Bangarraju Pre Release Bussiness: మారిన లెక్కలు.. బాక్సాఫీస్ వద్ద అసలు టార్గెట్ ఎంతంటే?
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో చాలా కాలం తర్వాత మళ్లీ మరోసారి కరోనా తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. రాబోయే సినిమాల బిజినెస్ మొన్నటి వరకు బాగానే ఉన్నా ప్రస్తుత పరిస్థితులతో మళ్ళీ ఒక్కసారిగా తగ్గిపోయినట్లు తెలుస్తోంది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో అయితే ప్రస్తుతం అందరి ఫోకస్ బంగార్రాజు సినిమా పైనే ఉంది. ఈ సినిమా బిజినెస్ మొన్నటి వరకు కాస్త ఎక్కువగా ఉన్నప్పటికీ ఇటీవల మళ్లీ చర్చలతో ఆంధ్రప్రదేశ్లో చాలవరకు రేట్లు తగ్గినట్లు తెలుస్తున్నాయి. ఫైనల్గల్ గా సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఏ స్థాయిలో చేసింది? బాక్సాఫీస్ వద్ద బంగార్రాజు ఎంత రాబట్టాలి? అనే వివరాల్లోకి వెళ్తే..

బంగార్రాజు అడ్వాంటేజ్
మొన్నటి వరకు అతిపెద్ద పాన్ ఇండియా సినిమాలు థియేటర్స్ లోకి రాబోతున్నట్లు ఎంతో సంతోషంగా ఉన్న అభిమానులకు ఒక్కసారిగా ఓమిక్రాన్ దెబ్బతో తీవ్ర నిరాశ ఎదురైంది. RRR సినిమా రాధేశ్యామ్ రెండూ కూడా వాయిదా పడడంతో అడ్వాంటేజ్ గా తీసుకున్న బంగార్రాజు బాక్సాఫీస్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు. ఇక సినిమా బిజినెస్ కూడా ప్రస్తుతం బాగానే కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.

సంక్రాంతిలో స్పెషల్ ఎట్రాక్షన్ గా..
నాగ చైతన్య నాగార్జున కలిసి నటించిన ఈ రెండవ సినిమాపై అంచనాలు ప్రస్తుతం అయితే మామూలుగా లేవు. 2016 లో వచ్చిన సోగ్గాడే చిన్నినాయన సినిమా తరహాలోనే బంగార్రాజు పాత్రతో నాగచైతన్య సందడి చేయబోతున్నాడు. అంతేకాకుండా నాగార్జున చేసే ప్రత్యేకమైన పాత్ర కూడా సినిమాలో స్పెషల్ అట్రాక్షన్ గా ఉంటుందట. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాను నాగార్జున తన సొంత ప్రొడక్షన్ లో నిర్మించారు.

కరోనా ప్రభావం?
బంగార్రాజు సినిమా సంక్రాంతి సెంటిమెంట్ లో ఎక్కువగా ఉపయోగించుకోవాలని అనుకుంటుంది. ఎట్టిపరిస్థితిలోనూ సినిమాను జనవరి 14 వ తేదీన విడుదల చేయాలని అన్ని ప్రణాళికలను ఇప్పటికే పూర్తి చేసుకున్నారు. అయితే ప్రస్తుతం కరోనా ఎక్కువవుతున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ లో 50% ఆక్యుపెన్సీ ప్రభావం పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

తక్కువ బిజినెస్ తోనే..
మొన్నటి వరకు బంగార్రాజు 50 కోట్లు రిలీజ్ బిజినెస్ చేస్తోందని చాలా రకాల కథనాలు వెలువడ్డాయి అయితే ఇప్పుడు మాత్రం సినిమాను తెలుగు రాష్ట్రాల్లో అంతకంటే తక్కువ బిజినెస్ తోనే విడుదల కాబోతున్న ట్లుగా తెలుస్తోంది. బంగార్రాజు సినిమా ఎక్కువగా నైజాం ఏరియా పైన నమ్మకం పెట్టుకుంది.. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో టికెట్ల రేట్లు కూడా చాలా వరకు తక్కువగా ఉండడంతో ఆ ఏరియాలో ప్రూ రిలీజ్ బిజినెస్ మళ్ళీ తగ్గినట్లు సమాచారం.

తెలుగు రాష్ట్రాల్లో..
బంగార్రాజు ఏరియాల వారిగా చేసిన ప్రీ రిలీజ్ బిజినెస్ ఈ విధంగా ఉంది. నైజాంలో 11కోట్లు, సీడెడ్ లో 6.3కోట్లు, ఉత్తరాంధ్ర 4. 14కోట్లు, ఈస్ట్ 2.88 కోట్లు, వెస్ట్ 2.60కోట్లు, కృష్ణ 2.70కోట్లు, గుంటూరు 3.24కోట్లు.. మొత్తంగా బంగార్రాజు సినిమా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో 35కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది.

టార్గెట్ ఎంతంటే?
ఈ సమయంలో 35కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ అంటే నాగార్జునకు నాగ చైతన్యకు పెద్ద టార్గెట్ కాకపోవచ్చు కానీ సినిమాకు ఏ మాత్రం డివైడ్ టాక్ వచ్చినా కూడా తేడా వచ్చేస్తుంది. గత కొంతకాలంగా నాగ చైతన్య మార్కెట్ కాస్త ఎక్కువగానే ఉండడం అడ్వాంటేజ్ అని చెప్పవచ్చు. ఫైనల్ గా బంగార్రాజు 36కోట్ల షేర్ అందుకుంటేనే హిట్ అయినట్లు లెక్క. మరి ఆ టార్గెట్ ను ఎన్ని రోజుల్లో ఫినిష్ చేస్తారో చూడాలి.


Click it and Unblock the Notifications











