Bangarraju 3 Days Collections: కనుమ రోజు కుమ్మేసిన బంగార్రాజు.. మూడు రోజుల్లోనే అన్ని కోట్లు వసూలు

గతంతో పోలిస్తే ఈ మధ్య కాలంలో మల్టీస్టారర్ మూవీల హవా బాగా కనిపిస్తోంది. అప్పటి కంటే ఇప్పటి ప్రేక్షకులు సరికొత్త ప్రయోగాలతో వచ్చిన చిత్రాలను బాగా ఆదరిస్తున్నారు. మరీ ముఖ్యంగా మల్టీస్టారర్ మూవీలకు కూడా మంచి రెస్పాన్స్ అందిస్తున్నారు. దీంతో ఇలాంటి చిత్రాలు మరిన్ని వస్తున్నాయి. ఇలా తాజాగా వచ్చిన సినిమానే 'బంగార్రాజు'. ఇందులో అక్కినేని కుటుంబానికి చెందిన తండ్రీ కొడుకులు నాగార్జున, నాగ చైతన్య కలిసి నటించారు.

ఎన్నో అంచనాలతో ఇది సంక్రాంతి బరిలో నిలిచింది. ఇక, ఈ చిత్రానికి ఆరంభంలోనే మంచి టాక్‌ దక్కింది. దీంతో కలెక్షన్లు కూడా భారీగానే వస్తున్నాయి. మరి ముఖ్యంగా కనుమ రోజు కూడా ఇది సత్తా చాటింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా మూడు రోజుల బాక్సాఫీస్‌పై లుక్కేద్దాం పదండి!

అక్కినేని హీరోల కాంబోలో సీక్వెల్‌గా

అక్కినేని హీరోల కాంబోలో సీక్వెల్‌గా

అక్కినేని నాగార్జున, నాగ చైతన్య కలయికలో వచ్చిన చిత్రమే 'బంగార్రాజు'. కల్యాణ్ కృష్ణ రూపొందించిన ఈ సినిమా'సోగ్గాడే చిన్ని నాయన'కు సీక్వెల్‌గా రూపొందింది. ఇందులో రమ్యకృష్ణ, కృతి శెట్టి హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్, జీ స్టూడియోస్ బ్యానర్లపై నాగార్జున స్వయంగా నిర్మించారు. అనూప్ రూబెన్స్ దీనికి సంగీతం అందించాడు.

బంగార్రాజు మూవీ బిజినెస్ డీటేల్స్

బంగార్రాజు మూవీ బిజినెస్ డీటేల్స్

సంక్రాంతికి వచ్చిన భారీ చిత్రం 'బంగార్రాజు' హక్కులకు బాగా పోటీ ఏర్పడింది. దీంతో నైజాంలో రూ. 11 కోట్లు, సీడెడ్‌లో రూ. 6 కోట్లు, ఆంధ్రా మొత్తంలో రూ. 16.80 కోట్లతో రెండు రాష్ట్రాల్లో కలిపి రూ. 33.80 కోట్లు బిజినెస్ జరిగింది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.15 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 2.20 కోట్లుతో ప్రపంచ వ్యాప్తంగా రూ. 38.15 కోట్ల బిజినెస్ జరిగింది.

 మూడవ రోజు వచ్చిన కలెక్షన్లు ఇలా

మూడవ రోజు వచ్చిన కలెక్షన్లు ఇలా

'బంగార్రాజు' మూవీకి మూడో రోజూ ఏపీ, తెలంగాణలో భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 2.05 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.22 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 82 లక్షలు, ఈస్ట్‌లో రూ. 81 లక్షలు, వెస్ట్‌లో రూ. 47 లక్షలు, గుంటూరులో రూ. 58 లక్షలు, కృష్ణాలో రూ. 47 లక్షలు, నెల్లూరులో రూ. 30 లక్షలతో కలిపి రూ. 6.72 కోట్లు షేర్, రూ. 11 కోట్లు గ్రాస్ వచ్చింది.

మూడు రోజులకూ కలిపి వసూళ్లిలా

మూడు రోజులకూ కలిపి వసూళ్లిలా

మూడు రోజులకు కలిపి 'బంగార్రాజు'కు తెలుగు రాష్ట్రాలో మంచి కలెక్షన్లు వచ్చాయి. దీంతో నైజాంలో రూ. 6.52 కోట్లు, సీడెడ్‌లో రూ. 4.68 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 3.02 కోట్లు, ఈస్ట్‌లో రూ. 2.56 కోట్లు, వెస్ట్‌లో రూ. 1.85 కోట్లు, గుంటూరులో రూ. 2.36 కోట్లు, కృష్ణాలో రూ. 1.43 కోట్లు, నెల్లూరులో రూ. 1.15 కోట్లతో.. 2 రోజుల్లో రూ. 23.75 కోట్లు షేర్, రూ. 38 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంత

ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంత

ఏపీ, తెలంగాణలో కలిపి మూడు రోజులకు రూ. 23.75 కోట్లు వసూలు చేసిన బంగార్రాజు మూవీ.. మిగిలిన ప్రాంతాల్లోనూ సత్తా చాటింది. ఫలితంగా రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.52 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 1.20 కోట్లను రాబట్టింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో కలిపి ఈ సినిమా మూడు రోజుల్లోనే రూ. 26.47 కోట్లు షేర్‌తో పాటు రూ. 43.80 కోట్ల గ్రాస్‌ను రాబట్టింది.

టార్గెట్ ఎంత? ఇంకెంత రావాలి?

టార్గెట్ ఎంత? ఇంకెంత రావాలి?

భారీ మల్టీస్టారర్‌గా వచ్చిన 'బంగార్రాజు' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 38.15 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 39 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా మూడు రోజుల్లోనే రూ. 26.47 కోట్లు వసూలు చేసింది. అంటే మరో రూ. 12.33 కోట్లు వసూలు చేస్తేనే ఇది హిట్‌ స్టేటస్‌ అందుకుంటుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X