Bha. Bha. Ba Day 2 Collections: భారీ నెగిటివిటీలో భ.భ.బ చిత్రం.... దిలీప్ మూవీకి 2వ రోజు ఎన్ని కోట్లంటే?

మలయాళ అగ్రనటుడు దిలీప్ నటించిన లేటెస్ట్ మూవీ భ. భ. బ (భయం, భక్తి, బహుమానం). ధనంజయ్ శంకర్ దర్శకత్వం వహించారు. శ్రీ గోకులం మూవీస్ బ్యానర్‌పై గోకులం గోపాలన్, కృష్ణమూర్తి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ ఈ సినిమాలో గెస్ట్ రోల్ పోషించారు. వినీత్ శ్రీనివాసన్, ధ్యాన్ శ్రీనివాసన్, సాండీ, బాలు వర్గీస్, బైజు సంతోష్, శరణ్య, సిద్ధార్ధ్, అశోకన్ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. ఆర్మో సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించగా.. రంజన్ అబ్రహం ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. షాన్ రహమాన్ స్వరాలు సమకూర్చగా.. గోపీ సుందర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించారు.

మలయాళ నటిపై అత్యాచారం, వేధింపులు, కిడ్నాప్ కేసు ఘటనలో దిలీప్‌ను నిర్దోషిగా ప్రకటిస్తూ కోర్టు తీర్పు వెలువరించిన తరుణంలో దిలీప్‌పై పెద్ద ఎత్తున వ్యతిరేకత చోటు చేసుకుంది. అలాగే మోహన్‌లాల్‌ ఈ సినిమాలో గెస్ట్ రోల్ పోషించడంతో ఆయనపైనా కేరళలో మహిళ సంఘాల నుంచి దారుణంగా ట్రోలింగ్ జరుగుతోంది. అలాంటి తరుణంలో విడుదలైన భ.భ.బ మూవీపై మలయాళ చిత్ర పరిశ్రమలో భారీ హైప్ క్రియేట్ అయ్యింది. ఈ దశలో డిసెంబర్ 18న దిలీప్ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో భ.భ.బ మూవీ బడ్జెట్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? రెండో రోజు ఎన్ని కోట్లు వసూలు చేసింది? ఈ వివరాల్లోకి వెళితే..

Bha Bha Ba Day 2 expected Box Office Collections Worldwide Dileep s Movie facing tough fight

భ. భ. బ బడ్జెట్ ఎంత?
నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికం, ప్రొడక్షన్ కాస్ట్, పబ్లిసిటీ ఖర్చులు కలిపి భ.భ.బ మూవీకి దాదాపుగా 40 కోట్ల రూపాయల బడ్జెట్ అయ్యింది. త్రివేండ్రం, కొచ్చితో పాటు కేరళలోని అందమైన లోకేషన్స్‌‌లో దిలీప్ మూవీ చిత్రీకరణ జరుపుకుంది. భ.భ.బ మూవీపై ఉన్న అంచనాల నేపథ్యలో ఈ సినిమాకు మంచి ప్రీ రిలీజ్ జరిగినట్లుగా మాలీవుడ్ టాక్. భ.భ.బ చిత్రం లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద 41 కోట్ల రూపాయల షేర్.. 82 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉందని ట్రేడ్ పండితులు వాల్యూ నిర్దేశించారు.

భ.భ.బ తొలి రోజు కలెక్షన్స్
దిలీప్‌పై భారీ వ్యతిరేకత ఉన్న సమయంలో విడుదలైన భ.భ.బ మూవీ తొలి రోజున ఇండియాలో 6.7 కోట్ల రూపాయల నెట్.. 7.9 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది. ఇక ఓవర్సీస్‌లో మలయాళ చిత్రాలకు ఉన్న ఆదరణ నేపథ్యంలో దిలీప్ మూవీకి అక్కడ తొలిరోజు భారత్‌తో సమానంగా కలెక్షన్స్ వచ్చాయి. భ.భ.బ మూవీకి ఫస్ట్ డే నార్త్ అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూకే, గల్ఫ్, మిడిల్ ఈస్ట్ తదితర దేశాలతో కలిపి ఈ సినిమాకు ఓవర్సీస్‌లో 7.1 కోట్ల రూపాయలు వసూలైంది. దాంతో ఇండియాలో వచ్చిన గ్రాస్ + ఓవర్సీస్ వసూళ్లు కలిపి భ.భ.బ మూవీ తొలిరోజున 15 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టింది.

భ.భ.బ రెండో రోజు కలెక్షన్స్
రెండో రోజు భ.భ.బ మూవీ వసూళ్లు చూస్తే.. వరల్డ్ వైడ్‌గా అవతార్ 3: ఫైర్ అండ్ యాష్ రూపంలో భారీ పోటీ ఎదురైంది. అలాగే మలయాళం, హిందీలో కొన్ని చిత్రాల విడుదల నేపథ్యంలో దిలీప్ మూవీ బుకింగ్స్‌పై గట్టి దెబ్బ పడింది. 2వ రోజు సాయంత్రం 5 గంటల వరకు భ.భ.బ మూవీకి 26 శాతం థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైనట్లు సాక్‌నిక్ తెలిపింది. కడపటి వార్తలు అందేసరికి ఇండియాలో భ.భ.బ మూవీకి రెండో రోజు ఇప్పటి వరకు 94 లక్షల రూపాయల నికర వసూళ్లు వచ్చాయి. దిలీప్ మూవీ రెండో రోజున మలయాళంలో 4 కోట్ల రూపాయలు, రెస్టాఫ్ ఇండియాలో 25 లక్షల రూపాయలు, ఓవర్సీస్‌లో 2 కోట్ల రూపాయలు చొప్పున వరల్డ్ వైడ్‌గా 7 కోట్ల రూపాయలు రాబడుతుందని అంచనా వేస్తున్నారు. దాంతో రెండ్రోజుల్లో భ.భ.బ మూవీకి 22 కోట్ల రూపాయలు వస్తాయని భావిస్తున్నారు.

More from Filmibeat

Read more about: box office report dileep
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X