Bhagavanth Kesari day 1 Advance Booking షాకింగ్‌గా భగవంత్ కేసరి అడ్వాన్స్ బుకింగ్.. బాలయ్య మూవీపై ఆ హీరో దెబ్బ
నటసింహం నందమూరి బాలకృష్ణ, సీనియర్ హీరోయిన్ కాజల్ అగర్వాల్, టాలీవుడ్ సెన్సేషన్ శ్రీలీల, బాలీవుడ్ సీనియర్ నటుడు అర్జున్ రాంపాల్ తదితరులు నటించిన చిత్రం భగవంత్ కేసరి. స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను షైన్ స్క్రీన్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించారు. అక్టోబర్ 19వ తేదీన రిలీజ్ అవుతున్న ఈ సినిమా బడ్జెట్ ఎంత? ప్రపంచవ్యాప్తంగా ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? అనే వివరాల్లోకి వెళితే..
భగవంత్ కేసరి చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని సుమారుగా 90 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఇక ఈ సినిమా బిజినెస్ కూడా భారీగానే జరిగినట్టు సమాచారం. ఈ సినిమాను డిమాండ్‌కు తగినట్టుగా తెలుగు రాష్ట్రాల్లో 1110 స్క్రీన్లలో రిలీజ్ చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 1500 స్క్రీన్లలో రిలీజ్ చేస్తున్నట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

భగవంత్ కేసరి చిత్రం అడ్వాన్స్ బుకింగ్ తెలుగు రాష్ట్రాల్లో నిదానంగా ప్రారంభమైంది. అయితే రిలీజ్‌కు ముందు రోజు ఈ సినిమాకు మంచి క్రేజ్ పెరిగే అవకాశం ఉంది. తాజా సమాచారం ప్రకారం.. ఆంధ్రా, నైజాంలో ఈ చిత్రం ఇప్పటి వరకు 2 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది. మరో రెండు రోజుల్లో ఈ సినిమా కలెక్షన్లు ఏ రేంజ్‌లో పెరుగుతాయో వేచి చూడాల్సిందే.
ఇక కర్ణాటకలో భగవంత్ కేసరి అడ్వాన్స్ బుకింగ్‌కు పెద్దగా స్పందన కనిపించలేదు. ఇప్పటి వరకు బెంగళూరులోనే భారీగా అడ్వాన్స్ బుకింగ్ ఫర్వాలేదనిపించింది. ఈ చిత్రం కర్ణాటకలో 25 లక్షల గ్రాస్, బెంగళూరులో 15 లక్షల రూపాయల గ్రాస్ అడ్వాన్స్ బుకింగ్ రూపంలో వసూళ్లను రాబట్టిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అయితే ఈ సినిమాకు విజయ్ నటించిన లియో సినిమాతో భారీగా దెబ్బ పడే అవకాశం ఉంది.

భగవంత్ కేసరి చిత్రానికి సంబంధించిన యూఎస్ఏ అడ్వాన్స్ బుకింగ్ వస్తే.. ఇప్పటి వరకు 350k డాలర్లు అంటే.. 30 లక్షల రూపాయలు వసూలు చేసింది. ఈ చిత్రాన్ని 350 లోకేషన్లలో 950 షోలకుపైగా ప్రదర్శిస్తున్నారు. ఇప్పటి వరకు 13K టికెట్లకుపైగా అమ్మకాలు జరిగాయి. రానున్న రోజుల్లో ఇంకా పెరిగే అవకాశం ఉంది.

భగవంత్ కేసరి చిత్రం ఇండియా వైడ్ అడ్వాన్స్ బుకింగ్ విషయానికి వస్తే.. తాజా సమాచారం ప్రకారం.. 2.5 కోట్లు గ్రాస్, ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 5.2 కోట్ల గ్రాస్ కలెక్షన్లను అడ్వాన్స్ బుకింగ్ రూపంలో వసూలు చేసింది. ఇక బాలయ్య నటించిన వీరసింహారెడ్డి చిత్రం ప్రపంచవ్యాప్తంగా 14.25 కోట్ల మేర అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్లు సాధించింది. ఆ సినిమా అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్లను భగవంత్ కేసరి అధిగమిస్తుందా? అనేది వేచి చూడాల్సిందే.

నందమూరి బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి తొలి రోజు రికార్డు కలెక్షన్లు సాధించింది. ఈ చిత్రం తొలి రోజున 54 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. అయితే భగవంత్ కేసరి సినిమా విషయానికి వస్తే.. ఈ చిత్రం 35 నుంచి 40 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. వచ్చే రెండు రోజుల్లో భారీగా అడ్వాన్స్ బుకింగ్ నమోదైతే.. ఈ చిత్రం వీరసింహారెడ్డి కలెక్షన్లను టచ్ చేసే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











