1200 కోట్ల బడ్జెట్.. 11450 కోట్ల కలెక్షన్లు..వసూళ్ల సునామీని సృష్టించిన సినిమా ఏంటో తెలుసా?
హాలీవుడ్‌లో భారీ అంచనాలతో రిలీజైన చిత్రం బార్బీ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాలు సాధించింి. మార్గాట్ రోబీ, ర్యాన్ గోస్లింగ్ నటించిన ఈ చిత్రానికి గ్రేటా జెర్‌విగ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా మాటెల్ రచించిన బార్బీ అనే నవల ఆధారంగా తెరకెక్కింది. ఈ చిత్రాన్ని డేవిడ్ హేమ్యాన్, మార్గట్ రాబీ, టామ్, రబీ బ్రెన్నెర్ నిర్మించారు. జూలై 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా రేంజ్ కలెక్షన్లు సాధించింది. ఎంత లాభాలను ఆర్జించింది. ఈ సినిమా బడ్జెట్ ఎంత? అనే వివరాల్లోకి వెళితే..
బార్బీ సినిమా బడ్జెట్ విషయానికి వస్తే.. హాలీవుడ్‌లో అత్యధిక వ్యయంతో నిర్మించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఈ సినిమాను 145 మిలియన్ డాలర్లు అంటే.. సుమారుగా 1200 కోట్ల రూపాయలతో తెరకెక్కించారు. ఈ సినిమాను ఇండియాలో దాదాపు 1000 స్క్రీన్లలో రిలీజ్ చేయగా.. ప్రపంచవ్యాప్తంగా 10000 స్క్రీన్లకుపైగా విడుదల చేశారు.

బార్బీ సినిమా భారీ పోటీ మధ్య థియేట్రికల్ రిలీజ్ జరిగింది. అదే రోజు ఓప్పెన్‌హైమర్ సినిమా కూడా రిలీజ్ అయింది. అయితే ఇండియాలో ఒప్పెన్‌హైమర్ సినిమాకు భారీ కలెక్షన్లు వస్తే.. బార్బీ కలెక్షన్ల పరంగా వెనుక బడింది. ఓవర్సీస్‌లో మాత్రం ఒప్పెన్‌హైమర్ సినిమాను మించి కలెక్షన్లు సాధించడడమే కాకుండా రికార్డులు కొల్లగొట్టింది. ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఒకటిగా బార్బీ మూవీ నిలిచింది.
బార్బీ సినిమా ఇండియా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తొలివారం 28 కోట్ల రూపాయలు, రెండోవారం 11 కోట్ల రూపాయలు, మూడో వారం 5.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఈ సినిమా నాలుగో వారం 2 కోట్లు రాబట్టింది. దాంతో ఈ సినిమా ఇండియాలో 46 కోట్ల రూపాయలకుపైగా షేర్ సాధించింది.

ఇక ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. బార్బీ చిత్రం కలెక్షన్ల సునామీని మరిపించింది. ఈ చిత్రం అమెరికాలో 351 మిలియన్ డాలర్లు అంటే.. భారతీయ కరెన్సీలో 3 వేల కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌లో ఈ సినిమా 775 మిలియన్ డాలర్లు అంటే 6 వేల కోట్ల రూపాయలకుపైగా వసూళ్లను నమోదు చేసింది.

బార్బీ మూవీ థియేట్రికల్ రన్‌లో రికార్డు కలెక్షన్లను రాబట్టింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అంటే.. ఇండియా, అమెరికా, కెనడా, యూకే, ఆస్ట్రేలియా, జర్మనీ, ప్రాన్స్, దుబాయ్, ఇతర దేశాల్లో కలిపి 1.38 బిలియన్ డాలర్లు అంటే ఈ సినిమా 11450 కోట్ల రూపాయలను కలెక్ట్ చేసింది. ఇటీవల కాలంలో ఈ రేంజ్‌లో వసూలు చేసిన సినిమాలు చాలా తక్కువగా ఉన్నాయి.


Click it and Unblock the Notifications











