twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    భాగమతి కలెక్షన్ల గర్జన.. ఇక జనంలోకి జేజమ్మ

    By Rajababu
    |

    క్వీన్ ఆఫ్ టాలీవుడ్ అనుష్క ముఖ్య పాత్రలో తెరకెక్కించిన భాగమతి చిత్రం విడుద‌ల‌య్యి ఘ‌న‌ విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే క‌లెక్ష‌న్ల ప‌రంగా దూసుకుపోతుంది. ఈ చిత్రానికి ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో ప్రేక్షకులతో కలిసి చిత్రాన్ని వీక్షించాలని అనుష్క నిర్ణయం తీసుకొన్నారు. ఈ మేరకు ఏపీలోని కొన్ని పట్టణాల్లోని థియేటర్లను అనుష్క సందర్శించనున్నారు.

    భాగమతిగా అనుష్క

    భాగమతిగా అనుష్క

    ఓ అధికారి త‌న‌ ముందుకు వచ్చిన స‌మ‌స్య చూసి బెదిరిపోకుండా ఆ స‌మ‌స్య‌ని ఎలా ఎదుర్కోన్నారు.. ప‌దిమందికి ఎలా ఉప‌యోగ‌ప‌డ్డారు అనే కాన్సెప్ట్‌తో భాగమతి చిత్రం రూపొందింది. ఈ సినిమా దక్షిణాదిలో విజ‌యఢంకా మెగిస్తున్నది. అంతేకాదు ఈ చిత్రానికి అత్య‌ధికంగా మ‌హిళా ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ ఎక్కువుగా వుండ‌టం విశేషం.

    మహిళలకు థ్యాంక్స్

    మహిళలకు థ్యాంక్స్

    భాగ‌మ‌తి చిత్రాన్ని చూసి ఆశీర్వ‌దించిన మ‌హిళా లోకానికి త‌న వంతుగా థ్యాంక్స్ చెప్ప‌టానికి అనుష్క గారు విచ్చేస్తున్నారు. ఇది కేవ‌లం మ‌హిళా ప్రేక్ష‌కుల‌కి మాత్ర‌మే అని చిత్ర నిర్వాహకులు తెలిపారు.

    ఏపీలో అనుష్క పర్యటన

    ఏపీలో అనుష్క పర్యటన

    భాగ‌మ‌తి రూపంలో అనుష్క పర్యటించనున్న సినీ అడ్డాలు ఇవే. సోమవారం (05-02-2017) విజ‌య‌వాడలోని రాజ్ థియేట‌ర్‌ (మార్నింగ్ షో), ఏలూరు మినీ స‌త్య‌నారాయ‌ణ (మ్యాట్ని), రాజ‌మండ్రి స్వామి థియేటర్లో (మొద‌టి ఆట‌) సమయంలో మహిళలతో కూర్చొని భాగమతి సినిమాను చూస్తారు.

    50 కోట్ల క్లబ్‌లోకి

    50 కోట్ల క్లబ్‌లోకి

    భారీ అంచనాల మధ్య జనవరి 26న రిలీజ్ అయిన భాగమతి చిత్రం భారీ కలెక్షన్లను సాధిస్తున్నది. తొలివారం ముగిసే సమయానికి భాగమతి చిత్రం 50 కోట్ల రూపాయల క్లబ్‌లోకి చేరింది. రెండోవారంలో కూడా మంచి కలెక్షన్లను సాధించడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.

    తెలుగు రాష్ట్రాల్లో..

    తెలుగు రాష్ట్రాల్లో..

    ప్రపంచవ్యాప్తంగా భాగమతి కలెక్షన్లు ఇలా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం 25.2 కోట్ల గ్రాస్, 16.2 కోట్ల నికర వసూళ్లను సాధించడం గమనార్హం.

    ప్రాంతాల వారీగా వసూళ్లు

    ప్రాంతాల వారీగా వసూళ్లు

    నైజాంలో 6.5 కోట్లు, వైజాగ్‌లో 2.10 కోట్లు, తూర్పు గోదావరి జిల్లాలో 1.32 కోట్లు, కృష్ణా రూ.1.16 కోట్లు, గుంటూరు 1.27 కోట్లు, పశ్చిమ 90 లక్షలు, నెల్లూరు రూ.70 లక్షల నికర వసూళ్లను సాధించింది.

    ఓవర్సీస్‌ మార్కెట్‌లో

    ఓవర్సీస్‌ మార్కెట్‌లో

    కర్ణాటకలో ఈ చిత్రం రూ.2.35 కోట్లు, తమిళనాడులో రూ.3.55 కోట్లు, కేరళలో 75 లక్షలు, దేశంలోని మిగితా ప్రాంతాల్లో 70 లక్షలు, అమెరికాలో 2.45 కోట్లు, మిగితా దేశాల్లో 1.60 కోట్ల వసూళ్లను సాధించడం విశేషం.

    English summary
    Bhaagamathie starring Anushka Shetty has continued to do good at the box office and has collected over Rs.50 crore worldwide. The Telugu, Tamil and Malayalam versions of Bhaagamathie together have minted over Rs. 75 lakhs in India.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X