ఆ ఒక్కటే నిలబడింది(ట్రేడ్ టాక్)
క్రితం వారం జయీభవ, బంపర్ ఆఫర్, అద్బుత వైద్య-ఆయుర్వేదం అనే మూడు చిత్రాలు భాక్సాఫీస్ ని పలకరించాయి. ఈ మూడింటిలో బంపర్ ఆఫర్ ఫరవాలేదనిపించుకుంటే..మిగిలిన రెండూ అయ్యో పాపం అనిపించుకునే స్ధితిలో ఉన్నాయి. అయితే ఓపినింగ్స్ లో మాత్రం జయీభవ ముందుంది. బంపర్ ఆఫర్ కి పూరీ పేరు పెద్దది పోస్టర్స్ పై వేయటం, రమణమ్మ పాట హిట్టవటం ప్లస్ అయ్యాయి. ఇక ఆయుర్వేదం చిత్రం రిలీజ్ అయినట్లే చాలా మందికి తెలియదు. తెలసినవారు అటువైపు వెళ్ళకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అదిలా ఉంటే అంతకుముందువారం రిలీజైన బెండు అప్పారావు మెల్లిగా ఊపు అందుకున్నాడు. ఈ పెద్ద సినిమాల కన్నా ఆ చిన్న సినిమానే కాస్సెపు నవ్విస్తోందని అటు వైపు ఫ్యామిలీలు అడుగులు వేస్తున్నారు. ఇక ఘటికుడు,జగన్మోహిని చిత్రాలు పూర్తి స్ధాయి ప్లాఫ్ టాక్ తెచ్చుకుని పరారయ్యాయి.గురువారం రిలీజైన ఏక్ నిరంజన్ మాత్రం మార్నింగ్ షోకే ఫెయిల్యూర్ టాక్ తెచ్చుకుంది.


Click it and Unblock the Notifications











