Swathi Muthyam Pre Release Bussiness: పెద్ద సినిమాలతో బెల్లంకొండ గణేష్ పోటీ.. బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఇదే!

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ప్రముఖ నిర్మాతగా డిస్ట్రిబ్యూటర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న నిర్మాత సురేష్ బాబు తనయులు ఇద్దరు కూడా హీరోలుగా మారిన విషయం తెలిసిందే. ఇప్పటికే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తెలుగులో కమర్షియల్ సినిమాలతో గుర్తింపు సాధించాడు. ఇప్పుడు హిందీలో చత్రపతి రీమేక్ తో సిద్ధమవుతున్నాడు. ఇక తెలుగులో అతని సోదరుడు బెల్లంకొండ గణేష్ బాబు కూడా హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమయ్యాడు.

అతని మొదటి సినిమా స్వాతిముత్యం అక్టోబర్ 5వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. పోటీగా మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ అలాగే నాగార్జున ది ఘోస్ట్ సినిమా ఉన్నప్పటికీ కూడా ఈ సినిమా ఎంతో నమ్మకంతో థియేటర్లోకి వస్తుంది. తప్పకుండా సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ కు నచ్చుతుంది అని డిఫరెంట్ కంటెంట్ తోనే ప్రేక్షకులను ఆకట్టుకుపోతున్నట్లుగా చిత్ర యూనిట్ ప్రమోషన్లు తెలియజేసింది.

Bellamkonda ganesh babu Swathi Muthyam movie Pre Release Bussiness

స్వాతిముత్యం సినిమాకు సంబంధించిన బిజినెస్ లెక్కలు ఏ విధంగా ఉన్నాయి అనే వివరాల్లోకి వెళితే బెల్లంకొండ గణేష్ కు ఇది మొదటి సినిమా కావడంతో మార్కెట్లో అయితే పెద్దగా వల్యూ పెరగలేదు. ఇక విడుదలైన ట్రైలర్ ద్వారా కొంత పాజిటివ్ హైప్ రావడం వలన బాక్సాఫీస్ వద్ద టాక్ ను బట్టి కలెక్షన్స్ అందుకునే అవకాశం ఉంటుంది. ఇక ఈ సినిమా వరల్డ్ వైడ్ గా థియేట్రికల్ రైట్స్ 3.7 కోట్లకు అమ్ముడైనట్లు సమాచారం.

స్వాతిముత్యం బాక్సాఫీస్ వద్ద సక్సెస్ కావాలి అంటే నాలుగు కోట్లు షేర్ కలెక్షన్స్ అందుకోవాల్సి ఉంటుంది. సినిమా అయితే తప్పకుండా ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంటుంది అని హీరో గణేష్ కూడా ఇంటర్వ్యూలలో చాలా నమ్మకంతో తెలియజేశాడు. ట్రైలర్ అయితే బాగానే ఉంది కానీ సాంగ్స్ కు మాత్రం పెద్దగా హైప్ క్రియేట్ చేయలేదు. సినిమా చూసిన తర్వాత సాంగ్స్ తప్పకుండా నచ్చుతాయని కూడా చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. ఇక ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ పై నాగ వంశీ నిర్మానించగా కొత్త దర్శకుడు లక్ష్మణ్ దర్శకత్వం వహించాడు. ఇక హీరోయిన్గా వర్ష భోల్లమ్మ నటించగా మరొక ముఖ్యమైన పాత్రలో వెన్నెల కిషోర్ అలాగే మరి కొంతమంది సీనియర్ నటీనటులు ఈ సినిమాలో కనిపించబోతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X