twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Beast 8 days collections.. KGF2 దెబ్బకు విలవిల.. ఎన్ని కోట్ల నష్టమంటే?

    |

    తమిళ సూపర్ స్టార్ విజయ్ నటించిన బీస్ట్ చిత్రం బాక్సాఫీస్ వద్ద చతికిలపడింది. రిలీజ్‌కు ముందు విడుదలైన టీజర్లు, ట్రైలర్లు, పాటలు సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. మూవీ రిలీజ్ తర్వాత అంచనాలు కనీసం కూడా చేరుకోలేకపోయాయనే విమర్శ వచ్చింది. సినిమాకు సంబంధించిన సబ్జెక్ట్, స్క్రీన్ ప్లే సరిగా లేకపోవడం, అదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా KGF Chapter 2 హవా కొనసాగడంతో బీస్ట్‌కు ప్రతికూలంగా మారింది.

    తొలి రెండు రోజుల్లో సుమారు 70 కోట్లు సాధించిన చిత్రం ఆ తర్వాత ఆ జోష్‌ను కొనసాగించలేకపోయింది. రెండో వారంలో కేజీఎఫ్2 కోసం అదనంగా 150 స్క్రీన్లను పెంచారు. అలాగే బీస్ట్ సినిమాకు సంబంధించి 200 స్క్రీన్లను తగ్గించారు.

    బీస్ట్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా మూడో రోజు 15.80 కోట్లు, నాలుగో రోజు 13.51 కోట్లు, ఐదో రోజు 13.21 కోట్లు, ఆరో రోజు 3.60 కోట్లు, 7వ రోజు 2.55 కోట్లు సాధించింది. అయితే రెండోవారంలో తమిళనాడులో థియేటర్ల సంఖ్య కుదించడంతో బీస్ట్ కలెక్షన్లు భారీగా క్షీణించాయి. ఎనిమిదో రోజున కేవలం 1.78 కోట్లు మాత్రమే వసూలు చేసింది.

    Beast 8 days collections worldwide: Will Vijay movie make break even?

    ఇక ఎనిమిది రోజుల్లో వివిధ భాషల్లో బీస్ట్ చిత్రం సాధించిన కలెక్షన్ల వివరాలు ఇలా ఉన్నాయి. తమిళనాడులో 102 కోట్ల గ్రాస్, తెలుగు రాష్ట్రాల్లో 12.53 కోట్ల గ్రాస్, కర్ణాటకలో 10.10 కోట్లు, మిగితా రాష్ట్రాల్లో 3.30 కోట్లు, ఓవర్సీస్‌లో 60.30 కోట్లు రాబట్టింది. దీంతో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 201.3 కోట్ల గ్రాస్, 102 కోట్ల షేర్ నమోదు చేసింది.

    ఇదిలా ఉంటే, బీస్ట్ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగానే నమోదైంది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం 125 కోట్ల మేర బిజినెస్ చేసింది. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే.. ఇంకా 25 కోట్ల మేర రాబట్టాల్సిన అవసరం ఉంది. ఇక తెలుగులో ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 10 కోట్లుగా నమోదైంది. అయితే ఇప్పటి వరకు సుమారు 7 కోట్లు వసూలు చేసింది. ఇంకా 3 కోట్లు వసూలు చేయగలిగితే బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశం ఉంది.

    English summary
    Vijay's Beast movie is doing good at box office inspite of negative reviews. It collected 201 crore gross collections in 8 days.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X