Don't Miss!
- News
ఆ చిన్నారి విమాన ప్రయాణానికి నిరాకరణ-ఇండిగో ఎయిర్ లైన్స్ కు రూ.5 లక్షల జరిమానా
- Sports
ఆర్సీబీ బుడ్డోడికి ట్రెంట్ బౌల్ట్ స్పెషల్ గిఫ్ట్.. అడిగిన వెంటనే..! వీడియో
- Finance
Rakesh Jhunjhunwala: రూ.కోట్లు కురిపించిన ఆ అయిదు స్టాక్స్ ఇవే
- Automobiles
భారతదేశంలోకి రావాలంటే మా కండిషన్స్ ఇవి: టెస్లా సీఈఓ ఎలోన్ మస్క్
- Lifestyle
'ఈ' టీ తాగడం వల్ల మీ గుండెను సురక్షితంగా ఉంచుకోవచ్చు అని మీకు తెలుసా?
- Technology
Xiaomi Pad 6 లాంచ్ వివరాలు వచ్చేసాయి ! స్పెసిఫికేషన్లు చూడండి
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
Bangarraju 5 Days Collections: బంగార్రాజుకు షాకింగ్ కలెక్షన్లు.. ఇంకా అన్ని కోట్లు వస్తేనే హిట్
తెలుగు సినీ ఇండస్ట్రీకి సంక్రాంతి సీజన్ ఎంతో ప్రత్యేకమైనదన్న విషయం తెలిసిందే. వరుసగా సెలవులు రావడంతో ఆ సమయంలో థియేటర్లు అన్నీ ప్రేక్షకులతో కళకళలాడుతుంటాయి. దీంతో ఈ సీజన్లో సినిమాలు విడుదల చేయడానికి దర్శక నిర్మాతలు ముందుకు వస్తుంటారు. అయితే, ఈ ఏడాది ఆ పరిస్థితి లేదు. కరోనా కేసులు పెరుగుతోన్న నేపథ్యంలో బడా చిత్రాలన్నీ వాయిదా పడిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో కేవలం ఒకే ఒక్క భారీ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
అదే అక్కినేని నాగార్జున, నాగ చైతన్య కాంబినేషన్లో వచ్చిన 'బంగార్రాజు'. ఎన్నో అంచనాలతో ఇది సంక్రాంతి బరిలో నిలిచిన ఈ చిత్రానికి కలెక్షన్లు కూడా భారీగా వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఐదు రోజుల బాక్సాఫీస్‌పై లుక్కేద్దాం పదండి!

బంగార్రాజుగా మారిన తండ్రీ కొడుకు
అక్కినేని నాగార్జున, నాగ చైతన్య హీరోలుగా చేసిన చిత్రమే ‘బంగార్రాజు'. కల్యాణ్ కృష్ణ రూపొందించిన ఈ సినిమా ‘సోగ్గాడే చిన్ని నాయన'కు సీక్వెల్‌గా రూపొందింది. ఇందులో రమ్యకృష్ణ, కృతి శెట్టి హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్, జీ స్టూడియోస్ బ్యానర్లపై నాగార్జున స్వయంగా నిర్మించారు. అనూప్ రూబెన్స్ దీనికి సంగీతం సమకూర్చాడు.
హాట్ డోస్ మరింత పెంచేసిన పూజా హెగ్డే: ఆమెను ఇంత ఘాటుగా ఎప్పుడూ చూసుండరు

బంగార్రాజు మూవీ బిజినెస్ డీటేల్స్
సంక్రాంతికి ఏకైక భారీ చిత్రం కావడంతో ‘బంగార్రాజు' రైట్స్‌కు పోటీ ఏర్పడింది. దీంతో నైజాంలో రూ. 11 కోట్లు, సీడెడ్‌లో రూ. 6 కోట్లు, ఆంధ్రా మొత్తంలో రూ. 16.80 కోట్లతో రెండు రాష్ట్రాల్లో కలిపి రూ. 33.80 కోట్లు బిజినెస్ జరిగింది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.15 కోట్లు, ఓవర్సీస్లో రూ. 2.20 కోట్లుతో ప్రపంచ వ్యాప్తంగా రూ. 38.15 కోట్ల బిజినెస్ జరిగింది.

ఐదో రోజు వచ్చిన కలెక్షన్ల వివరాలు
‘బంగార్రాజు'
మూవీకి
ఐదో
రోజూ
ఏపీ,
తెలంగాణలో
భారీ
స్థాయిలో
రెస్పాన్స్
వచ్చింది.
ఫలితంగా
నైజాంలో
రూ.
31
లక్షలు,
సీడెడ్‌లో
రూ.
34
లక్షలు,
ఉత్తరాంధ్రలో
రూ.
27
లక్షలు,
ఈస్ట్‌లో
రూ.
26
లక్షలు,
వెస్ట్‌లో
రూ.
24
లక్షలు,
గుంటూరులో
రూ.
24
లక్షలు,
కృష్ణాలో
రూ.
18
లక్షలు,
నెల్లూరులో
రూ.
10
లక్షలతో
కలిపి
రూ.
1.94
కోట్లు
షేర్,
రూ.
3.10
కోట్లు
గ్రాస్
వచ్చింది.
Bigg Boss OTT: షోలోకి టాలీవుడ్ కాంట్రవర్శీ కింగ్.. వామ్మో ఇక హౌస్‌లో కూడా రచ్చ రచ్చే

ఐదు రోజులకూ కలిపి వచ్చిందిలా!
ఐదు రోజులకు కలిపి ‘బంగార్రాజు'కు తెలుగు రాష్ట్రాలో మంచి కలెక్షన్లు వచ్చాయి. దీంతో నైజాంలో రూ. 7.45 కోట్లు, సీడెడ్‌లో రూ. 5.65 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 4.01 కోట్లు, ఈస్ట్‌లో రూ. 3.29 కోట్లు, వెస్ట్‌లో రూ. 2.41 కోట్లు, గుంటూరులో రూ. 2.91 కోట్లు, కృష్ణాలో రూ. 1.88 కోట్లు, నెల్లూరులో రూ. 1.46 కోట్లతో.. 5 రోజుల్లో రూ. 29.06 కోట్లు షేర్, రూ. 46.90 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంత?
ఆంధ్రా, తెలంగాణలో కలిపి ఐదు రోజులకు రూ. 29.06 కోట్లు వసూలు చేసిన బంగార్రాజు మూవీ.. మిగిలిన ప్రాంతాల్లోనూ సత్తా చాటింది. ఫలితంగా రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.58 కోట్లు, ఓవర్సీస్లో రూ. 1.30 కోట్లను రాబట్టింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో కలిపి ఈ సినిమా ఐదు రోజుల్లోనే రూ. 31.94 కోట్లు షేర్‌తో పాటు రూ. 53.20 కోట్ల గ్రాస్‌ను రాబట్టింది.
హాట్ వీడియోలో రెచ్చిపోయిన పాయల్ రాజ్‌పుత్: బాడీ పార్టులు మొత్తం చూపిస్తూ దారుణంగా!

టార్గెట్ ఎంత? ఇంకెంత రావాలంటే
క్రేజీ కాంబినేషన్లో వచ్చిన ‘బంగార్రాజు' అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 38.15 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 39 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా ఐదు రోజుల్లోనే రూ. 31.94 కోట్లు వసూలు చేసింది. అంటే మరో రూ. 7.06 కోట్లు వసూలు చేస్తేనే ఇది హిట్ స్టేటస్ సొంతం చేసుకుంటుంది.

‘బంగార్రాజు'కు షాకింగ్ కలెక్షన్లు
మంగళవారం నుంచి ఆంధ్రప్రదేశ్‌లో నైట్ కర్ఫ్యూ పెట్టారు. అలాగే, ఆక్యూపెన్సీని కూడా యాభై శాతానికి తగ్గించారు. దీంతో బంగార్రాజు మూవీకి కష్టాలు మొదలవుతాయన్న టాక్ వినిపించింది. కానీ, అనూహ్యంగా ఈ మూవీ ఐదవ రోజు కూడా బాగానే రాణించింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది మంచి హోల్డే అని అంటున్నారు. అంతేకాదు, ఈ కలెక్షన్లు చూసి విశ్లేషకులే షాక్ అవుతున్నారు.