'బంగారు కోడి పెట్ట' మళ్లీ వాయిదా..కొత్త తేదీ

By Srikanya

హైదరాబాద్ : నవదీప్, కలర్స్ స్వాతి కాంబినేష్ లో రూపొందుతున్న చిత్రం 'బంగారు కోడి పెట్ట'. 'బోణి' ఫేమ్ రాజ్ ఫిప్పళ్ళ ఈ చిత్రాన్ని డైరక్ట్ చేస్తున్నారు. చాలా కాలం క్రితమే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 27న విడుదల చేస్తున్నామంటూ రిలీజ్ డేట్ ని ఇచ్చారు. అయితే చివరి నిముషంలో విడుదలని ఫోస్ట్ పోన్ చేసారు. మార్చి 7 న విడుదల చెయ్యాలని దర్శక,నిర్మాతలు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. 27న భీమవరం బుల్లోడు చిత్రం ఉండటంతో థియోటర్ సమస్యలు వస్తున్నాయని,అలాగే ఓపినింగ్స్ ఇబ్బంది అవుతుందని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. U/A సర్టిఫికేట్ ని అందుకున్న ఈ చిత్రం ఎంటర్టైన్మెంట్ ప్రధానంగా నడుస్తుందని చెప్తున్నారు. ఈ చిత్రాన్ని సునీత ధాటే నిర్మిస్తోంది. ఆమె తన గురు ఫిలిమ్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది

మూడు కథలతో రాజ్ పిప్పళ్ల దర్శకత్వంలో 'బంగారు కోడిపెట్ట' రూపొందింది. భయమంటే ఏమిటో తెలియని కుర్రాడు వంశీ. ఏ పనైనా సొంతంగానే చేయాలనుకొంటాడు. ఎవరికీ ఏ విషయంలోనూ దొరకడు. అచ్చం అలాంటి అబ్బాయి కోసమే ఎదురు చూసింది భానుమతి. తను ఎదగాలంటే అలాంటి ఓ టక్కరి కుర్రాడు అవసరమనేది భాను ఆలోచన. అందుకే గురి చూసి ఓ వాలు చూపు విసిరింది. దెబ్బకి పడిపోయాడు. మరి ఆ తర్వాత వీరి ప్రయాణం ఏ రీతిన సాగిందో తెరపైనే చూడాలంటున్నారు రాజ్‌ పిప్పళ్ల. ఇది ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్ అని చెప్తున్నారు.

 Bangaru Kodipetta postponed again

ఇక ఈ చిత్రం కథ నేరేషన్ ఎలా నడుస్తుందంటే... ''భాను అనే ఓ మధ్య తరగతి అమ్మాయి తన కాళ్ల మీద నిలబడే ప్రయత్నంలో టక్కరివాడైన వంశీని ఎంచుకోవడం మొదటి కథ. పిజ్జా డెలివరీ బోయ్‌గా పని చేస్తూ, తెలుగు సినిమా హీరో అవ్వాలని ఓ కుర్రాడు చేసే ప్రయత్నమే రెండో కథ. కవలల నేపథ్యంలో మూడో కథ సాగుతుంది. ఈ మూడు కథలు ఒకచోట కలవడంతో సినిమా ప్రారంభమవుతుంది. సంక్రాంతి నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుంది. వినోదాత్మకంగా సాగే రొమాంటిక్ క్రైమ్ కథాచిత్రమిది. మూడు విభిన్న కథలతో ఈ చిత్రం ఆసక్తికరంగా సాగుతుంది. మొదటి కథలో వంశీగా నవదీప్, భానూగా స్వాతి నటించారు.

దర్శకుడు రాజ్ పిప్పళ్ల మాట్లాడుతూ...అందరికీ ఓ బంగారు కోడిపెట్ట ఉంటుంది. దానితో ఆనందం,మనశ్సాంతి దొరుకుతుంది. దాని కోసం తట్ట, బుట్ట క్రింద వెతుకుతాం. ఈ సినిమాలో రియలైజ్ అయ్యేదేమిటంటే...బంగారు కోడిపెట్ట మన మనస్సులోనే ఉంది . సంక్రాంతి నేపథ్యంలో సాగే చిత్రమిది. మనిషి తన జీవితంలో రకరకాల అడ్డదారులను వెదుకుతుంటాడు. జీవితం మాత్రం తనదైన దారినే చూపెడుతుందన్న అంశాన్ని ఇందులో ఆసక్తికరంగా చెప్పాం. దొంగతనం, పేకాట, కోడి పుంజు అపహరణ, సినిమా ఆడిషన్స్‌ తదితర అంశాల నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులకు చక్కటి వినోదాన్ని పంచుతాయి''అన్నారు.

హీరోయిన్ కలర్స్ స్వాతి మాట్లాడుతూ... సునీత, రాజ్ లతో పనిచేయటం చాలా ఆనందంగా ఉంది. రియల్ జర్నీలా ఉంది. ఈ సినిమా బాగా ఆడాలని కోరుకుంటున్నా. సునీ ఎనర్జీ నైస్ అన్నారు. నవదీప్ మాట్లాడుతూ... ఈ సినిమాకు అందరూ తలో కాస్త ఇన్ పుట్స్ ఇచ్చి ఈ సినిమాను చేసాం. బెటర్ మెంట్ చేసాం. న్యూ జనరేషన్ మూవీ వచ్చింది అని అందరూ అంటారు అన్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X