రిలీజ్ కు ముందే 750 కోట్ల లాభం.. రజినీకాంత్ ‘కూలి’ రికార్డు
సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం భారీ బడ్జెట్ తో తమిళ చిత్ర పరిశ్రమలో రూపుదిద్దుకుంటున్న కూలీ చిత్రంలో నటిస్తున్నారు. ఖైదీ, విక్రమ్, లియో వంటి బ్లాక్ బస్టర్ సినిమాలను నిర్మించడమే కాకుండా, సినిమాటిక్ యూనివర్స్ ను క్రియేట్ చేసిన లోకేష్ కనగరాజ్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. షూటింగ్ ఆల్మోస్ట్ పూర్తి కావచ్చింది. ఇప్పటికే రజనీకాంత్ కూడా తన షూటింగ్ పార్ట్ ను ముగించేశారు. బ్యాలెన్స్ షూటింగ్ పార్ట్ ను లోకేష్ కనగరాజ్ త్వరగా పూర్తి చేసే పనిలో నిమగ్నం అయ్యి ఉన్నారు.
ఇక రజనీకాంత్ చివరి మూవీ జైలర్ ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన ఆ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద 750 కోట్లకు పైగా గ్రాస్ ను కలెక్ట్ చేసింది. ఈ క్రమంలో రజనీకాంత్ నుంచి ఇక వెంటనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ కూలీ చిత్రం పై అత్యంత భారీ అంచనాలు నెలకొన్నాయి. మరోవైపు లోకేష్ కనకరాజు కూడా తన సినిమాటిక్ యూనివర్స్ తో ఇండియన్ షేక్ చేయడం మూలంగానూ కూలి సినిమాపై మరింత హైప్ నెలకొంది.

రజనీకాంత్, లోకేష్ కనకరాజ్ వంటి భారీ కాంబినేషన్లో కూలి సినిమా రూపుదిద్దుకుంటుండగా ఈ చిత్రానికి మార్కెట్లో భారీ డిమాండ్ పెరిగింది. 250 నుంచి 400 కోట్ల మధ్యలో ఈ సినిమా బడ్జెట్ ఉండడం విశేషం. ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ సన్ పిక్చర్స్ బ్యానర్లో భారీ స్కేల్లో ఈ చిత్రం రూపుదిద్దుకుంటుంది. అంతేకాదు భారీ తారాగణం కూడా కూలి సినిమాలో నటిస్తుండటం సినిమా మార్కెట్ పై అంచనాలను పెంచేసింది. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ రికార్డును కొల్లగొడుతుందంటూ ట్రేడ్ వర్గాలు ఇప్పుడే అంచనా వేస్తున్నాయి.
ఈ లోగా కూలీ చిత్రానికి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. 250 కోట్లకు పైగా బడ్జెట్ తో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం రిలీజ్ కి ముందే 750 కోట్లు లాభాన్ని తెచ్చిపెట్టిందని ఆ వార్త సారాంశం. భారీ అంచనాలు నెలకొని ఉండడంతో నాన్ థియెట్రికల్, థియేట్రికల్ రైట్స్, శాటిలైట్, డిజిటల్, ఇతర రైట్స్ ద్వారా 750 కోట్ల రూపాయల లాభం వచ్చిందని తెలుస్తోంది. ఇక ఇప్పుడే ఈ సినిమా ఈ రేంజ్ లో వసూళ్ల వేట మొదలుపెట్టిందంటే... థియేటర్లో రిలీజ్ అయ్యాక బాక్సాఫీస్ షేక్ కావడం ఖాయం అని అంటున్నారు.
యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి కళానిధి మారన్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. ఖర్చు విషయంలో ఎక్కడా దగ్గర లేదని తెలుస్తోంది. ఇక ఈ చిత్రంలో కింగ్, అక్కినేని నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్ కీలకపాత్రలో నటిస్తున్నారు. కమల్ హాసన్ కూతురు, స్టార్ హీరోయిన్ శృతిహాసన్ ఫిమేల్ లో నటిస్తోంది. టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్ర సంగీతం అందిస్తున్నారు. 2025 లోని ఈ చిత్రం విడుదల కానుంది. కానీ పక్కా రిలీజ్ డేట్ ను మాత్రం మేకర్స్ ఇంకా అనౌన్స్ చేయాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











