే ఉన్నాడు టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున. అదే సమయంలో హిట్లు మీద హిట్లు కొడుతూ ఫుల్ ఫామ్‌తో కనిపిస్తున్నాడు ఆయన కుమారుడు యువ సామ్రాట్ నాగ చైతన్య. ఇప్పుడు వీళ్లిద్దరూ కలిసి చేసిన చిత్రమే 'బంగార్రాజు'.
నాలుగేళ్ల క్రితం వచ్చి సూపర్ డూపర్ హిట్ అయిన 'సోగ్గాడే చిన్ని నాయన'కు సీక్వెల్‌గా వచ్చిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆరంభంలోనే ఈ చిత్రానికి మంచి టాక్ వచ్చింది. దీంతో కలెక్షన్లు కూడా భారీగానే వచ్చాయి. అయితే, మూడు రోజుల నుంచి క్రమంగా తగ్గుతున్నాయి. ఈ నేపథ్యంలో 'బంగార్రాజు' మూవీ ఎనిమిది రోజుల కలెక్షన్ల రిపోర్టుపై ఓ లుక్కేద్దాం పదండి!

‘బంగార్రాజు'గా అక్కినేని హీరోలు
అక్కినేని నాగార్జున, నాగ చైతన్య హీరోలుగా కల్యాణ్ కృష్ణ కురసాల రూపొందించిన చిత్రమే ‘బంగార్రాజు'. నాలుగేళ్ల క్రితం వచ్చిన ‘సోగ్గాడే చిన్ని నాయన'కు ఇది సీక్వెల్‌గా రూపొందింది. ఇందులో రమ్యకృష్ణ, కృతి శెట్టి హీరోయిన్లుగా నటించారు. దీన్ని అన్నపూర్ణ స్టూడియోస్, జీ స్టూడియోస్ బ్యానర్లపై నాగార్జున నిర్మించారు. ఈ మూవీకి అనూప్ రూబెన్స్ సంగీతం సమకూర్చాడు.

బంగార్రాజు మూవీ బిజినెస్ డీటేల్స్
భారీ మల్టీస్టారర్‌గా వచ్చిన ‘బంగార్రాజు' మూవీ రైట్స్‌కు పోటీ ఏర్పడింది. దీంతో నైజాంలో రూ. 11 కోట్లు, సీడెడ్‌లో రూ. 6 కోట్లు, ఆంధ్రా మొత్తంలో రూ. 16.80 కోట్లతో రెండు రాష్ట్రాల్లో కలిపి రూ. 33.80 కోట్లు బిజినెస్ జరిగింది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.15 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 2.20 కోట్లుతో ప్రపంచ వ్యాప్తంగా రూ. 38.15 కోట్ల మేర బిజినెస్ జరిగింది.

8వ రోజు వచ్చిన కలెక్షన్ల వివరాలు
ఏపీ, తెలంగాణలో ‘బంగార్రాజు' మూవీకి 8వ రోజూ కలెక్షన్లు తగ్గాయి. ఫలితంగా నైజాంలో రూ. 5 లక్షలు, సీడెడ్‌లో రూ. 8 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 10 లక్షలు, ఈస్ట్‌లో రూ. 8 లక్షలు, వెస్ట్‌లో రూ. 4 లక్షలు, గుంటూరులో రూ. 4 లక్షలు, కృష్ణాలో రూ. 4 లక్షలు, నెల్లూరులో రూ. 3 లక్షలతో కలిపి రెండు రాష్ట్రాల్లో 8వ రోజు రూ. 46 లక్షలు షేర్, రూ. 72 లక్షలు గ్రాస్ మాత్రమే వచ్చింది.

8 రోజులకూ కలిపి వచ్చింది ఎంత
‘బంగార్రాజు'కు 8 రోజులకు కలిపి తెలుగు రాష్ట్రాలో మంచి కలెక్షన్లు వచ్చాయి. దీంతో నైజాంలో రూ. 7.67 కోట్లు, సీడెడ్‌లో రూ. 6.01 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 4.47 కోట్లు, ఈస్ట్‌లో రూ. 3.61 కోట్లు, వెస్ట్‌లో రూ. 2.58 కోట్లు, గుంటూరులో రూ. 3.07 కోట్లు, కృష్ణాలో రూ. 1.98 కోట్లు, నెల్లూరులో రూ. 1.55 కోట్లతో.. 8 రోజుల్లో రూ. 30.94 కోట్లు షేర్, రూ. 50.02 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంత?
ఏపీ, తెలంగాణలో 8 రోజులకు రూ. 30.94 కోట్లు వసూలు చేసిన బంగార్రాజు మూవీ.. మిగిలిన ప్రాంతాల్లోనూ సత్తా చాటింది. ఫలితంగా రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.63 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 1.37 కోట్లను రాబట్టింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో కలిపి ఈ సినిమా ఎనిమిది రోజుల్లోనే రూ. 33.94 కోట్లు షేర్‌తో పాటు రూ. 56.80 కోట్ల గ్రాస్‌ను సొంతం చేసుకుంది.
Recommended Video

టార్గెట్ ఎంత? ఇంకెంత రావాలంటే
క్రేజీ కాంబినేషన్‌లో వచ్చిన ‘బంగార్రాజు' అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 38.15 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 39 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా 8 రోజుల్లోనే రూ. 33.94 కోట్లు వసూలు చేసింది. అంటే మరో రూ. 5.06 కోట్లు వసూలు చేస్తేనే ఇది హిట్ స్టేటస్‌ను సొంతం చేసుకుంటుంది.


Click it and Unblock the Notifications











