Bhairavam Day 10 Collection: డిజాస్టర్ దిశగా థగ్‌లైఫ్.. రేసులోకి భైరవం.. మంచు మనోజ్ మూవీకి ఎన్ని కోట్లంటే?
మంచు మనోజ్, నారా రోహిత్, బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన భైరవం చిత్రం రెండో వారంలోకి ప్రవేశించింది. కమల్ హాసన్ నటించి థగ్‌లైఫ్ డిజాస్టర్‌గా నిలవడంతో భైరవం స్వల్పంగా లాభపడినట్లుగానే పరిస్దితులు కనిపిస్తున్నాయి. వీకెండ్ ఓ మోస్తరుగా చిత్రయూనిట్‌కు ఊరట కలిగించింది. ఈ నేపథ్యంలో 10వ రోజు భైరవం చిత్రం ఎన్ని కోట్లు రాబట్టింది? బ్రేక్ ఈవెన్ కావాలంటే ఈ సినిమా ఇంకెంత వసూలు చేయాలో చూస్తే.
భైరవం చిత్రం బడ్జెట్ ఎంత?
విజయ్ కనకమేడల దర్శకత్వం వహించిన భైరవం చిత్రంలో అదితి శంకర్, దివ్య పిళ్లై, ఆనంది హీరోయిన్లుగా నటించగా.. జయసుధ తదితరులు ఇతర కీలకపాత్రలో కనిపించారు. పెన్ స్టూడియెస్ డాక్టర్ జయంతి లాల్ గడా సమర్పణలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కేకే రాధామోహన్ ఈ భైరవం చిత్రాన్ని నిర్మించారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్లు, ప్రమోషనల్ కార్యక్రమాలతో కలిపి బైరవం చిత్రాన్ని మొత్తంగా రూ.35 కోట్ల బడ్జెజ్‌తో నిర్మించారు. మే 30న ఈ సినిమా విడుదలైంది.

భైరవం ప్రీ రిలీజ్ బిజినెస్ & బ్రేక్ ఈవెన్ టార్గెట్
భైరవం చిత్రం రిలీజ్‌కు ముందు నుంచే చిత్ర యూనిట్ ప్రమోషనల్ కార్యక్రమాలు ఓ రేంజ్‌లో చేసింది. ముగ్గురు హీరోలు కూడా ఏ చిన్న అవకాశాన్ని మిస్ చేయకుండా ప్రమోషన్స్ చేయడంతో ఈ సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ బాగానే జరిగింది. నైజాంలో రూ.6 కోట్లు, సీడెడ్‌లో రూ.2.5 కోట్లు, ఆంధ్రలో రూ.7.50 కోట్లు, కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్‌లో రూ.2.2 కోట్లు చొప్పున భైరవం చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా రూ.19 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్ జరిగింది. అలాగే ఈ సినిమా డిజిటల్, శాటిలైట్ రైట్స్‌ను జీ 5 సంస్థ రూ.32 కోట్లు వెచ్చించి దక్కించుకుందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. భైరవం సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే.. 20 కోట్ల రూపాయల షేర్.. 40 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టాల్సి ఉందని ట్రేడ్ పండితులు వాల్యూ నిర్దేశించారు.
భైరవం తొమ్మిది రోజుల వసూళ్లు
ఈ మల్టీస్టారర్ చిత్రానికి ఇండియాలో తొలిరోజు రూ.2.6 కోట్ల ఓపెన్సింగ్ రాగా.. రెండో రోజు రూ.2.4 కోట్లు, మూడో రోజు రూ.2.4 కోట్లు, నాలుగో రోజున రూ.1.21 కోట్లు, ఐదో రోజున రూ.69 లక్షలు, ఆరో రోజున రూ.53 లక్షలు, ఏడో రోజున రూ.40 లక్షలు, ఎనిమిదవ రోజున రూ.49 లక్షలు, తొమ్మిదవ రోజున రూ.60 లక్షల చొప్పున 9 రోజుల వరకు భైరవం చిత్రం రూ.11.35 కోట్ల నికర వసూళ్లు రాబట్టినట్లు సాక్‌నిల్క్ తెలిపింది. ఓవర్సీస్‌లో పడుతూ లేస్తూ ఇప్పటి వరకు భైరవం సినిమా రూ.55 లక్షల వసూళ్లు అందుకుంది.
భైరవం 10వ రోజు కలెక్షన్స్
వర్కింగ్ డేస్‌లో డల్‌గా వసూళ్లు సాధించిన ఈ చిత్రం వీకెండ్‌లో పుంజుకుంది. శుక్రవారం రూ.52 లక్షలు, శనివారం రూ.60 లక్షలు రాబట్టి చిత్ర యూనిట్‌కు జోష్ తెచ్చింది. 10వ రోజైన ఆదివారం నాడు ఈ చిత్రానికి ఓవరాల్‌గా 19.61 శాతం థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైంది. హైదరాబాద్‌లో 190, విజయవాడలో 53, విశాఖలో 62 చొప్పున షోలు ప్రదర్శితమయ్యాయి.
10వ రోజు భైరవం సినిమాకు ఇండియా వైడ్‌గా రూ.61 లక్షల నికర వసూళ్లు వచ్చినట్లు సాక్‌నిల్క్ తెలిపింది. తద్వారా పది రోజుల వరకు ఇండియాలో రూ.11.96 కోట్ల నెట్, రూ.14 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఓవర్సీస్ కలెక్షన్స్ + ఇండియాలో వచ్చిన గ్రాస్ కలిపి ఇప్పటి వరకు భైరవం చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.14.55 కోట్ల కలెక్షన్స్ అందుకుంది. థగ్‌లైఫ్ చిత్రం డిజాస్టర్ దిశగా పరుగులు తీస్తుండగా, శుక్రవారం రావాల్సిన హరిహర వీరమల్లు వాయిదా పడటంతో భైరవం కొంతకాలం థియేట్రికల్ రన్ కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సోమవారం నుంచి వర్కింగ్ డేస్ ప్రారంభం కావడంతో మరి ఈ వారం భైరవం ఎలాంటి వసూళ్లు సాధిస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











