Beast day 4 collections భారీగా కుమ్మేస్తున్న బీస్ట్.. 200 కోట్ల కన్నేసిన విజయ్

తమిళ ఇళయ దళపతి విజయ్ నటించిన బీస్ట్ చిత్రం అన్ని రకాల ప్రతికూలతలను ఎదుర్కొంటూ బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టిస్తున్నది. విజయ్ కెరీర్‌లో ఎన్నడూ లేని విధంగా క్రిటిక్స్ నుంచి తీవ్రమైన విమర్శలు ఈ సినిమా ఎదుర్కొన్నది. నాసిరకమైన కంటెంట్.. కథనం కారణంగా ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అయినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాయడం వెనుకు సూపర్ స్టార్ విజయ్ స్టామినా ఏంటో తెలియకనే తెలియజెప్పింది. నాలుగో రోజు బీస్ట్ సినిమా కలెక్షన్లు ఎలా ఉన్నాయంటే..

200 కోట్ల వైపు పరుగులు

200 కోట్ల వైపు పరుగులు

బీస్ట్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్లను నమోదు చేసింది. ఈ చిత్రం 200 కోట్ల క్లబ్‌లో చేరేందుకు పరుగులు పెడుతున్నది. తొలి రెండు రోజులకే 100 కోట్ల వసూళ్లను సాధించింది. అదే ఊపును కొనసాగిస్తూ.. మూడో రోజున ఈ చిత్రం 150 కోట్ల క్లబ్‌లో చేరింది. వారాంతంలో ఈ సినిమా 200 కోట్ల వైపు పరుగులు పెట్టే ఛాన్స్ ఉంది.

హిందీ వెర్షన్ ఇలా..

హిందీ వెర్షన్ ఇలా..

బీస్ట్ చిత్రం హిందీ వెర్షన్ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. తొలి రోజున 50 లక్షలు సంపాదించిన ఈ సినిమా రెండో రోజు కలెక్షన్లు దారుణంగా పడిపోయాయి. రెండో రోజున 15 లక్షలు, మూడో రోజున 8 లక్షలు, నాలుగో రోజున 5 లక్షలు సాధించింది. దాంతో ఈ చిత్రం 78 కోట్ల కలెక్షన్లను నమోదు చేసింది.

తమిళనాడులో వసూళ్లు

తమిళనాడులో వసూళ్లు

తమిళనాడులో విజయ్ నటించిన బీస్ట్ చిత్రం భారీ వసూళ్లను నమోదు చేస్తున్నది. విజయ్ కెరీర్‌లో ఎన్నడూ లేని విధంగా చెన్నైలో ఈ చిత్రం కేవలం మూడు రోజుల్లోనే 5 కోట్ల కలెక్షన్లను సొంతం చేసుకొన్నది. మూడో రోజున 1.41 కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం నాలుగో రోజున 1 కోటి రూపాయలపైగానే వరకు రాబట్టింది. దాంతో చెన్నైలో 6 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది. ఇది విజయ్‌కి అభిమానుల్లో ఉన్న క్రేజ్ వల్లే సాధ్యమైంది.

యూఎస్, ఓవర్సీస్‌లో కలెక్షన్లు

యూఎస్, ఓవర్సీస్‌లో కలెక్షన్లు

అమెరికాతోపాటు ఓవర్సీస్‌లో కూడా విజయ్ బీస్ట్ చిత్రం హవా కొనసాగుతున్నది. ప్రీమియర్ల ద్వారా 654,620 డాలర్లు వసూలు చేసిన ఈ చిత్రం తొలి రోజున 144,909 డాలర్లు, రెండో రోజున 101,381 డాలర్లు, మూడో రోజున 153,244 అమెరికన్ డాలర్లు వసూలు చేసింది. ఇక నాలుగో రోజున అంటే శనివారం 135000 అమెరికన్ డాలర్లను వసూలు చేసినట్టు సమాచారం.

దీంతో ఈ చిత్రం మిలియన్ డాలర్ క్లబ్‌లో చేరింది. మొత్తంగా 1,156,158 అమెరికన్ డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీలో 8.82 కోట్ల రూపాయల కలెక్షన్లను నమోదు చేసింది. ఆస్ట్రేలియాలో నాలుగు రోజుల్లో 1.30 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్లను రాబట్టింది.

తెలుగు రాష్ట్రాల్లో వసూళ్లు

తెలుగు రాష్ట్రాల్లో వసూళ్లు

ఇక బీస్ట్ తెలుగు రాష్ట్రాల్లో ప్రభావం చూపలేకపోయింది. మూడు రోజుల్లో 11.55 కోట్ల గ్రాస్, 6.58 కోట్ల షేర్ సాధించింది. నాలుగో రోజు 40 లక్షల రూపాయలను వసూలు చేసింది. దాంతో 12 కోట్ల గ్రాస్ వద్ద ఈ సినిమా నిలిచింది. ఈ సినిమా 10 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. బ్రేక్ ఈవెన్ సాధించాలంటే.. ఇంకా 3.5 కోట్లకుపైగానే సాధించాల్సి ఉంది.

 ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్లు

ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్లు

బీస్ట్ చిత్రం రివ్యూలను ఎదురించి ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్లను నమోదు చేసింది. తొలి రోజున 72.67 కోట్లు రాబట్టింది. అయితే తొలి రోజు కలెక్షన్లను నిలుపుకోలేకపోయింది. రెండో రోజు 24.18 కోట్లు, మూడో 18.54 కోట్లు సాధించింది. దాంతో మూడు రోజుల్లోనే 115 కోట్లకుపైగా కలెక్షన్లను రాబట్టింది. నాలుగో రోజు మరో 20 కోట్లు వసూలు చేసే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X