Bhairathi Ranagal Day 1 Collections: దుమ్మురేపిన శివ రాజ్‌కుమార్.. భైరతీ రనగల్ ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?
కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, యంగ్ సెన్సేషన్ రుక్మిణి వసంత్,రాహుల్ బోస్ తదితరులు నటించిన చిత్రం భైరతీ రనగల్. పాపులర్ డైరెక్టర్ నార్తన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు గీతా శివరాజ్‌కుమార్ నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రంలో నానా పాటేకర్, యోగిబాబు, దేవరాజ్ తదితరులు నటించారు. ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతం అందించారు. నవంబర్ 15న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అయింది. ఈ సినిమా బడ్జెట్ ఎంత? కలెక్షన్ల వివరాలు ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత అనే వివరాల్లోకి వెళితే..
బైరాతీ రానగల్ సినిమా విషయానికి వస్తే.. నార్తన్ తొలి చిత్ర దర్శకుడిగా పరిచయమవుతూ రూపొందించిన చిత్రం మఫ్టీ మూవీకి ప్రీక్వెల్‌గా ఈ మూవీని తెరకెక్కించారు. గ్యాంగ్‌స్టర్‌గా మారిన లాయర్ భైరాతీ రనగల్ జీవితం ఆధారంగా రూపొందింది. కన్నడ రాష్ట్రాన్ని కనుసైగల్లో రాణించిన ఈ గ్యాంగ్‌స్టర్‌ను అండర్ కవర్ ఆపరేషన్ ద్వారా అరెస్ట్ చేశారు. అయితే భైరాతీ రానగల్ టైటిల్ పాత్రను శివరాజ్ కుమార్ పోషించారు.

గీతా పిక్చర్స్ బ్యానర్‌పై రూపొందించిన ఈ సినిమాకు భారీ బడ్జెట్‌తో రూపొందించారు. ఈ సినిమాలో నటించిన ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణులు పారితోషికం, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈమూవీని సుమారుగా 20 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఈ సినిమాను అత్యధికంగా కన్నడలోనే రిలీజ్ చేశారు. వరల్డ్ వైడ్‌గా ఈ సినిమాను 1000 స్క్రీన్లలో రిలీజ్ చేశారు.
భైరాతీ రనగల్ జీవిత కథపై ఆసక్తి ఉండటం, శివరాజ్ కుమార్ సినిమా కావడంతో తొలి రోజు మంచి ఆదరణ లభించింది. ఈ సినిమాకు కన్నడలోని ప్రధాన పట్టణాల్లో భారీగా ఆక్యుపెన్సీ నమోదైంది. ఈ సినిమా మార్నింగ్ షోకు 55 శాతానికిపైగా, మ్యాట్నీకి 60 శాతం, ఫస్ట్ షోకు 65 శాతం, సెకండ్ షోకు 70 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. బెంగళూరు, శివమొగ, మంగళూరు ప్రాంతాల్లో ఎక్కువగా ఆక్యుపెన్సీ కనిపించింది.

భైరాతీ రనగల్ మూవీ సినిమా కలెక్షన్ల విషయానికి వస్తే..కన్నడలోనే 2 కోట్ల రూపాయలు నికరంగా, 4 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది. ఇతర రాష్ట్రాల్లోను అలాగే ఓవర్సీస్‌లో కలిపి 6 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. వారాంతంలో ఈ సినిమాకు భారీగా కలెక్షన్లు వచ్చే అవకాశం ఉంది అని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నారు.
భైరాతీ రనగల్ మూవీ సుమారుగా ఓ మోస్తారు బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే 21 కోట్ల రూపాయల కలెక్షన్లు రాబట్టాల్సి ఉంటుంది. ఈ సినిమా తొలివారంలోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్ బ్రేక్ చేస్తుందనే ట్రేడ్ వర్గాలు వెల్లడించారు. రానున్న రోజుల్లో ఎలాంటి కలెక్షన్లు రాబడుతుందో వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











