అబ్బో బంగార్రాజు బాగానే ఆడుతున్నాడు!
ఇటీవలే విడుదలైన అల్లరి నరేష్ తాజా చిత్రం 'బెట్టింగ్ బంగార్రాజు" ఏ, బి సెంటర్లలో నిలకడగా ఆడుతోంది. 'బ్లేడ్ బాబ్జీ", 'బెండు అప్పారావు" చిత్రాల తరువాత ఇప్పుడు 'బెట్టింగ్ బంగార్రాజు". ఇలా సినిమా సినిమాకి వైవిధ్యాన్నిప్రదర్శిస్తూ, తన కామెడీకి పదును పెంచుకుంటూ మున్ముందుకి దూసుకుపొతున్నాడు 'అల్లరి" నరేష్. తక్కువ బడ్జెట్ తో తీసిన 'బెట్టింగ్ బంగార్రాజు" మొదటి వారంలో 1.29 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ సినిమా ఆడుతున్న ఏ చోట కూడా కలెక్షన్లు తగ్గిన దాఖలాలు లేకపోవడంతో, రెండవ వారంలో కూడా ఇలానే స్థిరంగా ఈ చిత్రం లాభాలను ఆర్జిస్తుందని నిర్మాతలు నమ్ముతున్నారు. అంతే కాదు ఈ చిత్రం ఉషాకిరణ్ మూవీస్ లో బిగ్ హిట్ చిత్రమౌతుందని దర్శక నిర్మాతలు అభిప్రాయం.
సినిమా ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ఉషాకిరణ్ బ్యానర్ లో చాలా రోజుల తర్వాత మంచి ప్రాఫిట్ ను అందించబోతున్న చిత్రం 'బెట్టింగ్ బంగార్రాజు" అంటున్నారు. పబ్లిసిటీ అంత బలంగా లేకపోయినప్పటికీ విడుదలైన రోజు(ఏప్రిల్ 9) నుండి ఇప్పటి వరకూ 'బెట్టింగ్ బంగార్రాజు" బాగానే కలెక్షన్ల వర్షం కురిపించుకుంటూ ఈ చిత్ర నిర్మాతలకి లాభాలను తెచ్చిపెడుతున్నాడు. ఈచిత్రానికి 2.6 కోట్లు బడ్జెట్ పెట్టగా 35 ప్రిట్స్ తో మాత్రమే చిత్రం విడుదలైనది. అంతే కాకుండా శేఖర్ చంద్ర మంచి లిరిక్స్ అందించడమే ఈ చిత్రానికి హైలెట్ గా నిలిచాయి. ఈ చిత్ర దర్శకుడు ఇ. సత్తిబాబుకి 'బెట్టింగ్ బంగార్రాజు" తెలుగు చిత్ర సీమలో ఒక రకంగా పునర్జన్మ లాంటిదే అని సినిమా ఇండస్ట్రీలో టాక్


Click it and Unblock the Notifications











