Barabar Premistha 4 days Box Office: షాకింగ్‌గా బరాబర్ ప్రేమిస్తా కలెక్షన్లు.. చంద్రహాస్ మూవీ పరిస్థితి ఏమిటి?
తెలుగు సినిమా పరిశ్రమలో తొలి సినిమాతోనే యాటిట్యూడ్ స్టార్ మారిన చంద్రహాస్ నటించిన తాజా చిత్రం బరాబర్ ప్రేమిస్తా. ఈ చిత్రంలో మేఘనా ముఖర్జీ హీరోయిన్‌గా నటిస్తున్నది. సీసీ క్రియేషన్స్, ఏవీఆర్ మూవీ వండర్స్ బ్యానర్‌పై ఈ మూవీని గేద చందు, గాయత్రి చిన్ని, వెంకటేశ్వరరావు నిర్మించారు. రూరల్ డ్రామాగా, లవ్, అండ్ యూత్‌ఫుల్ ఎమోషనల్ అంశాలతో రూపొందిన ఈ సినిమాకు సంపత్ రుద్ర స్క్రీన్ ప్లే, దర్శకత్వం వహించారు.
ఈ చిత్రంలో అర్జున్ మహీ, మురళీధర్ గౌడ్, మధునందన్, మీసాల లక్ష్మణ్, అభయ్ నవీన్, రాజశేఖర్ అనిగి, కీర్తీ లతా గౌడ్, సునీతా మనోహర్ తదితరులు నటించారు. ప్రమోషనల్ కంటెంట్‌తో చర్చనీయాంశమైన ఈ సినిమాకు ఆర్ఆర్ ధృవన్ సంగీతం, బొంతల నాగేశ్వర్ రెడ్డి ఎడిటింగ్, వైఆర్ శేఖర్ సినిమాటోగ్రఫిని అందించారు. ఈ మూవీకి మా తిరుపతి కథను అందించారు. ఫిబ్రవరి 6వ తేదీన రిలీజ్ అయింది. ఈ నేపథ్యంలో సినిమా బడ్జెట్ ఎంత? ఏ మేరకు ప్రీ రిలీజ్ బిజినెస్ అయింది? బ్రేక్ ఈవెన్ ఎంత? ఈ సినిమా వసూలు చేసిన కలెక్షన్లు ఎంత? అనే వివరాల్లోకి వెళితే..

రాంనగర్ బన్నీ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన చంద్రహాస్.. పలు రకాల ట్రోలింగ్‌కు గురి కావడమే కాకుండా తనదైన యాటిట్యూడ్‌తో వివాదాలకు కేంద్ర బిందువుగా మారాడు. తాజాగా తాను నటించిన ఈ చిత్రంలోని ఓ పాటలో బూతు పదాలను ఉపయోగించి అనేక విమర్శలకు గురయ్యాడు. కొందరు ఆయన తీరును తప్పుబడుతూ హైదరాబాద్‌లో కేసు నమోదు చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఇక రూరల్ బ్యాక్ డ్రాప్‌తో కుల వివక్ష నేపథ్యంగా ప్రేమ కథా చిత్రంగా రూపొందింది. ఈ సినిమాను సుమారుగా 4 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మించారు. ఈ సినిమాను నిర్మాతలు స్వయంగా రిలీజ్ చేశారు. ఈ మూవీని డిస్ట్రిబ్యూషన్ కమీషన్‌పై ఏషియన్ ఫిలింస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో 40 సిటీలలో 80 ప్రదేశాల్లో 80 స్క్రీన్లలో ప్రదర్శించారని ట్రేడ్ వర్గాలు తెలిపాయి.
త
ఈ సినిమా వివాదాల నడుమ థియేటర్లలో వచ్చి.. ప్రభావం చూపలేకపోయింది. ఈ చిత్రం తొలి రోజున 25 లక్షలు, రెండో రోజు 20 లక్షలు, మూడో రోజు 25 లక్షలు, నాలుగో రోజు 15 లక్షల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం గత నాలుగు రోజుల్లో 85 లక్షల గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది. ఈ చిత్రం నిలదొక్కుకొని వసూళ్లను బాక్సాఫీస్ వద్ద మెరుగు పరుచుకొంటుందా? లేదా అనేది వేచి చూడాల్సిందే.
ఇక ఈ సినిమా విషయానికి వస్తే.. 2 కోట్ల రూపాయల నెట్, 4 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టాల్సి ఉంటుంది. ప్రస్తుతం 85 లక్షల నెట్, 1.2 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే.. ఇంకా భారీగా కలెక్షన్లను రాబట్టాల్సి ఉంటుంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











