Bangarraju pre release business.. నాగార్జున కెరీర్‌లోనే హయ్యెస్ట్‌గా.. ఏ మేరకు అమ్ముడుపోయిందంటే?

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో సంక్రాంతి రాబోయే సినిమాల మధ్య పోటీ తీవ్రత ఏ స్థాయిలో ఉంటుందో తెలియదు. కానీ ఎక్కువ ఫోకస్ మాత్రం బంగార్రాజు సినిమా పైనే ఉంది. రాధేశ్యామ్ సినిమా పాన్ ఇండియా మార్కెట్ ను దృష్టిలో పెట్టుకొని విడుదల అయితే మాత్రం కలెక్షన్స్ అనుకున్నంతగా రావు అని చెప్పవచ్చు. ఇక బంగార్రాజు కేవలం తెలుగులోనే భారీ స్థాయిలో విడుదల అవుతోంది కాబట్టి బిజినెస్ స్ట్రాంగ్ గా ఉన్నట్లు తెలుస్తోంది.. ఇక సినిమాకు సంబంధించిన బిజినెస్ లెక్కలు కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి.

కాస్త పాజిటీవ్ టాక్ వచ్చినా

కాస్త పాజిటీవ్ టాక్ వచ్చినా

నాగార్జున అక్కినేని నాగచైతన్య కలిసి నటించిన రెండవ సినిమా బంగార్రాజు పై అంచనాలు అయితే గట్టిగానే ఉన్నాయి. ఎందుకంటే ఇది పూర్తిగా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ సినిమా కాబట్టి చాలా వరకు ఫ్యామిలీ ఆడియన్స్ సినిమాను చూసేందుకు థియేటర్స్ కు వస్తారు అని చెప్పవచ్చు. పండుగ సమయంలో ఇలాంటి సినిమాకు కాస్త పాజిటీవ్ టాక్ వచ్చినా కూడా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ ఊహించని విధంగా ఉంటాయి.

RRR ప్రభావం..

RRR ప్రభావం..


నిజానికి బంగార్రాజు సినిమా పై ఈ సంక్రాంతికి మొదట అనుకున్నంత హైప్ లేదు. ఎప్పుడైతే RRR సినిమా వాయిదా పడిందో అప్పటి నుంచి కూడా ఈ సినిమా బిజినెస్ ఊపందుకుంది. రాధేశ్యామ్ సినిమా పూర్తిగా లవ్ స్టోరీ కాబట్టి కేవలం ఓ వర్గం ఫ్యాన్స్ అలాగే మరికొంతమంది ప్రేక్షకులు మాత్రమే ఫోకస్ చేసే అవకాశం ఉంది. కానీ బంగార్రాజు సినిమా మాత్రం ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా కావున బజ్ అయితే చాలా ఎక్కువగా ఉంది.

బంగార్రాజుపై ఎందుకింత హైప్ అంటే..

బంగార్రాజుపై ఎందుకింత హైప్ అంటే..

RRR సినిమా వాయిదా పడింది అనగానే ఒక్కరోజులోనే బంగార్రాజు పై డిస్ట్రిబ్యూటర్లు బయ్యర్లు కూడా ఫోకస్ పెట్టారు. ఈ సినిమాతో బిజినెస్ చేసేందుకు చాలా ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే బంగార్రాజు సినిమా సోగ్గాడే చిన్నినాయన సినిమాకు సీక్వెల్ గా వస్తోంది. 2016 సంక్రాంతి కి సోగ్గాడే చిన్నినాయన సినిమాతో నాగార్జున బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం నాగచైతన్య కూడా హిట్స్ లో ఉన్నాడు కాబట్టి బంగార్రాజు సినిమా తప్పకుండా మంచి బిజినెస్ చేస్తుందని నమ్మకం అయితే ఉంది.

బడ్జెట్ ఎంతంటే?

బడ్జెట్ ఎంతంటే?


ఇక ఆంధ్ర నైజాం అని తేడా లేకుండా హీరోలు మార్కెట్ బట్టి బిజినెస్ జరుగుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు సంక్రాంతి సీజన్ కాబట్టి అందులోనూ సోగ్గాడే చిన్ని నాయనా సినిమాకు సీక్వెల్ కాబట్టి బంగార్రాజు మార్కెట్ అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ఇక ఈ సినిమాను కేవలం 35 కోట్ల తో నిర్మించినట్లు తెలుస్తోంది.

 ప్రీ రిలీజ్ బిజినెస్

ప్రీ రిలీజ్ బిజినెస్

ఇక ప్రస్తుతం ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలకి చిత్రయూనిట్ సభ్యులు సంతోషంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆంధ్రలో 18 కోట్ల, సీడెడ్ లో 5 కోట్లు, నైజాం లో 8-10 కోట్ల రేంజ్ లో బిజినెస్ చేసే అవకాశం ఉందట. మొత్తంగా బంగార్రాజు సినిమా 35 కోట్ల వరకు బిజినెస్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

బాక్సాఫీస్.. 50కోట్లు

బాక్సాఫీస్.. 50కోట్లు


ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా కూడా బంగార్రాజు సినిమా బాక్సాఫీస్ వద్ద ఈజీగా యాభై కోట్లను అందుకుంటుందని చెప్పవచ్చు. అదృష్టవశాత్తు మిగతా సినిమాల నుంచి పోటీ పెద్దగా ఉండకపోవచ్చు. సంక్రాంతి సీజన్లో చాలా ఏరియాల్లో అనుకున్నదానికంటే ఎక్కువ రేటుకు కొనుగోలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక సినిమాను జనవరి 15న విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X