twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Bangarraju 6 Days Collections: బంగార్రాజుకు కోలుకోలేని షాక్.. 6 రోజుల్లో తొలిసారి ఇంత తక్కువగా!

    |

    చాలా ఏళ్లుగా విజయాన్ని అందుకోవడంలో తడబడుతూ వరుసగా పరాజయాలనే చవి చూస్తున్నాడు టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున. అయినప్పటికీ వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేస్తూనే వస్తున్నాడు. ఇందులో భాగంగానే ఇప్పుడు 'బంగార్రాజు' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇందులో ఆయన కుమారుడు అక్కినేని నాగ చైతన్య కూడా నటించడంతో ఈ సినిమా ఎంతో స్పెషల్ అయింది. అదే సమయంలో దీనిపై అంచనాలు కూడా అమాంతం పెరిగిపోయాయి.

    ఇక, ఈ సంక్రాంతికి సోలోగా వచ్చిన భారీ చిత్రం కావడంతో దీనికి కలెక్షన్లు కూడా మంచిగానే వచ్చాయి. అయితే, ఆరో రోజు మాత్రం ఈ సినిమాకు కోలుకోలేని షాక్ తగిలింది. ఇక, ఈ మూవీ 6 రోజుల బాక్సీఫీస్ రిపోర్టును చూద్దాం పదండి!

    బంగార్రాజుగా తండ్రీ కొడుకు రచ్చ

    బంగార్రాజుగా తండ్రీ కొడుకు రచ్చ

    అక్కినేని నాగార్జున, నాగ చైతన్య కలిసి నటించిన చిత్రమే 'బంగార్రాజు'. 'సోగ్గాడే చిన్ని నాయన'కు సీక్వెల్‌గా రూపొందిన ఈ సినిమాను కల్యాణ్ కృష్ణ రూపొందించాడు. ఇందులో రమ్యకృష్ణ, కృతి శెట్టి హీరోయిన్లుగా నటించారు. దీన్ని అన్నపూర్ణ స్టూడియోస్, జీ స్టూడియోస్ బ్యానర్లపై నాగార్జున స్వయంగా నిర్మించారు. అనూప్ రూబెన్స్ దీనికి సంగీతం అందించాడు.

    హాట్ డోస్ మరింత పెంచేసిన పూజా హెగ్డే: ఆమెను ఇంత ఘాటుగా ఎప్పుడూ చూసుండరుహాట్ డోస్ మరింత పెంచేసిన పూజా హెగ్డే: ఆమెను ఇంత ఘాటుగా ఎప్పుడూ చూసుండరు

    బంగార్రాజు మూవీ బిజినెస్ డీటేల్స్

    బంగార్రాజు మూవీ బిజినెస్ డీటేల్స్

    భారీ మల్టీస్టారర్‌గా వచ్చిన 'బంగార్రాజు' మూవీ రైట్స్‌కు పోటీ ఏర్పడింది. దీంతో నైజాంలో రూ. 11 కోట్లు, సీడెడ్‌లో రూ. 6 కోట్లు, ఆంధ్రా మొత్తంలో రూ. 16.80 కోట్లతో రెండు రాష్ట్రాల్లో కలిపి రూ. 33.80 కోట్లు బిజినెస్ జరిగింది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.15 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 2.20 కోట్లుతో ప్రపంచ వ్యాప్తంగా రూ. 38.15 కోట్ల మేర వ్యాపారం జరిగింది.

    ఆరో రోజు వచ్చిన కలెక్షన్ల వివరాలు

    ఆరో రోజు వచ్చిన కలెక్షన్ల వివరాలు

    'బంగార్రాజు' మూవీకి ఆరో రోజూ ఏపీ, తెలంగాణలో కోలుకోలేని షాక్ తగిలింది. ఫలితంగా నైజాంలో రూ. 11 లక్షలు, సీడెడ్‌లో రూ. 18 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 22 లక్షలు, ఈస్ట్‌లో రూ. 15 లక్షలు, వెస్ట్‌లో రూ. 9 లక్షలు, గుంటూరులో రూ. 8 లక్షలు, కృష్ణాలో రూ. 4 లక్షలు, నెల్లూరులో రూ. 4 లక్షలతో కలిపి రెండు రాష్ట్రాల్లో రూ. 91 లక్షలు షేర్, రూ. 1.60 కోట్లు గ్రాస్ వచ్చింది.

    బ్రేకప్ తర్వాత గుడ్ న్యూస్ చెప్పిన షణ్ముఖ్: ఆ ప్రేమ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నా అంటూ పోస్ట్బ్రేకప్ తర్వాత గుడ్ న్యూస్ చెప్పిన షణ్ముఖ్: ఆ ప్రేమ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నా అంటూ పోస్ట్

    ఆరు రోజులకూ కలిపి వచ్చిందిలా!

    ఆరు రోజులకూ కలిపి వచ్చిందిలా!

    'బంగార్రాజు'కు ఆరు రోజులకు కలిపి తెలుగు రాష్ట్రాలో మంచి కలెక్షన్లు వచ్చాయి. దీంతో నైజాంలో రూ. 7.56 కోట్లు, సీడెడ్‌లో రూ. 5.83 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 4.23 కోట్లు, ఈస్ట్‌లో రూ. 3.44 కోట్లు, వెస్ట్‌లో రూ. 2.50 కోట్లు, గుంటూరులో రూ. 2.99 కోట్లు, కృష్ణాలో రూ. 1.92 కోట్లు, నెల్లూరులో రూ. 1.50 కోట్లతో.. 6 రోజుల్లో రూ. 29.97 కోట్లు షేర్, రూ. 48.50 కోట్లు గ్రాస్ వచ్చింది.

    ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంత?

    ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంత?

    ఏపీ, తెలంగాణలో కలిపి ఆరు రోజులకు రూ. 29.97 కోట్లు వసూలు చేసిన బంగార్రాజు మూవీ.. మిగిలిన ప్రాంతాల్లోనూ సత్తా చాటింది. ఫలితంగా రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.60 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 1.32 కోట్లను రాబట్టింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో కలిపి ఈ సినిమా ఆరు రోజుల్లోనే రూ. 32.89 కోట్లు షేర్‌తో పాటు రూ. 55.10 కోట్ల గ్రాస్‌ను సొంతం చేసుకుంది.

    సుడిగాలి సుధీర్‌పై లేడీ ఆర్టిస్ట్ వివాదాస్పద కామెంట్స్: బేవార్స్ అంటూ అతి దారుణంగా!సుడిగాలి సుధీర్‌పై లేడీ ఆర్టిస్ట్ వివాదాస్పద కామెంట్స్: బేవార్స్ అంటూ అతి దారుణంగా!

    టార్గెట్ ఎంత? ఇంకెంత రావాలంటే

    టార్గెట్ ఎంత? ఇంకెంత రావాలంటే

    ఎంతో ప్రతిష్టాత్మకంగా వచ్చిన 'బంగార్రాజు' అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 38.15 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 39 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా ఆరు రోజుల్లోనే రూ. 32.89 కోట్లు వసూలు చేసింది. అంటే మరో రూ. 6.11 కోట్లు వసూలు చేస్తేనే ఇది హిట్‌ స్టేటస్‌‌ను అందుకుంటుంది.

    ‘బంగార్రాజు'కు కోలుకోలేని షాక్

    ‘బంగార్రాజు'కు కోలుకోలేని షాక్

    జనవరి 18 నుంచి ఆంధ్రప్రదేశ్‌లో నైట్ కర్ఫ్యూ పెట్టారు. అలాగే, ఆక్యూపెన్సీని కూడా యాభై శాతానికి తగ్గించారు. దీంతో బంగార్రాజు మూవీకి కష్టాలు మొదలవుతాయన్న టాక్ వినిపించింది. కానీ, అనూహ్యంగా ఆరోజు ఈ మూవీ బాగానే రాణించింది. అయితే, బుధవారం మాత్రం ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో కోలుకోలేని షాక్ తగిలింది. దీంతో తొలిసారి తక్కువ కలెక్షన్లు వచ్చాయి.

    English summary
    Akkineni Nagarjuna and Naga Chaitanya Did Bangarraju Movie Under Kalyan Krishna Direction. This Movie Collects Rs 32.89 Crores in Six Days
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X