Bhairavam Day 11 Collection: ఆ క్లబ్‌లోకి భైరవం.. మంచు మనోజ్ మూవీ హిట్ కొట్టాలంటే?

మంచు మనోజ్, నారా రోహిత్, బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన భైరవం చిత్రం స్లో అండ్ స్టడీగా వసూళ్లు రాబడుతోంది. మధ్యలో తడబడినట్లుగా అనిపించినప్పటికీ తిరిగి పుంజుకుని కలెక్షన్ల వేట కొనసాగిస్తోంది భైరవం. బ్రేక్ ఈవెన్ టార్గెట్ దరిదాపుల్లోకి రానప్పటికీ ప్రస్తుతం థియేటర్‌లలో పరిస్థితులు అనుకూలంగా ఉండటం ఈ సినిమాకు కలిసొచ్చే అంశం. ఈ నేపథ్యంలో 11వ రోజు భైరవం చిత్రం ఎన్ని కోట్లు రాబట్టింది? బ్రేక్ ఈవెన్ కావాలంటే ఈ సినిమా ఇంకెంత వసూలు చేయాలో చూస్తే.

భైరవం చిత్రం బడ్జెట్ ఎంత?
విజయ్ కనకమేడల దర్శకత్వం వహించిన భైరవం చిత్రంలో అదితి శంకర్, దివ్య పిళ్లై, ఆనంది హీరోయిన్లుగా నటించగా.. జయసుధ తదితరులు ఇతర కీలకపాత్రలో కనిపించారు. పెన్ స్టూడియెస్‌ డాక్టర్ జయంతి లాల్ గడా సమర్పణలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కేకే రాధామోహన్ ఈ భైరవం చిత్రాన్ని నిర్మించారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్లు, ప్రమోషనల్ కార్యక్రమాలతో కలిపి బైరవం చిత్రాన్ని మొత్తంగా రూ.35 కోట్ల బడ్జెజ్‌తో నిర్మించారు. మే 30న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది.

Bhairavam Day 11 Box Office Collections Worldwide Manchu Manoj s film entered in 15 crores club

భైరవం ప్రీ రిలీజ్ బిజినెస్ & బ్రేక్ ఈవెన్ టార్గెట్
ప్రమోషన్ కార్యక్రమాలు, ప్రీ రిలీజ్ ఈవెంట్‌తో భైరవం చిత్రంపై చిత్రసీమలో బజ్ నెలకొంది. ఈ కారణంతో ఈ సినిమాకు మంచి ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. నైజాంలో రూ.6 కోట్లు, సీడెడ్‌లో రూ.2.5 కోట్లు, ఆంధ్రలో రూ.7.50 కోట్లు, కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్‌లో రూ.2.2 కోట్లు చొప్పున భైరవం చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా రూ.19 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్ జరిగింది. అలాగే ఈ సినిమా డిజిటల్, శాటిలైట్ రైట్స్‌ను జీ 5 సంస్థ రూ.32 కోట్లు వెచ్చించి దక్కించుకుందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. భైరవం సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే.. 20 కోట్ల రూపాయల షేర్.. 40 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టాల్సి ఉందని ట్రేడ్ పండితులు వాల్యూ నిర్దేశించారు.

భైరవం పది రోజుల వసూళ్లు
ఈ మల్టీస్టారర్ చిత్రానికి ఇండియాలో తొలిరోజు రూ.2.6 కోట్ల ఓపెన్సింగ్ రాగా.. రెండో రోజు రూ.2.4 కోట్లు, మూడో రోజు రూ.2.4 కోట్లు, నాలుగో రోజున రూ.1.21 కోట్లు, ఐదో రోజున రూ.95 లక్షలు, ఆరో రోజున రూ.82 లక్షలు, ఏడో రోజున రూ.65 లక్షలు, ఎనిమిదవ రోజున రూ.55 లక్షలు, తొమ్మిదవ రోజున రూ.67 లక్షలు, పదవ రోజున రూ.66 చొప్పున పది రోజుల వరకు భైరవం చిత్రం రూ.11.96 కోట్ల నికర వసూళ్లు రాబట్టినట్లు సాక్‌నిల్క్ తెలిపింది. ఓవర్సీస్‌లో ఈ సినిమాకు రూ.55 లక్షల వసూళ్లు వచ్చాయి.

భైరవం 11వ రోజు కలెక్షన్స్
వీకెండ్‌లో సక్సెస్‌ఫుల్‌గా హోల్డ్ చేసిన భైరవం సినిమా వర్కింగ్ డే అయిన సోమవారం మరోసారి తడబడింది. 11వ రోజు ఈ చిత్రానికి ఓవరాల్‌గా 16.96 శాతం థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైంది. హైదరాబాద్‌లో 185, విజయవాడలో 52, విశాఖలో 71 చొప్పున షోలు ప్రదర్శితమయ్యాయి.

11వ రోజు భైరవం సినిమాకు ఇండియా వైడ్‌గా కేవలం రూ.34 లక్షల నికర వసూళ్లు మాత్రమే వచ్చినట్లు సాక్‌నిల్క్ తెలిపింది. తద్వారా పదకొండు రోజుల వరకు ఇండియాలో ఈ చిత్రం రూ.13.23 కోట్ల నెట్, రూ.14.90 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఓవర్సీస్ కలెక్షన్స్ + ఇండియాలో వచ్చిన గ్రాస్ కలిపి ఇప్పటి వరకు భైరవం చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.15.55 కోట్ల కలెక్షన్స్ అందుకుంది. మొత్తం మీద భైరవం చిత్రం రూ.15 కోట్ల క్లబ్‌లో చేరింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే మరో రూ.25 కోట్ల వరకు రాబట్టాల్సి ఉంది. ఈ వారం కొత్త చిత్రాల హవా లేకపోవడం భైరవం చిత్రానికి కలిసొచ్చే అంశం. మరి ముగ్గురు హీరోలు ఎలాంటి మేజిక్ చేస్తారో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X