Bhairavam Day 12 Collection: షాకిచ్చేలా వసూళ్లు.. బ్రేక్‌ఈవెన్ కష్టమే, భైరవం మూవీకి ఎన్ని కోట్లంటే?
మంచు మనోజ్, నారా రోహిత్, బెల్లంకొండ శ్రీనివాస్ హీరోలుగా అదితి శంకర్, దివ్య పిళ్లై, ఆనంది హీరోయిన్లుగా నటించిన చిత్రం భైరవం. తొలివారం బాగానే హోల్డ్ చేసిన ఈ మూవీ రెండో వారంలో మాత్రం తడబడుతోంది. సోమవారం నుంచి వసూళ్లు దారుణంగా పడిపోయాయి. ఆల్‌మోస్ట్ ఎండింగ్ స్టేజ్‌కు వచ్చేసిన నేపథ్యంలో 12వ రోజు భైరవం చిత్రం ఎన్ని కోట్లు రాబట్టింది? బ్రేక్ ఈవెన్ కావాలంటే ఈ సినిమా ఇంకెంత వసూలు చేయాలో చూస్తే.
భైరవం చిత్రం బడ్జెట్ ఎంత?
విజయ్ కనకమేడల దర్శకత్వం వహించిన భైరవం చిత్రంలో జయసుధ తదితరులు ఇతర కీలకపాత్రలో కనిపించారు. టెక్నీ కల్ వాల్యూస్ ఎక్కడ తగ్గకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుని, ఖర్చుకు వెనుకాడకుండా ఈ సినిమాను నిర్మించారు నిర్మాతలు. పెన్ స్టూడియెస్ డాక్టర్ జయంతి లాల్ గడా సమర్పణలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కేకే రాధామోహన్ ఈ భైరవం చిత్రానికి నిర్మాణ సారథ్యం వహించారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్లు, ప్రమోషనల్ కార్యక్రమాలతో కలిపి బైరవం చిత్రాన్ని మొత్తంగా రూ.35 కోట్ల బడ్జెజ్‌తో నిర్మించారు. మే 30న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది.

భైరవం ప్రీ రిలీజ్ బిజినెస్ & బ్రేక్ ఈవెన్ టార్గెట్
హిట్ కోసం ఏళ్లుగా సతమతం అవుతున్న ముగ్గురు హీరోలు విజయం కోసం తీవ్రంగా శ్రమించారు. ప్రమోషనల్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడంతో సినిమాకు మంచి బజ్ వచ్చింది. నైజాంలో రూ.6 కోట్లు, సీడెడ్‌లో రూ.2.5 కోట్లు, ఆంధ్రలో రూ.7.50 కోట్లు, కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్‌లో రూ.2.2 కోట్లు చొప్పున భైరవం చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా రూ.19 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్ జరిగింది. అలాగే ఈ సినిమా డిజిటల్, శాటిలైట్ రైట్స్‌ను జీ 5 సంస్థ రూ.32 కోట్లు వెచ్చించి దక్కించుకుందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. భైరవం సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే.. 20 కోట్ల రూపాయల షేర్.. 40 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టాల్సి ఉందని ట్రేడ్ పండితులు వాల్యూ నిర్దేశించారు.
భైరవం పదకొండు రోజుల వసూళ్లు
ఈ మల్టీస్టారర్ చిత్రానికి ఇండియాలో తొలిరోజు రూ.2.6 కోట్ల ఓపెన్సింగ్ రాగా.. రెండో రోజు రూ.2.4 కోట్లు, మూడో రోజు రూ.2.4 కోట్లు, నాలుగో రోజున రూ.1.21 కోట్లు, ఐదో రోజున రూ.95 లక్షలు, ఆరో రోజున రూ.82 లక్షలు, ఏడో రోజున రూ.65 లక్షలు, ఎనిమిదవ రోజున రూ.55 లక్షలు, తొమ్మిదవ రోజున రూ.67 లక్షలు, పదవ రోజున రూ.66 లక్షలు, పదకొండవ రోజున రూ.34 చొప్పున 11 రోజుల వరకు భైరవం చిత్రం రూ.13.23 కోట్ల నికర వసూళ్లు రాబట్టినట్లు సాక్‌నిల్క్ తెలిపింది. ఓవర్సీస్‌లో ఈ సినిమాకు రూ.60 లక్షల వసూళ్లు వచ్చాయి.
భైరవం 12వ రోజు కలెక్షన్స్
రెండో వారంలో నీరసంగా వసూళ్ల వేట ప్రారంభించిన ఈ సినిమా దాదాపుగా థియేట్రికల్ రన్ ముగింపు స్టేజ్‌కు వచ్చేసింది. 12వ రోజు ఓవరాల్‌గా 15.19 శాతం మేర థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైనట్లు సాక్‌నిల్క్ తెలిపింది. మంగళవారం భైరవం చిత్రానికి హైదరాబాద్‌లో 186 షోలు, విజయవాడలో 53, విశాఖలో 69 షోలు ప్రదర్శితమయ్యాయి.
12వ రోజు భైరవం సినిమాకు ఇండియా వైడ్‌గా కేవలం రూ.30 లక్షల నికర వసూళ్లు మాత్రమే వచ్చినట్లు సాక్‌నిల్క్ తెలిపింది. తద్వారా పన్నెండు రోజుల వరకు ఇండియాలో ఈ చిత్రం రూ.13.59 కోట్ల నెట్, రూ.15.12 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఓవర్సీస్ కలెక్షన్స్ + ఇండియాలో వచ్చిన గ్రాస్ కలిపి ఇప్పటి వరకు భైరవం చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.16 కోట్ల కలెక్షన్స్ ఆర్జించింది. పరిస్ధితులు చూస్తుంటే ఈ సినిమా థియేట్రికల్ రన్ ముగింపుకు చేరుకుంది. ఆదివారంతో ఈ మల్టీస్టార్ చిత్రానికి ఎండ్ కార్డ్ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. భైరవం బ్రేక్ ఈవెన్ సాధించాలంటే ఇంకా దాదాపు రూ.22 కోట్ల వరకు వసూళ్లు సాధించాల్సి ఉంది. ప్రస్తుత పరిణామాలను బట్టి టార్గెట్ కొట్టడం కష్టమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దాంతో నిర్మాతలకు భారీ నష్టాలు వస్తాయని అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications











