'బెజవాడ'రైట్స్ అంత తక్కువకి ఇచ్చారా?
నాగచైతన్య,రామ్ గోపాల్ వర్మ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం బెజవాడ.ఈ నెల ఇరవై మూడవ తేదీన విడుదల అవుతున్న ఆ చిత్రం పూర్తి కర్ణాటక రైట్స్ ని కేవలం ఎనభై లక్షలకే ఇచ్చిసినట్లు సమాచారం.బెంగుళూరు కి చెందిన వెంకటాద్రి ఫిల్మ్ వారు వాటిని చేజిక్కించుకున్నారు.నాగచైతన్,రామ్ గోపాల్ వర్మ వంటి పెద్ద పేర్లు ఉన్నా అంత తక్కువ పలకటం ట్రేడ్ లో టాక్ గా మారింది.అయితే కేవలం బెంగుళూరు,బళ్లారి వంటి తెలుగువారు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మాత్రమే ఆడే అవకాశం ఉంది కాబట్టి అంత తక్కువ పలికిందని కొందరు విశ్లేషిస్తున్నారు.ఇక బెజవాడ విషయానికి వస్తే...'దుర్మార్గులను అంతం చేయాడానికి ఒక్కోసారి దుర్మార్గుడిలా మారాల్సిన పరిస్థితి వస్తుంది. తను పుట్టి పెరిగిన 'బెజవాడ' జోలికొస్తే ఎంతటివారినైనా ఎదిరించేందుకు సిద్ధమైన యువకుడి కథ 'బెజవాడ'. ఆ యువకుడుగా నాగచైతన్య కనిపిస్తారు.అలాగే ఎవరైనా సరే పుడుతూనే కత్తి పట్టుకొని పగతో రగిలిపోరు. పరిస్థితులే వాళ్లలో కక్షల్నీ, కార్పణ్యాల్నీ పెంచుతాయి. మా కథలోని యువకుడు ఏ కారణాలతో రౌడీగా మారాల్సి వచ్చింది. అతని లక్ష్యం ఏమిటి అన్నది తెర మీదే చూడాలి నాగచైతన్య నటన తప్పకుండా మాస్ ప్రేక్షకులకు నచ్చుతుందన్నారు దర్శకుడు వివేక్‌కృష్ణ. ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'బెజవాడ'. నాగచైతన్య, అమలాపాల్ జంటగా నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











