Don't Miss!
- News త్వరలో గురు-శుక్ర సంయోగం.. ఈ రాశులవారికి పట్టిందల్లా బంగారం
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
'భాగమతి' ఫస్ట్ డే కలెక్షన్స్ రిపోర్ట్: పెద్ద హీరోలకు ఏమాత్రం తీసిపోని అనుష్క..
అరుంధతి, రుద్రమదేవి, లాంటి లేడీ ఓరియంటెడ్ సినిమాలతో తనకంటూ సొంత ఇమేజ్ క్రియేట్ చేసుకున్న అనుష్క.. తాజాగా 'భాగమతి'గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. పిల్ల జమీందార్, సుకుమారుడు లాంటి క్లాస్ సినిమాల దర్శకుడు అశోక్ తొలిసారిగా ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్ తో రావడం కూడా సినిమాపై క్యురియాసిటీ కలిగేలా చేసింది. బాక్స్ ఆఫీస్ వద్ద పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా తొలిరోజు మంచి కలెక్షన్లే రాబట్టింది..
భాగమతి సినిమా రివ్యూ: మెప్పించిన అనుష్క
తొలిరోజు.. ఐదున్నర కోట్లు:
ఏపీ, తెలంగాణల్లో కలిపి తొలిరోజు ఈ సినిమా రూ.5.50కోట్లు వసూలు చేయడం విశేషం. సంక్రాంతి తర్వాత ఇప్పటి వరకు మూవీస్ లేకపోవడం సినిమాకి కలిసొచ్చిందని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు.
పెద్ద హీరోల రేంజ్లో
'భాగమతి' మార్నింగ్&మ్యాట్నీ షోల ఆక్యుపెన్సీ ఇప్పటికే 50% క్రాస్ అయినట్లు సమాచారం. సాధారణంగా పెద్ద హీరోల సినిమాలకు మాత్రమే ఈ స్థాయిలో ఆక్యుపెన్సీ ఉంటుంది. అయితే లేడీ ఓరియెంటెడ్ సినిమాకు కూడా ఈ స్థాయి ఓపెనింగ్స్ వస్తుండటం అనుష్కకే సాధ్యమైందంటున్నారు.
ఏరియాల వారీగా..:
నైజాం- రూ.2.10కోట్లు, సీడెడ్-రూ.0.75లక్షలు, ఉత్తరాంధ్ర-రూ.0.70లక్షలు, గుంటూరు-రూ.0.60లక్షలు,ఈస్ట్ గోదావరి-రూ.0.40లక్షలు,వెస్ట్ గోదావరి-0.30లక్షలు, కృష్ణ-రూ.0.38లక్షలు, నెల్లూరు-రూ.0.27లక్షలు. అన్నీ కలిపి మొత్తంగా రూ.5.50కోట్లు 'భాగమతి' కలెక్ట్ చేసింది.
టికెట్ రేట్స్ పెంచలేదు..:
నిజానికి ఈమధ్య ఏ పెద్ద హీరో సినిమా విడుదలైన టికెట్ రేట్లు పెంచి అమ్ముతున్నారు. కానీ 'భాగమతి'కి మాత్రం సాధారణ రేట్లతోనే టికెట్ విక్రయాలు జరిగాయి. ఒకవేళ టికెట్ రేట్స్ పెంచి గనుక ఉంటే.. 'భాగమతి' కలెక్షన్స్ లెక్క మరోలా ఉండేదేమో!
భారీ రిలీజ్..:
లేడీ ఓరియెంటెడ్ సినిమా అయినప్పటికీ.. పెద్ద హీరోల సినిమాలకు ఏమాత్రం తగ్గని స్థాయిలో సినిమాను విడుదల చేశారు నిర్మాతలు. తెలుగు రాష్ట్రాల్లో సుమారు 500 కి పైగా థియేటర్స్ లో 'భాగమతి' విడుదలైంది. అలాగే నిర్మాణ విలువల్లోనూ, ప్రమోషన్ విషయంలో యూవీ క్రియేషన్స్ ఎక్కడా వెనక్కి తగ్గలేదు.
అన్నీ కలిసొచ్చాయి:
'భాగమతి'కి అన్ని చోట్లా పాజిటివ్ సమీక్షలు రావడం సినిమాకు ప్లస్ అయింది. పైగా పోటీలో మరో సినిమా లేకపోవడం కూడా కలిసొచ్చింది. గతంలొ జేజమ్మ పాత్రతో అనుష్క చేసిన మెస్మరైజ్.. 'భాగమతి'తో మళ్లీ రిపీటవుతుందన్న క్యురియాసిటీ కూడా థియేటర్లకు ప్రేక్షకులను రప్పించేలా చేసింది. మొత్తంగా అనుష్క భాగమతికి అన్నీ బాగానే కలిసొచ్చాయనే చెప్పాలి.