Bhagavanth Kesari: పరాయి దేశంలో బాలయ్య సంచలనం.. పవన్ కల్యాణ్, మహేశ్ బాబు రికార్డులు మటాష్

'అఖండ', 'వీర సింహా రెడ్డి' వంటి బ్లాక్ బస్టర్ మూవీలతో మునుపటి ఫామ్‌ను అందిపుచ్చుకున్నారు నటసింహా నందమూరి బాలకృష్ణ. ఈ జోష్‌లోనే ఆయన వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ ముందుకు సాగుతోన్నారు. ఇలా ఇప్పుడు 'భగవంత్ కేసరి' అనే చిత్రంలో నటించారు.

క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన ఈ సినిమా అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా బాలయ్య సినిమా పరాయి దేశంలో సంచలనం సృష్టిస్తూ ఎన్నో రికార్డులు బ్రేక్ చేసింది. అసలేం జరిగింది? ఆ పూర్తి వివరాలను మీరే చూసేయండి!

Bhagavanth Kesari Breaks Mahesh Babu and Pawan Kalyan Records in USA Advance Sales

భగవంత్ కేసరిగా బాలయ్య: నటసింహా నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన తాజా చిత్రమే 'భగవంత్ కేసరి'. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ మూవీలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా.. శ్రీలీల కీలక పాత్రను చేసింది. అర్జున్ రాంపాల్ విలన్‌గా చేశాడు. ఇక, ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించారు. దీనికి థమన్ సంగీతాన్ని అందించాడు.

Bhagavanth Kesari Breaks Mahesh Babu and Pawan Kalyan Records in USA Advance Sales

రిలీజ్‌కు రెడీ... ఫుల్ జోష్‌: బాలయ్య నటించిన 'భగవంత్ కేసరి' మూవీని అక్టోబర్ 19న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు. దీంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను ఎప్పుడో మొదలెట్టేసింది. ఇప్పటికే పలు ఇంటర్వ్యూలు, ఈవెంట్లు కూడా కంప్లీట్ అయ్యాయి. అలాగే, మరిన్ని కార్యక్రమాలనూ ప్లాన్ చేస్తున్నారు. ఇలా భగవంత్ కేసరి రిలీజ్ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ జోష్ కనిపిస్తోంది.

అప్పుడే మంచి టాక్‌తోనే: మాస్, క్లాస్ కాంబినేషన్‌లో రూపొందిన 'భగవంత్ కేసరి' సినిమా విడుదలకు సమయం దగ్గర పడడంతో చిత్ర యూనిట్ సెన్సార్ కార్యక్రమాలను కంప్లీట్ చేసేసుకుంది. ఇది డీసెంట్‌ రన్ టైంతోనే రాబోతుంది. ముఖ్యంగా ఈ చిత్రంపై సెన్సార్ సభ్యులు మంచి అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు టాక్ వచ్చింది. దీంతో ఈ చిత్రం రిలీజ్‌కు ముందే పాజిటివ్ హైప్ లభించింది.

ఆ దేశంలోనూ భారీగానే: హై ఓల్టేజ్ యాక్షన్‌తో తెరకెక్కిన 'భగవంత్ కేసరి' మూవీకి సంబంధించిన ఓవర్సీస్ హక్కులను సరేగమా సినిమాస్ సంస్థ భారీ ధరకు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అందుకు అనుగుణంగానే యూఎస్ సహా చాలా ప్రాంతాల్లో ఈ సినిమాను అత్యంత గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేసింది. దీంతో ఇది బాలయ్య కెరీర్‌లోనే గ్రాండ్ రిలీజ్‌ను సొంతం చేసుకోనుంది.

Bhagavanth Kesari Breaks Mahesh Babu and Pawan Kalyan Records in USA Advance Sales

రికార్డు చేరడం ఖాయమే: నార్త్ అమెరికాకు సంబంధించిన 'భగవంత్ కేసరి' మూవీ అడ్వాన్స్ బుకింగ్స్‌ను చాలా రోజుల క్రితమే ఓపెన్ చేశారు. అక్కడ బాలయ్య సినిమాకు ఊహించని రీతిలో హైప్ ఏర్పడడంతో టికెట్లకు భారీ డిమాండ్ వచ్చింది. ఫలితంగా ఇప్పటికే చాలా టికెట్లు కూడా అమ్ముడుపోయాయి. ఇలా ఈ సినిమా ప్రీమియర్స్ పూర్తయ్యే నాటికి 1 మిలియన్ డాలర్ మార్కును చేరే ఛాన్స్ ఉంది.

Bhagavanth Kesari Breaks Mahesh Babu and Pawan Kalyan Records in USA Advance Sales

సంచలనం.. రికార్డు బ్రేక్: 'భగవంత్ కేసరి' మూవీ రిలీజ్‌కు ఐదు రోజులు మిగిలి ఉండగానే యూఎస్‌లో 220K డాలర్లను వసూలు చేసింది. తద్వారా వేగంగా ఇంత వసూలు చేసిన బాలయ్య మొదటి సినిమాగా నిలిచింది. అదే సమయంలో పవన్ కల్యాణ్ నటించిన 'భీమ్లా నాయక్' 202K డాలర్లు, మహేశ్ బాబు 'సర్కారు వారి పాట' 214K రికార్డులను సైతం మటాష్ చేసేసి సత్తా చాటింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X