బెల్లంకొండ గ్యాంబ్లంగ్ కలిసిరాలేదు (ట్రేడ్‌టాక్)
తమిళంలో పెద్ద హిట్టైందంటూ హంగామా చేసి విడుదల చేసిన గ్లాంబ్లర్ తెలుగులో డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ప్రతీసారి గ్లాంబ్లింగ్ కలిసిరాదని బెల్లంకొండకు బుద్ది చెప్పినట్లైందంటున్నారు. పోటీపడి మరీ ఎక్కువ రేటు పెట్టి కొన్న ఈ చిత్రం ధియోటర్ రెంట్ లు కూడా చాలా చోట్ల తెచ్చుకోలేకపోతోంది. ఇక గత మూడు వారాలుగా థియేటర్లన్నీ కొత్త కొత్త సినిమాలతో నిండిపోయాయి. అయితే జనంతో నిండుతున్నాయా.. లేదా అంటే మాత్రం కాస్తా అనుమానమే. డబ్బింగ్ సినిమాల ఊపులో వచ్చిన గ్యాంబ్లర్ పెద్దగా గొప్ప టాక్ తెచ్చుకోలేదు. చిన్న సినిమాలుగా వచ్చిన 'నేను నాన్న అబద్ధం", 'ఆకాశమంత" ఈ వారమే థియేటర్లకు వచ్చాయి కానీ, ఏవరేజ్ టాక్‌ను కూడా సొంతం చేసుకోలేకపోయాయి.
ఈ వారం కూడా మరో అరడజను రిలీజుకు దగ్గరగా వున్నాయి. ఆపై దసరా సినిమాల జోరు ప్రారంభమవుతుంది. దూకుడు, ఊసరవిల్లి చిత్రాలు పోటీలో ఉన్నాయి. ఈ రెండింటిపైనే ధియోటర్స్ ఆశలు పెట్టుకున్నాయి. ఊసరవిల్లి చిత్రం ఆడియో నిన్న( గురువారం) రాత్రి విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. మరో ప్రక్క దూకుడు పై రోజు రోజుకీ ఎక్సపెక్టేషన్స్ పెరిగిపోతున్నాయి.


Click it and Unblock the Notifications











