Bhaag Saale Collections భాగ్ సాలే బాక్సాఫీస్ రిపోర్టు.. శ్రీ సింహా మూవీ పరిస్థితి ఏమిటంటే?
బిగ్ బెన్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాతలు అర్జున్ దాస్యన్, యష్ రంగినేని, శింగనమల కల్యాణ్ నిర్మించిన చిత్రం Sri Simha Koduri. శ్రీ సింహా కోడూరి, నేహా సోలంకి, రాజీవ్ కనకాల, సత్య, జాన్ విజయ్, హర్ష చెముడు, నందినీ రాయ్, వర్షిణి సౌందర్‌రాజన్ తదితరులు నటించిన చిత్రానికి తొలి చిత్ర దర్శకుడిగా ప్రణీత్ బ్రహ్మండపల్లి పరిచయం అయ్యారు. ఈ సినిమా జూలై 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా తొలి రోజు ఏ రేంజ్ కలెక్షన్లు సాధించిందనే వివరాల్లోకి వెళితే..
క్రైమ్ కామెడీ చిత్రంగా రూపొందిన Sri Simha Koduri సినిమాను భారీ తారాగణంతో నిర్మించారు. ఈ సినిమా అవుట్‌పుట్ చూస్తే రాజీ పడుకుండా సినిమాను రిచ్‌గా కమర్షియల్ హంగులతో రూపొందించారనే విషయం స్పష్టమైంది. ఈ సినిమాను సుమారు 10 కోట్ల రూపాయలతో భారీగా రూపొందించారు.

Sri Simha Koduri సినిమా టీజర్లు, ట్రైలర్లు ప్రమోషన్ ఈవెంట్స్‌కు భారీగా క్రేజ్ కనిపించింది. శ్రీ సింహా బాడీ లాంగ్వేజ్, కాలబైరవ మ్యూజిక్ విడుదల ముందు ఆసక్తిని రేపాయి. దాంతో ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ కనిపించడంతో సుమారు 500 స్క్రీన్లకుపైగా రిలీజ్ చేశారు. ఈ సినిమాకు ఓపెనింగ్స్ కూడా ఓ మోస్తారుగా నమోదు అయ్యాయి.
Sri Simha Koduri సినిమా ఆక్యుపెన్సీ వివరాల్లోకి వెళితే.. ఏపీ, తెలంగాణలో తొలి రోజు యావరేజ్‌గా కనిపించాయి. సినిమాపై మిక్స్‌డ్ రెస్పాన్స్ రావడంతో తొలి రోజు కలెక్షన్లపై ఆక్యుపెన్సీపై ప్రభావం పడిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమా తొలి రోజు ఓవరాల్‌గా 25 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది.
ఇక Sri Simha Koduri సినిమా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తొలి రోజు శ్రీ సింహా కెరీర్‌లో బెస్ట్ ఓపెనింగ్స్ నమోదు అయినట్టు ట్రేడ్ వర్గాల సమాచారం. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకు తొలి రోజు 70 నుంచి 80 లక్షల గ్రాస్ వసూళ్లు రాబట్టే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఓవర్సీస్‌లో ఈ సినిమా ఎంత వసూలు చేస్తుందనే విషయాన్ని బట్టి ఫైనల్ కలెక్షన్లు ఉంటాయని పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











