twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నాగ్ ‘భాయ్' రైట్స్ రికార్డ్

    By Srikanya
    |

    హైదరాబాద్ : యాక్షన్ కామెడీగా రూపొందుతున్న నాగార్జున తాజా చిత్రం 'భాయ్' . పూలరంగడు,అహనా పెళ్లంట ఫేమ్ వీరభద్రమ్ దర్శకత్వంలో రూపొందుతోంది. ఈ చిత్రం హిందీ డబ్బింగ్ రైట్స్ ఫ్యాన్సీ రేటుకు అమ్ముడైనట్లు వినపడుతోంది. దాదాపు 2.80 కోట్ల వరకూ ఈ రైట్స్ వెళ్లినట్లు చెప్పుకుంటున్నారు. బిజినెస్ కూడా అంతే స్పీడుగా జరుగుతోందని...వీరభద్రం హ్యాట్రిక్ కొడతాడని అంటున్నారు.

    ఈచిత్రాన్ని నాగార్జున పుట్టినరోజును పురస్కరించుకుని ఆగస్టు 29న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే యూరప్‌లోని స్లోవేనియా, ఇటలీల్లో నాగార్జున, రిచా గంగోపాధ్యాయలపై బృంద నృత్య దర్శకత్వంలో రెండు పాటల్ని షూట్ చేసుకుని వచ్చింది. వీరభద్రం తనదైన శైలిలో మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో కామ్నాజఠ్మలానీ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. రామ్‌గోపాల్‌వర్మ 'డిపార్ట్‌మెంట్' ఫేం నథాలియాకౌర్‌పై ఆ మధ్య ఐటం సాంగ్ చిత్రీకరించారు.

    నాగార్జున ఈ చిత్రం గురించి మాట్లాడుతూ....భాయ్ చిత్రం సీరియస్‌గా వుండే దావుద్ ఇబ్రహీం లాంటి కథ అని భావిస్తున్నారని, కానీ పూర్తి ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఈ చిత్రం ఉంటుందని ఆయన వివరించారు. అలాగే'భాయ్' పేరుతో వీరభద్రమ్ చౌదరి దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి నిజమే, కాని అది మాఫియా నేపథ్యం కాదు. 'హలో బ్రదర్' సినిమా తరహాలో పూర్తి వినోదాత్మకంగా వుంటుంది. ఇందులో నా పాత్ర 'కింగ్'లో బొట్టు శ్రీనులా వినోదాన్ని పంచుతుంది అన్నారు.

    దర్శకుడు వీరభద్రమ్ చౌదరి చిత్ర విశేషాలు తెలియజేస్తూ 'రెండున్నర గంటలు కడుపుబ్బా నవ్వించే చక్కటి హాస్య చిత్రమిది. 'హలో బ్రదర్' తరహాలో నాగార్జున పాత్ర చిత్రణ వుంటుంది. ఇందులో నాగార్జున మాఫియా డాన్ పాత్రను చేస్తున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదు. అసలు మాఫియా అనే అంశమే ఈ చిత్రంలో వుండదు. నాగార్జున సంభాషణలు, మేనరిజమ్స్ సరికొత్త పంథాలో వుంటాయి. ఆయన అభిమానుల్ని అలరించే అంశాలన్నీ 'భాయ్'లో వున్నాయి' అన్నారు.

    English summary
    Nagarjuna, Richa Gangopadhyaya film ‘Bhai’ which is bracing for grand release on Aug 29th is progressing at brisk pace. According to the latest, film's Hindi dubbing rights are sold for Rs 2.80 crs. Veerabhadram is directing the film on Annapurna Studios banner. Devi Sri Prasad is the music director.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X