Bedurulanka 2012 Collections బెదురులంక 2012 మూవీకి డీసెంట్ ఓపెనింగ్స్.. ఎన్ని కోట్ల కలెక్షన్లు అంటే?
యువ హీరో, హీరోయిన్లు కార్తికేయ గుమ్మకొండ, నేహా శెట్టి జంటగా నటించిన చిత్రం బెదురులంక 2012. నూతన దర్శకుడు క్లాక్స్ డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమాను బెన్నీ నిర్మించారు. టీజర్లు, సినిమా ట్రైలర్, పాటలకు, ప్రోమోలో డైలాగ్స్‌కు మంచి రెస్సాన్స్ రావడంతో ఈ సినిమాపై క్రేజ్ పెరిగింది. యుగాంతం కాబోతుందనే పాయింట్‌తో రూపొందిన ఈ సినిమా ఆగస్టు 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా బడ్జెట్, ప్రీ రిలీజ్ బిజనెస్, కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
RX100 మూవీతో క్రేజీ హీరోగా పేరు తెచ్చుకొన్న కార్తికేయ, డీజే టిల్లు మూవీతో పాపులారిటి సాధించిన నేహా శెట్టి కాంబినేషన్‌లో వచ్చిన ఈ చిత్రాన్ని 10 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఈ సినిమాకు మంచి క్రేజ్ ఏర్పడంతో భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

బెదుురులంక మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాల్లోకి వెళితే.. నైజాం, ఆంధ్రాలో భారీగా బిజినెస్ జరిగింది. నైజాంలో ఈ సినిమా 85 లక్షల రూపాయలు9, సీడెడ్‌లో 65 లక్షల రూపాయలు, ఆంధ్రాలో 1.75 కోట్ల రూపాయలు మేర బిజినెస్ జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో సుమారుగా 3.25 లక్షల రూపాయల బిజినెస్ నమోదైంది. కర్ణాటక, ఇతర రాష్ట్రాలు, ఓవర్సీస్‌లో కలిపి 85 లక్షల రూపాయల బిజినెస్ జరిగింది. దాంతో ప్రపంచవ్యాప్తంగా మొత్తంగా 4.10 కోట్ల రూపాయలు బిజినెస్ నమోదైంది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ లక్ష్యాన్ని 4.50 కోట్లుగా నిర్ణయించారు.
బెదురులంక సినిమా రిలీజ్‌కు సంబంధించి స్క్రీన్ కౌంట్ విషయానికి వస్తే.. నైజాంలో 95 స్క్రీన్లలో, సీడెడ్‌లో 40 స్క్రీన్లు, ఆంధ్రాలో 130 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. ఏపీ, తెలంగాణలో మొత్తంగా 270 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో, ఓవర్సీస్‌లో 250 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను 500 కిపైగా స్క్రీన్లలో విడుదల చేశారు.
బెదురులంక సినిమా ఆక్యుపెన్సీ వివరాల్లోకి వెళితే.. తొలి రోజు ఉదయం ఆటకు 25 శాతం, మధ్యాహ్నం ఆటకు 35 శాతం, ఫస్ట్ షోకు 40 శాతం, సెకండ్ షోకు 40 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. హైదరాబాద్‌లో 35 శాతం, గుంటూరులో 25 శాతం, కాకినాడలో 41 శాతం, కరీంనగర్‌లో 35 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది.
బెదురులంక సినిమా తొలి రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం 70 లక్షల రూపాయలు, కర్ణాటక, ఇతర ప్రాంతాల్లో కలిపి 30 లక్షలు, ఓవర్సీస్‌లో సుమారుగా 50 లక్షల రూపాయల కలెక్షన్లు రాబట్టే అవకాశం ఉంది. దాంతో ఈ చిత్రం తొలి రోజు 1.5 కోట్ల రూపాయలకుపైగా కలెక్షన్లను బాక్సాఫీస్ వద్ద నమోదు చేసే ఛాన్స్ కనిపిస్తున్నది.


Click it and Unblock the Notifications











