Bhagvanth Kesari Collections షాకింగ్‌గా భగవంత్ కేసరి కలెక్షన్లు.. 8వ రోజు ఎన్ని కోట్లంటే?

నందమూరి బాలకృష్ణ, టాలీవుడ్ సెన్సేషన్ శ్రీలీల కాంబినేషన్‌లో స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి రూపొందించిన చిత్రం భగవంత్ కేసరి. తెలంగాణ, మహిళా సాధికారిత నేపథ్యంగా రూపొందిన ఈ సినిమా తొలి రోజు నుంచి భారీగానే కలెక్షన్లు కురిపించినా.. రోజు రోజుకు పడిపోతూ వస్తున్నది. వారం రోజుల్లో 100 కోట్ల రూపాయలు వసూలు చేసిన ఈ సినిమా 8వ రోజు ఏ రేంజ్ కలెక్షన్లను వసూలు చేసిందనే వివరాల్లోకి వెళితే..

భగవంత్ కేసరి చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. బాలకృష్ణ, శ్రీలీల రెమ్యునరేషన్స్, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ సినిమాకు 100 కోట్ల బడ్జెట్ అయింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. వరల్డ్ వైడ్‌గా 70 కోట్ల మేర బిజినెస్ జరిగింది. దాంతో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను 72 కోట్లుగా ట్రేడ్ వర్గాలు నిర్ణయించాయి.ఈ సినిమాకు భారీ క్రేజ్ ఉండటంతో దాదాపు 1500 స్క్రీన్లలో రిలీజ్ చేశారు.

 Bhagvanth Kesari 8 days official Collections worldwide: Balakrishna movie drops 33 percent at box office

భగవంత్ కేసరి సినిమా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తొలి రోజు ఈ మూవీ 33 కోట్ల మేర వసూళ్లు సాధించింది. ఈ సినిమా రెండో రోజు 19 కోట్ల రూపాయలు, మూడో రోజు 11 కోట్ల రూపాయలు, నాలుగో రోజు 14 కోట్ల రూపాయలు, ఐదో రోజు 10 కోట్ల రూపాయలు, ఆరో రోజు 16 కోట్ల రూపాయలు, ఏడో రోజు 8 కోట్ల రూపాయలు వసూలు చేసింది. గత ఏడు రోజుల్లో 104 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించింది.

 Bhagvanth Kesari 8 days official Collections worldwide: Balakrishna movie drops 33 percent at box office

దసరా సెలవుల ప్రభావం భగవంత్ కేసరి మూవీపై భారీగా కనిపించింది. హాలీడేస్‌లో ఈ సినిమా గట్టిగానే కలెక్షన్లను రాబట్టింది. సెలవులు ముగిసిన తర్వాత క్రమేపీ ఈ సినిమా కలెక్షన్లు క్షీణిస్తూ వస్తున్నాయి. 8వ రోజు కూడా పెద్దగా ఆక్యుపెన్సీ నమోదు కాకపోవడంతో గత రెండు రోజులతో పోలిస్తే.. 50శాతానికి పైగా వసూళ్లు పడిపోయాయి.

 Bhagvanth Kesari 8 days official Collections worldwide: Balakrishna movie drops 33 percent at box office

ఇక భగవంత్ కేసరి సినిమా 8వ రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లపరంగా నిలకడగానే కనిపించింది. ఈ సినిమా 8వ రోజున ఇండియాలో 3.5 కోట్ల వసూళ్లు సాధించింది. ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 6 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. దాంతో ఈ సినిమా 110 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది.

 Bhagvanth Kesari 8 days official Collections worldwide: Balakrishna movie drops 33 percent at box office

భగవంత్ కేసరి చిత్రం 72 కోట్ల రూపాయల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ప్రస్తుతానికి ప్రపంచవ్యాప్తంగా 84 కోట్లకుపైగా నికర వసూళ్లు, 110 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. ఇండియాలో ఈ సినిమా 72 కోట్ల నికర వసూళ్లు, ఓవర్సీస్‌లో 12 కోట్ల నికర వసూళ్లు సాధించింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ జోన్‌లో ప్రవేశించి లాభాలను గడిస్తున్నది. రానున్న రోజుల్లో ఈ సినిమా ఏ రేంజ్ లాభాలను పంచిపెడుతుందో వేచి చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X