twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Bangarraju 2 Days Collections: రెండో రోజు బంగార్రాజు అరాచకం.. తెలుగులోనే నెంబర్ వన్ మూవీగా రికార్డు

    |

    సుదీర్ఘ కాలంగా భారీ సక్సెస్ కోసం వేచి చూస్తున్నాడు టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున. ఈ క్రమంలోనే వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేస్తూ వెళ్తున్నాడు. మరోవైపు, కొంత కాలంగా వరుసగా హిట్లు మీద హిట్లు కొడుతూ ఫుల్ జోష్‌లో ఉన్నాడు యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య. దీంతో రెట్టించిన ఉత్సాహంతో ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తున్నాడు.

    ఇప్పుడీ ఇద్దరూ కలిసి చేసిన చిత్రమే 'బంగార్రాజు'. అక్కినేని హీరోల మల్టీస్టారర్ మూవీగా ఇది సంక్రాంతి బరిలో నిలిచింది. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ చిత్రానికి మంచి టాక్‌ దక్కింది. దీంతో కలెక్షన్లు కూడా భారీగానే వస్తున్నాయి. మరి ముఖ్యంగా రెండో రోజు ఇది సత్తా చాటింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా రెండు రోజుల బాక్సాఫీస్‌పై లుక్కేద్దాం పదండి!

    ‘బంగార్రాజు'గా అక్కినేని హీరోలు

    ‘బంగార్రాజు'గా అక్కినేని హీరోలు

    అక్కినేని నాగార్జున, నాగ చైతన్య కాంబినేషన్‌లో వచ్చిన చిత్రమే 'బంగార్రాజు'. కల్యాణ్ కృష్ణ రూపొందించిన ఈ సినిమా'సోగ్గాడే చిన్ని నాయన'కు సీక్వెల్‌గా తెరకెక్కింది. ఇందులో రమ్యకృష్ణ, కృతి శెట్టి హీరోయిన్లుగా చేశారు. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్, జీ స్టూడియోస్ బ్యానర్లపై నాగార్జున స్వయంగా నిర్మించారు. అనూప్ రూబెన్స్ సంగీతం సమకూర్చాడు.

    బిడ్డకు పాలు పడుతోన్న ఫొటోను షేర్ చేసిన శ్రీయ: ఇలాంటివి కూడా వదులుతారా అంటూ దారుణంగా!బిడ్డకు పాలు పడుతోన్న ఫొటోను షేర్ చేసిన శ్రీయ: ఇలాంటివి కూడా వదులుతారా అంటూ దారుణంగా!

    ప్రపంచ వ్యాప్తంగా జరిగిన బిజినెస్

    ప్రపంచ వ్యాప్తంగా జరిగిన బిజినెస్

    సంక్రాంతి రేసులో ఉన్న 'బంగార్రాజు' మూవీ హక్కులకు బాగా పోటీ ఏర్పడింది. దీంతో నైజాంలో రూ. 11 కోట్లు, సీడెడ్‌లో రూ. 6 కోట్లు, ఆంధ్రా మొత్తంలో రూ. 16.80 కోట్లతో రెండు రాష్ట్రాల్లో కలిపి రూ. 33.80 కోట్లు బిజినెస్ జరిగింది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.15 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 2.20 కోట్లుతో ప్రపంచ వ్యాప్తంగా రూ. 38.15 కోట్ల బిజినెస్ జరిగింది.

     రెండవ రోజు వచ్చిన కలెక్షన్లు ఇలా

    రెండవ రోజు వచ్చిన కలెక్షన్లు ఇలా

    'బంగార్రాజు' మూవీకి రెండో రోజూ ఏపీ, తెలంగాణలో భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 2.41 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.66 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 93 లక్షలు, ఈస్ట్‌లో రూ. 88 లక్షలు, వెస్ట్‌లో రూ. 49 లక్షలు, గుంటూరులో రూ. 61 లక్షలు, కృష్ణాలో రూ. 49 లక్షలు, నెల్లూరులో రూ. 32 లక్షలతో కలిపి రూ. 7.79 కోట్లు షేర్, రూ. 13 కోట్లు గ్రాస్ వచ్చింది.

    పూర్తి నగ్నంగా ఉన్న ఫొటో షేర్ చేసిన హీరోయిన్: ఒక్కసారిగా బెడ్ మీద అలా కనిపించడంతో!పూర్తి నగ్నంగా ఉన్న ఫొటో షేర్ చేసిన హీరోయిన్: ఒక్కసారిగా బెడ్ మీద అలా కనిపించడంతో!

    రెండు రోజులకూ కలిపి వసూళ్లిలా

    రెండు రోజులకూ కలిపి వసూళ్లిలా

    'బంగార్రాజు' మూవీకి రెండు రోజులకు తెలుగు రాష్ట్రాలో మంచి కలెక్షన్లు వచ్చాయి. దీంతో నైజాంలో రూ. 4.47 కోట్లు, సీడెడ్‌లో రూ. 3.46 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 2.20 కోట్లు, ఈస్ట్‌లో రూ. 1.75 కోట్లు, వెస్ట్‌లో రూ. 1.39 కోట్లు, గుంటూరులో రూ. 1.79 కోట్లు, కృష్ణాలో రూ. 93 లక్షలు, నెల్లూరులో రూ. 86 లక్షలతో.. 2 రోజుల్లో రూ. 16.85 కోట్లు షేర్, రూ. 27 కోట్లు గ్రాస్ కలెక్ట్ అయింది.

    ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంత

    ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంత

    ఆంధ్రా తెలంగాణలో కలిపి రెండు రోజులకు రూ. 16.85 కోట్లు వసూలు చేసిన బంగార్రాజు మూవీ.. మిగిలిన ప్రాంతాల్లోనూ సత్తా చాటింది. ఫలితంగా రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.05 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 95 లక్షలను రాబట్టింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో కలిపి ఈ సినిమా రెండు రోజుల్లోనే రూ. 18.85 కోట్లు షేర్‌తో పాటు రూ. 31.20 కోట్ల గ్రాస్‌ను రాబట్టింది.

    ప్రియుడితో శృతి హాసన్ రచ్చ: ఎదపై హత్తుకుని ఘాటుగా.. పిచ్చ హాట్ ఫొటోను షేర్ చేసిన హీరోయిన్ప్రియుడితో శృతి హాసన్ రచ్చ: ఎదపై హత్తుకుని ఘాటుగా.. పిచ్చ హాట్ ఫొటోను షేర్ చేసిన హీరోయిన్

    టార్గెట్ ఎంత? ఇంకెంత రావాలి?

    టార్గెట్ ఎంత? ఇంకెంత రావాలి?

    ఎంతో ప్రతిష్టాత్మకంగా వచ్చిన 'బంగార్రాజు' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 38.15 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 39 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా రెండు రోజుల్లోనే రూ. 18.85 కోట్లు వసూలు చేసింది. అంటే మరో రూ. 20.15 కోట్లు వసూలు చేస్తేనే ఇది హిట్‌గా నిలుస్తుంది.

    టాలీవుడ్‌లో ఫస్ట్ మూవీగా రికార్డు

    టాలీవుడ్‌లో ఫస్ట్ మూవీగా రికార్డు

    మొదటి రోజు కంటే రెండో రోజు తక్కువే కలెక్షన్లను రాబట్టినా.. బంగార్రాజు మూవీ అదిరిపోయే రికార్డును నమోదు చేసింది. మీడియం రేంజ్ సినిమాల్లో రెండో రోజు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ కలెక్షన్లు రాబట్టిన చిత్రాల్లో ఇది మొదటి స్థానానికి చేరుకుంది. తద్వారా 'ఉప్పెన' మూవీ పేరిట ఉన్న రూ. 6.86 కోట్ల రికార్డును చెరిపేసింది. ఇక, 2 రోజుల్లోనే సగం బిజినెస్‌ను రాబట్టింది.

    English summary
    Akkineni Nagarjuna and Naga Chaitanya Did Bangarraju Movie Under Kalyan Krishna Direction. This Movie Collects Rs 18.85 Crores in Two Days
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X