సిటీల్లో సీన్ లేని 'బెజవాడ' (ట్రేడ్ టాక్)
రామ్ గోపాల్ వర్మ తాజా చిత్రం బెజవాడకు సిటీల్లో అంత క్రేజ్ కనపటడం లేదు. ముఖ్యంగా మల్టి ఫ్లెక్స్ లలో ఓ పెద్ద హీరో సినిమాకు వచ్చినట్లు ఓపినింగ్స్ కాకపోయినా బుక్కింగ్స్ కూడా రాకపోవటం ట్రేడ్ వర్గాలని ఆశ్చర్యపరిచింది. గతంలో రక్త చరిత్రకు ఓ వారం ముందు నుంచే బుక్కింగ్స్ ప్రారంభమయ్యాయి. అయితే దానికి కారణం..పోస్టర్స్, ట్రైలర్స్, వాటిని డిజైన్ చేసి వదిలిన ప్యాకేజ్ విధానం అంటున్నారు. అంతేగాక రామ్ గోపాల్ వర్మ దర్శకుడు కాకపోవటం, వివేక్ కృష్ణ కొత్త దర్శకుడు కావటం కూడా ప్రారంభ వసూళ్లపై ప్రభావం చూపిస్తాయని,అంతకు మించి నాగచైతన్య గత చిత్రం దడ యాక్షన్ ఎంటర్టైనర్ కావటం, అది భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ కావటం కూడా సినిమాకు ఓపినింగ్స్ కు మైనస్ గా మారింది. ఇక ఈ చిత్రానికి బి,సి సెంటర్లలో ఓ రేంజి కలెక్షన్స్ ఉంటాయని భావిస్తున్నారు.
పాజిటివ్ టాక్ వస్తే సిటీల్లోనూ కలెక్షన్స్ పుంజుకుంటాయి. ఇక ఈ చిత్రంలో నాగచైతన్య సరసన అమలా పౌల్ హీరోయిన్ గా చేస్తోంది. నాగచైతన్య శివకృష్ణ అనే స్టూడెంట్ గా కనపడతాడు. తను పుట్టి పెరిగిన బెజవాడ కోసం ఎంతకైనా తెగించే యువకుడుగా ఈ పాత్రను డిజైన్ చేసారు. దర్శకుడు వివేక్ కృష్ణ మాట్లాడుతూ ..యాక్షన్, భావోద్వేగాలు మిళితమైన చిత్రమిది. నాగచైతన్య నటన ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ఒక మాస్ ఇమేజ్ ఉన్న కథానాయకుడిగా తను తెరపై కనిపించే తీరు అందరికీ నచ్చుతుంది. చైతన్య-అమలాపాల్ మధ్య వచ్చే ప్రణయ సన్నివేశాలు యువతరాన్ని మెప్పించేలా ఉంటాయి. బెజవాడ నేపథ్యం ఒక కీలక పాత్రలా చిత్రానికి ఉపయోగపడిందని అన్నారు.


Click it and Unblock the Notifications











