తుఫానులో కూడా ‘భాయ్’...

By Srikanya

హైదరాబాద్ : రాష్టం తుఫాన్ తో అతలా కుతలం అయిపోతున్న సమయంలో నాగార్జున తాజా చిత్రం 'భాయ్'విడుదలైంది. ఈ చిత్రం ప్రదర్శిస్తున్న థియేటర్లు అద్భుతమైన ఓపెనింగ్స్‌ని సాధించాయని, నాగార్జున కెరీర్‌లోనే హయ్యస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా రికార్డు సృష్టించిందని సినిమా సహ నిర్మాత ఎన్.సాయిబాబు తెలిపారు. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., రిలయన్స్ ఎంట్‌టైన్‌మెంట్ పతాకంపై వీరభద్రం దర్శకత్వంలో నాగార్జున నిర్మించిన 'భాయ్'చిత్రం ఈ నెల 25న విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి అనూహ్యమైన స్పందన లభిస్తూ, యూత్‌ని, మాస్‌ని, ఫ్యామిలీ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ సాగుతుందని ఆయన చెప్తున్నారు.

ఎగ్జిక్యూటివ్ నిర్మాత ఎన్.సాయిబాబు మాట్లాడుతూ ' హెవీ రెయిన్స్‌లో సైతం మా చిత్రానికి ఎక్స్‌ట్రార్డినరీ ఓపెనింగ్స్ వచ్చాయి. తొలి రోజున ఆంధ్ర ప్రదేశ్‌లో రూ. 4 కోట్ల 8 లక్షల షేర్ కలెక్ట్ చేసి నాగార్జున కెరీర్‌లో హయ్యస్ట్ ఓపెనింగ్ సాధించిన చిత్రంగా రికార్డ్ నెలకొల్పింది. అన్ని ఏరియాల్లో కలెక్షన్లు బాగున్నాయి. నాగార్జున స్టయిల్, ఆయన మీద చిత్రీకరించిన సాంగ్స్, యాక్షన్ సీక్వెన్స్, అలాగే నాగార్జున, బ్రహ్మనందం కాంబినేషన్‌లో తీసిన కామెడీ సీన్లు బాగా హైలైట్ అయ్యాయి. ఇంత ఘనవిజయాన్ని మాకు అందించిన ప్రేక్షకులకు, నాగార్జున అభిమానులకు మా కృతజ్ఞతలు' అన్నారు.

దర్శకుడు వీరభద్రమ్ మాట్లాడుతూ ' ఆడియన్స్‌తో కలిసి ఈ సినిమా చూశాను. అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సినిమాకి అన్ని ఏరియాల నుంచి సూపర్‌హిట్ టాక్ రావడం చాలా ఆనందంగా ఉంది. అన్నపూర్ణ స్టూడియోస్ వంటి పెద్ద సంస్థలో తాను ఈ చిత్రాన్ని నిర్మించడం అదృష్టంగా భావిస్తున్నానని, అన్నిచోట్లనుండి సూపర్‌హిట్ టాక్ వస్తుండడం ఆనందాన్నిస్తోందని, ఎంటర్‌టైన్ మూవీగా ప్రేక్షకులు ఆదరిస్తూ హయ్యెస్ట్ ఓపెనింగ్స్ ఇస్తున్నారు' అన్నారు.

ఈ చిత్రంలో రిచా గంగోపాధ్యాయ్, హంసా నందినీ, నథాలియా కౌర్, కామ్నా జఠ్మలానీ, సోనూసూద్, ఆశిష్ విద్యార్థి, బ్రహ్మానందం, షాయాజీ షిండే, ఆదిత్యా మీనన్, సుప్రీత్, అజయ్, ఎం.ఎస్.నారాయణ, రఘుబాబు, జయప్రకాష్‌రెడ్డి, నాగినీడు, జరాషా, చలపతిరావు, రాహుల్‌దేవ్, వెనె్నల కిశోర్, ప్రసన్న, హేమ, రజిత, గీతాంజలి తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి సంగీతం:దేవిశ్రీప్రసాద్, కెమెరా:సమీర్‌రెడ్డి, మాటలు:సందీప్ - రత్నబాబు, పాటలు:రామజోగయ్యశాస్ర్తీ, అనంత్ శ్రీరామ్, ఎడిటింగ్:కార్తీక శ్రీనివాస్, నిర్మాత:నాగార్జున, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:వీరభద్రం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X