'బతుకమ్మ' బతికింది

సింధూ తులానీ నాయికగా నటించిన 'బతుకమ్మ' సినిమా తెలంగాణలో 9 ప్రింట్లతో విడుదలయ్యింది. తెలంగాణ ప్రజల ఆరాధ్య దైవమైన బతుకమ్మ కథను ఆధారం చేసుకుని దర్శకుడు టి. ప్రభాకర్ ఈ సినిమాని రూపొందించారు. కాగా రోజురోజుకూ ప్రజాదరణ పెంచుకుంటూ వస్తున్న ఈ సినిమా ప్రింట్ల సంఖ్య నేడు 25కు చేరింది. నంది అవార్డు విజేత అందెశ్రీ మాటలు, పాటలు రాసిన ఈ చిత్రానికి దర్శకుడు ప్రభాకర్ సంగీతాన్ని కూడా సమకూర్చారు. దసరా మాదిరిగానే అక్టోబరులో తెలంగాణ ప్రజలు బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకుంటారు. అంత ప్రాధాన్యత వున్న బతుకమ్మ కథతో వచ్చిన సినిమా కాబట్టి వారు 'బతుకమ్మ'ను ఆదరిస్తున్నారు.


Click it and Unblock the Notifications











