Barabar Premistha Box Office: దారుణంగా బారాబర్ ప్రేమిస్తా కలెక్షన్లు.. చంద్రహాస్ మూవీ బాక్సాఫీస్ రిపోర్ట్ ఇదే.
బుల్లితెర స్టార్ యాక్టర్ ఈటీవీ ప్రభాకర్ తనయుడు, యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ నటించిన తాజా చిత్రం బరాబర్ ప్రేమిస్తా. ఈ చిత్రంలో మేఘనా ముఖర్జీ హీరోయిన్‌గా నటిస్తున్నది. సీసీ క్రియేషన్స్, ఏవీఆర్ మూవీ వండర్స్ బ్యానర్‌పై ఈ మూవీని గేద చందు, గాయత్రి చిన్ని, వెంకటేశ్వరరావు నిర్మించారు. రూరల్ డ్రామాగా, లవ్, అండ్ యూత్‌ఫుల్ ఎమోషనల్ అంశాలతో రూపొందిన ఈ సినిమాకు సంపత్ రుద్ర స్క్రీన్ ప్లే, దర్శకత్వం వహించారు.
ఈ చిత్రంలో అర్జున్ మహీ, మురళీధర్ గౌడ్, మధునందన్, మీసాల లక్ష్మణ్, అభయ్ నవీన్, రాజశేఖర్ అనిగి, కీర్తీ లతా గౌడ్, సునీతా మనోహర్ తదితరులు నటించారు. ప్రమోషనల్ కంటెంట్‌తో చర్చనీయాంశమైన ఈ సినిమాకు ఆర్ఆర్ ధృవన్ సంగీతం, బొంతల నాగేశ్వర్ రెడ్డి ఎడిటింగ్, వైఆర్ శేఖర్ సినిమాటోగ్రఫిని అందించారు. ఈ మూవీకి మా తిరుపతి కథను అందించారు. ఫిబ్రవరి 6వ తేదీన రిలీజ్ అయింది. ఈ నేపథ్యంలో సినిమా బడ్జెట్ ఎంత? ఏ మేరకు ప్రీ రిలీజ్ బిజినెస్ అయింది? బ్రేక్ ఈవెన్ ఎంత? ఈ సినిమా వసూలు చేసిన కలెక్షన్లు ఎంత? అనే వివరాల్లోకి వెళితే..

తెలుగు సినిమా పరిశ్రమలో అత్యంత వివాదాస్పదంగా మారిన చిత్రం ఏదైనా ఉందంటే.. అది బరాబర్ ప్రేమిస్తా చిత్రమే. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరో చంద్రహాస్ పాడిన పాటలో అసభ్య పదజాలం ఉండటంపై విమర్శలు వెల్లువెత్తాయి. దాంతో ఈ సినిమా హీరోపై రకరకాలుగా ట్రోలింగ్ నమోదైంది. ఇలాంటి నేపథ్యంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాను నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్లు, అలాగే ప్రమోషనల్ ఖర్చులతో కలిపి సుమారుగా 4 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఈ సినిమాను స్వయంగా రిలీజ్ చేసుకొన్నారు.
అయితే ఈ సినిమా వివాదాల్లో నానడం వల్ల ప్రతికూల పరిస్థితులు కనిపించాయి.ఈ సినిమాతోపాటు పలు సినిమాలు ఎక్కువగా రిలీజ్ కావడంతో ఎక్కువగా పోటీ కనిపించింది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపలేకపోయింది.ఈ సినిమాకు పేలవంగా అడ్వాన్స్ బుకింగ్ నమోదైంది. దాంతో తక్కువ వసూళ్లతో బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. బరాబర్ ప్రేమిస్తా చిత్రానికి తొలి రోజు బాక్సాఫీస్ తడబాటు కనిపించింది. ఈ సినిమా సుమారుగా 50 లక్షల రూపాయల గ్రాస్, 25 లక్షల రూపాయల నెట్ వసూళ్లను సాధించింది. రానున్న రోజుల్లో ఈ సినిమా వసూళ్ల పరంగా నిలదొక్కుకొంటే ఇంకా బెటర్ పెర్ఫార్మ్ చేసే అవకాశం ఉంది. వివాదాల వల్ల అటెన్షన్ క్రియేట్ అయింది. ఈ వివాదం సినిమాకు ఎంత వరకు పనికి వస్తుంది? లేదా ఎంత నష్టం చేస్తుందనేది వేచి చూడాల్సిందే అని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
ఇక ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే.. కనీసం 3 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టాల్సి ఉంటుంది. అయితే రానున్న రోజల్లో ఈ సినిమా ఆ టార్గెట్‌ను బ్రేక్ చేస్తుందా? లాభాల్లోకి ప్రవేశిస్తుందా? లేక నష్టాల్లో క్లోజ్ అవుతందా? అనేది ఆసక్తికరంగా మారింది.


Click it and Unblock the Notifications











