‘భాగమతి’ కలెక్షన్లు చూసి ట్రేడ్ వర్గాలు పరేషాన్...రెండ్రోజుల్లో ఎంతంటే?

By Bojja Kumar

Recommended Video

భాగమతి కలెక్షన్లు చూసి పరేషాన్, హీరోలకు ఏమాత్రం తీసిపోలేదు

హీరోల ఆధిపత్యం నడిచే సౌత్ చిత్ర పరిశ్రమలో ఒక హీరోయిన్ సినిమాల పరంగా, కలెక్షన్స్ పరంగా వారి రేంజిని అందుకోవడం చాలా అరుదు. ఇన్నేళ్ల పరిశ్రమ చరిత్రను తిరగేసినా ఇలాంటి వారి సంఖ్య చాలా తక్కువ. ఈ తరంలో అలాంటి అతితక్కువ మందిలో ప్రముఖంగా చెప్పుకోవాల్సిన పేరు అనుష్క శెట్టి. ప్రస్తుతం అనుష్క నటించిన 'భాగమతి' చిత్రం బాక్సాఫీసు వద్ద పెద్ద పెద్ద స్టార్ హీరోల సినిమాలకు ఏ మాత్రం తీసిపోకుండా వసూళ్ల వర్షం కురిపిస్తోంది.

 భాగమతి

భాగమతి

భాగమతి చిత్రం జనవరి 26న విడుదలైన సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. బాక్సాఫీసు వద్ద ఎవరూ ఊహించని వసూళ్లు సాధిస్తూ దూసుకెలుతోంది. ఈ చిత్రం కేవలం రెండు రోజుల్లోనే రూ. 25 కోట్ల మార్కును అందుకుంది.

 ట్రేడ్ వర్గాలు పరేషాన్

ట్రేడ్ వర్గాలు పరేషాన్

తెలుగు సినిమాల విషయంలో తొలి రోజు రూ. 10 కోట్లు వసూలు చేయడం అంటే ఓ రేంజి స్టార్ హీరోకే సాధ్యం. అయితే అనుష్క నటించిన ‘భాగమతి' చిత్రం తొలి రోజు రూ. 12 కోట్లు వసూలు చేయడంతో ట్రేడ్ వర్గాలు పరేషాన్ అవుతున్నాయి.

యూఎస్ఏలోనూ క్రేజ్

యూఎస్ఏలోనూ క్రేజ్

ప్రవాసులు ఎక్కువగా ఉండే అమెరికా లాంటి దేశాల్లో క్రేజ్ సంపాదించుకోవడం అంటే అంత సులభం కాదు. ఇండస్ట్రీలో కొన్నేళ్లుగా స్టార్ హీరోలుగా కొనసాగుతున్న వారికే అక్కడి మార్కెట్‌ను క్యాచ్ చేయడం సాధ్యం కాలేదు. కానీ చాలా మంది స్టార్ హీరోలకు సాధ్యం కాని క్రేజ్ అనుష్క సొంతం చేసుకుంది.

యూఎస్ఏ వసూళ్లు

యూఎస్ఏ వసూళ్లు

అమెరికాలో ‘భాగమతి' చిత్రం తొలి రోజున 1,56,538 డాలర్లను వసూలు చేసింది. ప్రస్తుతం అమెరికాలో పోటీలో ఇతర సినమాలు ఏమీ లేక పోవడం కూడా ఈ చిత్రానికి కలిసొచ్చే అవకాశం ఉంది. ఫుల్ రన్ లో ఈచిత్రం 1 మిలియన్ మార్కును అందుకుంటుందని అంచనా వేస్తున్నారు.

రెస్పాన్స్ అదుర్స్

రెస్పాన్స్ అదుర్స్

ఈ చిత్రంలో కలెక్టర్ చంచలగా, భాగమతిగా రెండు షేడ్స్ ఉన్న పాత్రలను అనుష్క పోషించింది. పొలిటికల్ బ్యాక్ డ్రాప్, హారర్ మిక్స్ చేసి దర్శకుడు అశోక్ సినిమాను బాగా తీశాడు. యూవి క్రియేషన్స్ వారి నిర్మాణ విలువలు సూపర్బ్. ప్రేక్షకుల నుండి ఈ చిత్రానికి మంచి స్పందన వస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X