Bhagvanth Kesari Day 3 Collections బాలయ్య, శ్రీలీల బాక్సాఫీస్ మ్యాజిక్.. 3వ రోజు ఎన్ని కోట్ల కలెక్షన్లు!
నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి చిత్రం బాక్పాఫీస్ వద్ద నిలకడగా కలెక్షన్లను సాధిస్తున్నది. దసరా పండుగ రేసులో రిలీజైన సినిమాల నుంచి పోటీని తట్టుకొని ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్లు సాధిస్తున్నది. ఈ సినిమా తొలి రోజు భారీ వసూళ్లు సాధించిన తర్వాత రెండో రోజు కలెక్షన్ల పరంగా కొంత తగ్గాయి. అయితే మూడో రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
భగవంత్ కేసరి సినిమా బడ్జెట్ విషయానికి వస్తే.. ఈ చిత్రాన్ని 100 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగానే జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో 58 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 70 కోట్ల రూపాయలు మేర బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ 72 కోట్ల రూపాయలుగా నిర్ణయించారు.

ఇక భగవంత్ కేసరి సినిమా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తొలి రోజు నైజాం, ఆంధ్రాలో కలిపి 23 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది. ఇక ఓవర్సీస్‌లో 8 కోట్లకుపైగా గ్రాస్, ఇండియాలో మొత్తంగా 24 కోట్ల గ్రాస్, 20 కోట్ల షేర్ రాబట్టింది. తొలి రోజు మొత్తంగా 33 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను ప్రపంచవ్యాప్తంగా రాబట్టింది.
ఇక భగవంత్ కేసరి సినిమా 2వ రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. 7 కోట్ల రూపాయలు, ఇండియా వైడ్‌గా 9 కోట్ల రూపాయలు గ్రాస్ వసూలు చేసింది. ఇక ప్రపంచవ్యాప్తంగా 19 కోట్లకుపైగా గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది. దాంతో ఈ సినిమా రెండు రోజుల్లో 51 కోట్ల రూపాయలు వసూలు చేసింది.

ఇక మూడో రోజు భగవంత్ కేసరి ఆక్యుపెన్సీ విషయానికి వస్తే.. తెలుగు రాష్ట్రాల్లో 50 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. మార్నింగ్ షోకు 34 కోట్ల రూపాయలు, మ్యాట్నీకి 50 శాతం, ఫస్ట్ షోకు 57 శాతం, సెకండ్ షోకు 60 శాతం వసూళ్లను రాబట్టింది. వరంగల్‌లో అత్యధికంగా 60 శాతానికి పైగా, ఆ తర్వాత కాకినాడలో 55 శాతం, విజయవాడ, గుంటూరులో 50 శాతానికిపైగా ఆక్యుపెన్సీ నమోదైంది.

భగవంత్ కేసరి సినిమా మూడో రోజు కలెక్షన్ల అంచనా వివరాల్లోకి వెళితే.. ఇండియావైడ్ 8 కోట్ల రూపాయల షేర్, 15 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టవచ్చని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇక ఓవర్సీస్, ఇతర ప్రాంతాల్లో కలెక్షన్లను కలుపుకొంటే.. ఈ సినిమా 18 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టే ఛాన్స్ కనిపిస్తున్నది. దాంతో ఈ సినిమా 70 కోట్ల మేర గ్రాస్ వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











