twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Beast day 5 collections 200 కోట్ల క్లబ్‌లో బీస్ట్.. నెగిటివ్ ట్రెండ్‌లోను విజయ్ విజృంభణ.. లాభాల్లొకి రావాలంటే?

    |

    తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్ నటించిన బీస్ట్ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాన్ని సాధిస్తున్నది. ఈ సినిమాపై సినీ విమర్శకులు పెదవి విరిచినా.. కేవలం విజయ్‌కి తమిళనాడు, ఓవర్సీస్‌లో ఉన్న క్రేజ్ కారణంగా కలెక్షన్ల వర్షం కురుస్తుందనే అభిప్రాయాన్ని ట్రేడ్ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. తమిళనాడులో తొలి వారాంతం తర్వాత కలెక్షన్లు తగ్గినా.. బాక్సాఫీస్ లెక్కల పరంగా ఫర్వాలేదనిపిస్తున్నది. ఈ సినిమా 5వ రోజు కలెక్షన్లు ఎలా ఉన్నాయంటే..

    బీస్ట్‌పై కేజీఎఫ్ ప్రభావం

    బీస్ట్‌పై కేజీఎఫ్ ప్రభావం

    భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన బీస్ట్ చిత్రం తొలి ఆట తర్వాత మిక్స్‌డ్ టాక్‌తో నెగిటివ్ జోన్‌లోకి వెళ్లింది. అంతేకాకుండా KGF 2 చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా భారీ స్పందన రావడంతో ఈ సినిమా వసూళ్లపై భారీగా ప్రభావం పడింది. తమిళనాడులో కూడా బీస్ట్ కంటే.. కేజీఎఫ్2 సినిమాకే ఎక్కువ వసూళ్లు రావడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.

    తెలుగు రాష్ట్రాల్లో

    తెలుగు రాష్ట్రాల్లో

    తెలుగు రాష్ట్రాల్లో బీస్ట్ సినిమా కలెక్షన్ల విషయానికి వస్తే.. ఒకటో రోజున 4.81 కోట్లు, రెండో రోజున 1.10 కోట్లు, మూడో రోజున 67 లక్షలు, నాలుగో రోజున 21 లక్షలు, ఐదో రోజున 15 లక్షలు రాబట్టింది. దాంతో ఈ చిత్రం 6.94 కోట్ల షేర్, 12.40 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

    ప్రపంచవ్యాప్తంగా వసూళ్లు

    ప్రపంచవ్యాప్తంగా వసూళ్లు

    ఇక ప్రపంచవ్యాప్తంగా చూసుకొంటే.. బీస్ట్ చిత్రం తమిళనాడులో 49.50 కోట్ల షేర్, 94.60 కోట్ల గ్రాస్ వసూళ్లను, కర్ణాటకలో 6.10 కోట్ల షేర్ 12.55 కోట్ల గ్రాస్, కేరళలో 4.6 కోట్ల షేర్ 9.8 కోట్ల గ్రాస్, మిగితా రాష్ట్రాల్లో 1.58 షేర్ 3.15 కోట్ల గ్రాస్, ఓవర్సీస్‌లో 25.10 కోట్ల షేర్ 53 కోట్ల గ్రాస్ సాధించింది. దాంతో ఈ చిత్రం 93.82 కోట్ల షేర్, 200 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది.

    విజయ్ 5వ సారి రికార్డు

    విజయ్ 5వ సారి రికార్డు

    విజయ్ కెరీర్‌లో బీస్ట్ చిత్రం అరుదైన రికార్డును సాధించింది. తన కెరీర్‌లో 200 కోట్ల క్లబ్‌లో చేరిన ఐదో చిత్రంగా బీస్ట్ ఘనతను సొంతం చేసుకొన్నది. గతంలో మెర్సల్ చిత్రం 12 రోజుల్లో ఈ ఘనతను సాధిస్తే.. సర్కార్ చిత్రం 6 రోజుల్లో, బిగిల్ చిత్రం 5 రోజుల్లో, మాస్టర్ చిత్రం 8 రోజుల్లో.. బీస్ట్ మూవీ కేవలం 5 రోజుల్లోనే 200 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది.

    Recommended Video

    KAKA TALKS: Frustrated Fans Over Beast Result నెల్సన్.. ది విలన్ | EP - 01 | Filmibeat Telugu
    లాభాల్లోకి రావాలంటే ఇంకెంత...

    లాభాల్లోకి రావాలంటే ఇంకెంత...

    ఇక బీస్ట్ సినిమా విషయానికి వస్తే.. విజయ్ మూవీ భారీగానే ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం 125.50 కోట్ల మేర బిజినెస్ చేసినట్టు ట్రేడ్ వర్గాలు స్పష్టం చేశాయి. అయితే ఈ సినిమా 127 కోట్ల బ్రేక్ ఈవెన్‌తో కలెక్షన్ల యాత్రను ప్రారంభించింది. అంటే ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే.. ఇంకా 25 కోట్లకుపైగా షేర్, 40 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను సాధించాల్సి ఉంటుంది. త్వరలోనే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశం ఉంది.

    English summary
    Vijay's Beast movie is doing good at box office inspite of negative reviews. It collected 200 crore gross collections in 4 days.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X