50 కోట్లు కొల్లగొట్టిన బాట్లా హౌస్.. ట్రేడ్ వర్గాలకు షాకిచ్చేలా జాన్ అబ్రహం
బాలీవుడ్ చిత్రం బాట్లా హౌస్ అంచనాలకు మంచి బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధించడం ట్రేడ్ వర్గాల్లో జోష్ పెంచింది. ఇండిపెండెన్స్ డే రోజున విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను దడదడలాడిస్తున్నది. తొలి ఆట నుంచి మంచి టాక్‌తో కలెక్షన్ల వేగం పెంచింది. జాన్ అబ్రహం, మృణాల్ ఠాకూర్ కలిసి నటించిన ఈ చిత్రం తొలి ఆట నుంచి భారీ వసూళ్లను రాబట్టింది.
గురువారం తొలి రోజునే రూ.14.50 కోట్లు వసూలు చేసింది. శుక్రవారం రూ.7.50 కోట్లు, శనివారం రూ.9.50 కోట్లు మాత్రమే వసూలు చేసి కొంత నిరాశ పరిచింది. నిఖిల్ అద్వానీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై సినీ విమర్శకులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ఇక ఆదివారం సెలవు దిన కావడంతో వసూళ్లు పరుగులు పెట్టాయి. ఏకంగా ఆదివారం రూ.12 కోట్లు కలెక్ట్ చేసింది. ఢిల్లీ, యూపీలో ఈ సినిమాకు అత్యంత ప్రజాదరణ దక్కడంతో వారాంతానికి రూ.47.99 కోట్లు వసూలు చేసింది. త్వరలోనే ఈ చిత్రం రూ.50 కోట్ల క్లబ్‌లో చేరడం ఖాయమని ట్రేడ్ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
ఢిల్లీలోని బాట్లా హౌస్‌లో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంగా ఈ చిత్రం తెరకెక్కింది. బాట్లా హౌస్ ఎన్‌కౌంటర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆరిజ్ ఖాన్, షెహ్‌జాద్ ఆహ్మద్ ఈ సినిమా రిలీజ్ నిలిపివేయాలని కోర్టులో కేసు వేశారు. అయితే వారి పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించడంతో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.


Click it and Unblock the Notifications











