Bhairavam Closing Collections Worldwide: భైరవం క్లోజింగ్ కలెక్షన్స్.. మంచు మనోజ్‌ మూవీకి లాభమెంత? నష్టమెంత?

పెన్ స్టూడియెస్‌ డాక్టర్ జయంతి లాల్ గడా సమర్పణలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కేకే రాధామోహన్ ఈ భైరవం చిత్రాన్ని నిర్మించారు. మంచు మనోజ్, నారా రోహిత్, బెల్లంకొండ శ్రీనివాస్ హీరోలుగా అదితి శంకర్, దివ్య పిళ్లై, ఆనంది హీరోయిన్లుగా నటించగా.. జయసుధ తదితరులు ఇతర కీలకపాత్రలో కనిపించారు. ఈ చిత్రానికి విజయ్ కనకమేడల దర్శకత్వం వహించగా మే 30వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. భైరవం సినిమా బడ్జెట్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? ఈ సినిమాకు లాభమెంత? నష్టమెంత? అనే వివరాల్లోకి వెళితే..

మంచు మనోజ్, నారా రోహిత్, బెల్లంకొండ శ్రీనివాస్‌లకు చాలా కాలంగా సరైన హిట్స్ లేవు. వ్యక్తిగత కారణాలతో మనోజ్ సినిమాలకు బ్రేక్ తీసుకున్నారు. ఇలాంటి దశలో ఖచ్చితంగా హిట్ కొట్టాలని ముగ్గురు నిర్ణయించుకుని చేసిన చిత్రమే భైరవం. తమిళంలో సూరి నటించిన గరుడన్ సినిమాకు రీమేక్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. టీజర్, ట్రైలర్, ప్రమోషనల్ కార్యక్రమాలతో ఈ చిత్రంపై బజ్ తీసుకొచ్చారు.

Bhairavam Box Office Closing Collections Worldwide How much loss or profit for Manchu Manoj s Movie

భైరవం బడ్జెట్ అండ్ బ్రేక్ఈవెన్ టార్గెట్
నటీనటులు, సాంకేతిక నిపుణులు, ప్రచార కార్యక్రమాలతో కలిపి భైరవం చిత్రాన్ని రూ.35 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. ప్రమోషనల్ కార్యక్రమాలతో ఈ సినిమాకు బిజినెస్ బాగానే జరిగింది. నైజాంలో రూ.6 కోట్లు, సీడెడ్‌లో రూ.2.5 కోట్లు, ఆంధ్రలో రూ.7.50 కోట్లు, కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్‌లో రూ.2.2 కోట్లు చొప్పున భైరవం చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా రూ.19 కోట్ల మేర బిజినెస్ చేసింది. అలాగే భైరవం సినిమా డిజిటల్, శాటిలైట్ రైట్స్‌ను జీ 5 సంస్థ రూ.32 కోట్లు వెచ్చించి దక్కించుకుందని ఫిలింనగర్ వర్గాలు తెలిపాయి. భైరవం సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే.. 20 కోట్ల రూపాయల షేర్.. 40 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టాల్సి ఉందని ట్రేడ్ పండితులు విలువ కట్టారు.

భైరవం కలెక్షన్స్
భైరవం చిత్రానికి ఇండియాలో తొలిరోజు రూ.2.6 కోట్ల ఓపెన్సింగ్ రాగా.. రెండో రోజు రూ.2.4 కోట్లు, మూడో రోజు రూ.2.4 కోట్లు, నాలుగో రోజున రూ.1.21 కోట్లు, ఐదో రోజున రూ.95 లక్షలు, ఆరో రోజున రూ.82 లక్షలు, ఏడో రోజున రూ.65 లక్షలు, ఎనిమిదవ రోజున రూ.55 లక్షలు, తొమ్మిదవ రోజున రూ.67 లక్షలు, పదో రోజున రూ.66 లక్షలు, పదకొండో రోజున రూ.34 లక్షలు, పన్నెండవ రోజున రూ.30 లక్షలు, పదమూడవ రోజున రూ.24 లక్షలు చొప్పున 13 రోజుల వరకు భైరవం చిత్రం ఇండియా వైడ్ రూ.13.83 కోట్ల నెట్, రూ.14.90 లక్షల గ్రాస్ వసూళ్లు రాబట్టినట్లు సాక్‌నిల్క్ తెలిపింది. ఓవర్సీస్‌లో తొలుత మంచి కలెక్షన్స్ సాధించినప్పటికీ తర్వాత భైరవం చిత్రం చతికిల పడింది. అక్కడ ఇప్పటి వరకు రూ.60 లక్షల కలెక్షన్స్ రాబట్టినట్లు సాక్‌నిల్క్ పేర్కొంది. దీంతో 13 రోజుల వరకు ఇండియాలో వచ్చిన గ్రాస్ + ఓవర్సీస్ కలెక్షన్స్ కలిపి భైరవం సినిమాకు ప్రపంచవ్యాప్తంగా రూ.15.50 కోట్లు మాత్రమే ఆర్జించింది.

భైరవం సినిమాకు లాభమెంత? నష్టమెంత?
పోటీ అవుతుందని అనుకున్న థగ్‌లైఫ్ చిత్రం డిజాస్టర్ కావడంతో భైరవం పుంజుకుంటుందని విశ్లేషకులు భావించారు. వీకెండ్ వరకు ఫర్వాలేదనే కలెక్షన్స్‌తో నడిచిన ఈ మల్టీస్టారర్ చిత్రం ఆ తర్వాత క్రమం తప్పకుండా వసూళ్లను కోల్పోయింది. భైరవం సినిమా థియేట్రికల్ బిజినెస్ వాల్యూ ప్రకారం చూస్తే.. ఈ సినిమా దాదాపు రూ.24 కోట్ల రికవరీ సాధించాల్సి ఉంది. ప్రస్తుతం ఉన్న ఊపు చూస్తుంటే భైరవం చిత్రం థియేట్రికల్ రన్ దాదాపు క్లోజ్ చేసినట్లే. దాంతో ఈ మల్టీస్టారర్ చిత్రం దాదాపు రూ.11 కోట్లకు పైగా నష్టాలను నిర్మాతలకు మిగిల్చింది.

అయితే ఓవరాల్ బడ్జెట్, థియేట్రికల్ బిజినెస్, ఓటీటీ రైట్స్, శాటిలైట్ రైట్స్, ఆడియో రైట్స్ అన్నింటి ద్వారా నిర్మాత ఒడ్డునపడే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. కొన్ని ఏరియాలలో ఈ సినిమాను థియేటర్ల నుంచి తొలగిస్తుండగా, ఈ వారాంతంతో థియేట్రికల్ రన్‌ ముగింపుపై పూర్తి క్లారిటీ రానుంది. మరి బెల్లంకొండ శ్రీనివాస్, మంచు మనోజ్‌లు తమ పరుగు ఆపే వరకు ఎన్ని కోట్లు రాబడతాడో వేచి చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X